
రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాంతార చాప్టర్ 1 ప్రీక్వెల్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ సినిమా దేశవ్యాప్తంగా 7000కు పైగా థియేటర్లలో విడుదల కానుంది.
Key Points
కాంతార చాప్టర్ 1 – దసరా కానుకగా అక్టోబర్ 2న విడుదల
7000 కంటే ఎక్కువ స్క్రీన్లలో దేశవ్యాప్తంగా విడుదల
కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ మరియు స్పానిష్ లో విడుదల
రిషబ్ శెట్టి, అజనీష్ లోకనాథ్ బృందం ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు
కాంతార చాప్టర్ 1 విడుదల తేదీ
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం కాంతార చాప్టర్ -1(Kantara Chapter 1). పాన్ ఇండియా హిట్ గా నిలిచిన కాంతారకు ప్రీక్వెల్ గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు . ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి . ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా .. రికార్డ్ వ్యూస్ తో దూసుకెళ్తోంది . భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 2 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది .
విడుదల స్క్రీన్ల సంఖ్య
భాషల విడుదల
అయితే అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే మేకర్స్ సైతం ఫుల్ గా ప్రిపేర్ అయ్యారు . ఈ ప్రీక్వెల్ మూవీ కోసం ఇప్పటికే బిగ్ ప్లాన్ సిద్ధం చేశారు. కాంతార ప్రీక్వెల్ ను దేశవ్యాప్తంగా దాదాపు 7 వేలకు పైగా స్క్రీన్స్ లో విడుదల చేయనున్నారు. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ , ఇంగ్లీష్ లోనూ రిలీజ్ కానుంది . అంతే కాకుండా దక్షిణ అమెరికాలో ఫస్ట్ పార్ట్‌కు ఆదరణ దక్కడంతో .. ఇప్పుడు ప్రీక్వెల్‌ను స్పానిష్‌లో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు కూడా పూర్తైనట్లు తెలుస్తోంది . రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్ తో బిజీ అయిపోయారు . ప్రస్తుతం రిషబ్‌శెట్టి పోస్ట్ ప్రొడక్షన్‌పనుల్లో బిజీగా ఉన్నారు. సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ సంగీతానికి ఫైనల్ టచ్ ఇస్తున్నారు.
కాంతార చాప్టర్ 1 భారీ అంచనాల మధ్య విడుదలవుతోంది. మేకర్స్ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. సినిమా విజయవంతం కావాలని అభిమానులు ఆశిస్తున్నారు.


