|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఫెయిల్యూర్స్‌కి నేనెప్పుడూ కుంగిపోను.. స్టార్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్

Published: 17-10-2025, 1:03 PM
ఫెయిల్యూర్స్‌కి నేనెప్పుడూ కుంగిపోను.. స్టార్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డే తన సినీ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వైఫల్యాలు ఎదురైనా కుంగిపోనని, ధైర్యంగా ఎదుర్కొన్నానని ఆమె చెప్పింది. ప్రస్తుత చిత్రాలపై గట్టి నమ్మకంతో ఉన్నానని, పూర్వ వైభవాన్ని సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది.

Key Points

1

పూజాహెగ్డే కెరీర్ స్టార్టింగ్‌లోనే ఎదురైన పరాజయాలను ధైర్యంగా ఎదుర్కొంది.

2

'కూలీ' చిత్రంలో 'మోనిక' సాంగ్‌తో ప్రేక్షకుల మెప్పు పొందింది.

4

పూజా చేతిలో 'జననాయగన్‌', 'కాంచన-4' వంటి భారీ ప్రాజెక్ట్‌లున్నాయి.

పూజా హెగ్డే సినీ ప్రయాణం: ఎత్తుపల్లాలు

టాలీవుడ్ బుట్టబొమ్మగా గుర్తింపు తెచ్చుకున్న పూజాహెగ్డే.. వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ అనుకున్న రేంజ్‌లో హిట్ తెచ్చుకోలేకపోతుంది. అయితే.. ఇటీవల మాత్రం కూలీ చిత్రంలో స్పెషల్ సాంగ్ ‘మోనిక’తో కుర్రాళ్లను మెస్మరైజ్ చేసింది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న పూజా తన సినీ ప్రయాణంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘కెరీర్‌ స్టార్టింగ్‌లోనే పరాజయాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొన్నాను. ఆ తర్వాత వరుస విజయాలతో స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నా. అయితే.. ఒక్కోసారి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయాలు దక్కవు. అలా అని ఫెయిల్యూర్స్‌కి నేనెప్పుడూ కుంగిపోను. ప్రస్తుతం చేస్తున్న సినిమాలపై గట్టి నమ్మకంతో ఉన్నాను. ఈసారి మాత్రం నా అంచనాలు తప్పవు. మళ్లీ తిరిగి పూర్వ వైభవాన్ని సాధిస్తానని నమ్మకం ఉంది’ అని చెప్పింది. కాగా.. ప్రస్తుతం పూజా చేతిలో జననాయగన్‌, కాంచన -4 వంటి భారీ ప్రాజెక్ట్‌లున్నాయి.

వైఫల్యాలపై స్టార్ హీరోయిన్ ధైర్యం

ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో ఉన్న ప్రాజెక్టులు

మొత్తంగా, పూజాహెగ్డే తన కెరీర్‌లో ఎదురైన కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటూ, రాబోయే ప్రాజెక్టులపై ఆశావహ దృక్పథాన్ని కలిగి ఉంది. ఆమె దృఢ నిశ్చయం తిరిగి విజయ పథంలో నిలబెడుతుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.