|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అవతార్ 3 రివ్యూ: జేమ్స్ కామెరూన్ అభిమానులకు షాక్! అంచనాలు తలకిందులు?

Published: 18-12-2025, 7:44 AM
అవతార్ 3 రివ్యూ: జేమ్స్ కామెరూన్ అభిమానులకు షాక్! అంచనాలు తలకిందులు?
  • అవతార్ 3: ఫైర్ అండ్ యాష్ విడుదల సిద్ధంగా ఉన్నా తొలి రివ్యూలు నెగటివ్‌గా ఉన్నాయి.
  • రొట్టెన్ టొమాటోస్ కేవలం 69% రేటింగ్ ఇవ్వగా, గార్డియన్ 2 రేటింగ్ తో డల్ అంది.
  • 3 గంటల 17 నిమిషాల భారీ రన్‌టైమ్ సినిమాకు ప్రధాన మైనస్‌గా నిలుస్తోంది.
  • అవతార్ 3లో లోక్ కథకుడు, మాంగ్ క్వాన్ (అగ్నిజాతి) తెగ ఎంట్రీతో కథ కొత్త మలుపు తిరుగుతుంది.

ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న జేమ్స్ కామెరూన్ ‘అవతార్ 3: ఫైర్ అండ్ యాష్’ తొలి రివ్యూలు అభిమానులను నిరాశపరిచాయి. రొట్టెన్ టొమాటోస్ 69% రేటింగ్ ఇవ్వగా, గార్డియన్ డల్ చిత్రం అంది. భారీ రన్‌టైమ్, కథాబలం లోపంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలా నిలబడుతుందో వేచి చూడాలి.

అవతార్ 3 తొలి రివ్యూలు: నిరాశే మిగిలిందా?

ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ అవతార్ ఫైర్ అండ్ యాష్ చిత్రం శుక్రవారం వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేయనుంది. అవతార్ ప్రాంచైజీపై అభిమానులలో ఇప్పటికే కనీవినీ ఎరుగని అంచనాలు ఏర్పడ్డాయి. అవతార్ మొదటి భాగం సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన అవతార్ 2 ప్రపంచ వ్యాప్తంగా 2 బిలియన్ డాలర్లు వసూలు చేసి బాక్సాఫీస్ ప్రభంజనం సృష్టించింది.

దీనితో ఈ ప్రాంఛైజీలో మూడవ భాగం అయిన అవతార్ ఫైర్ అండ్ యాష్ కోసం వరల్డ్ వైడ్ గా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రిస్టమస్ సెలవుల్లో అవతార్ 3ని ఎంజాయ్ చేసేందుకు అభిమానులు సిద్ధంగా ఉన్నారు. జేమ్స్ కామెరూన్ విజువల్ మాయాజాలం ఏ స్థాయిలో ఉంటుందో అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

రాటెన్ టొమాటోస్, గార్డియన్ రివ్యూలు: రేటింగ్ ఎంత?

కానీ అవతార్ 3 గురించి వస్తున్న ఎర్లీ రివ్యూస్ అంత ఆశాజనకంగా లేవు. అవతార్ 2 కథ హీరో జేక్ సల్లీ చెబుతున్నట్లుగా నేరేషన్ ఉంటుంది. కానీ అవతార్ 3లో అతగాడి కొడుకు లోక్ కథ చెబుతున్నట్లుగా ఉంటుంది. ఈ చిత్రంలో మాంగ్ క్వాన్ అనే అగ్నిజాతి తెగ ఎంట్రీ ఇవ్వనుంది. వీరితో హీరో ఎలా పోరాడబోతున్నాడు అనేది ఆసక్తికరం.

ఆకాశంలో భారీ నౌకల్లో తిరిగే జాతి కూడా ఎంట్రీ ఇస్తుంది. ఈ కొత్త ముప్పు నుంచి తన వారిని రక్షించడానికి హీరో ఏం చేశాడు అనేది కథలో ఆసక్తికరం కానుంది. అయితే ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు అవతార్ 3 చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ ఇవ్వడం లేదు. ప్రముఖ రాటెన్ టొమాటోస్ సంస్థ కేవలం అవతార్ 3కి 69 శాతం రేటింగ్ మాత్రమే ఇచ్చింది. ఇది అవతార్ 1, అవతార్ 2 కంటే తక్కువ.

సినిమాకు ప్రధాన మైనస్‌లు: రన్‌టైమ్ సమస్య

ది గార్డియన్ సంస్థ అయితే అవతార్ 3ని డల్ గా సాగే చిత్రం, నాన్సెన్స్ అని అభివర్ణించింది. కేవలం 2 రేటింగ్ ఇచ్చింది. ఈ చిత్రానికి ప్రధాన మైనస్ రన్ టైం అని చెబుతున్నారు. ఏకంగా ఈ చిత్రం 3 గంటల 17 నిమిషాల రన్ టైంతో ఉంది. అంతసేపు ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడం అంటే కత్తిమీద సామే. అవతార్ 2 కి కూడా ముందుగా నెగిటివ్ రివ్యూస్ మొదలయ్యాయి. ఈ చిత్రం కనీసం 1 బిలియన్ డాలర్లు కూడా వసూలు చేయడం కష్టం అని అన్నారు. కానీ ఏకంగా 2 బిలియన్ డాలర్లతో కాసుల వర్షం కురిపించింది. అవతార్ 2 కూడా 3 గంటల 12 నిమిషాల రన్ టైంతో ఉంటుంది.

పండోర గ్రహం విజువల్స్, యాక్షన్ సీన్స్ లో వచ్చే విజువల్ నిజంగానే వండర్ అనిపించేలా ఉంటాయి. అయితే కథలో ఎమోషనల్ డెప్త్ లేదని అంటున్నారు. థ్రిల్లింగ్ అనిపించేలా ఎలిమెంట్స్, కథాబలం లోపించింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరికొంతమంది కేవలం విజువల్స్ మాత్రమే హై లైట్ చేస్తూ కథ ఏమీ లేకుండా జేమ్స్ కామెరూన్ చీటింగ్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అవతార్ 2 గతంలో నెగటివ్ రివ్యూల మధ్యే విజయం సాధించింది. అవతార్ 3 కూడా తొలి విమర్శలను తట్టుకొని, జేమ్స్ కామెరూన్ మాయాజాలంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో బాక్సాఫీస్ ఫలితాలు తేలుస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.