ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జేమ్స్ కామెరాన్ ‘అవతార్ 3’ ట్రైలర్ విడుదలైంది. ‘ఫైర్ అండ్ యాష్’ పేరుతో వస్తున్న ఈ సినిమా ఈసారి అగ్ని, జలతత్వాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనుంది. అద్భుత విజువల్స్‌తో అంచనాలను పెంచేసిన ఈ ట్రైలర్, సినీ ప్రియుల్లో ఉత్సాహాన్ని నింపింది.
Key Points
అవతార్ 3 సినిమాకు 'ఫైర్ అండ్ యాష్' అని టైటిల్ ఖరారు.
సెప్టెంబర్ 25న అవతార్ 3 రెండో ట్రైలర్ విడుదలైంది.
ఈసారి అగ్నితో పాండారా వాసుల ఆట, మానవ పాత్ర మాస్క్ లేకుండా గాలి పీల్చడం హైలైట్.
అవతార్ 3 చిత్రం డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
అవతార్ సిరీస్ విజయ ప్రస్థానం
హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ తన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ఇక అవతార్ చిత్రంతో వరల్డ్ వైడ్‌గా ప్రశంసలు పొందడమే కాకుండా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. మొదట 2009లో రిలీజ్ అయిన అవతార్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే.
అవతార్ సినిమా తర్వాత 13 ఏళ్లకు రెండో పార్ట్‌గా “అవతార్: ది వే ఆఫ్ వాటర్” సినిమా వచ్చి అంతకిమించిన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కొల్లగొట్టింది. 2022లో వచ్చిన అవతార్ 2 మూవీ డిసెంబర్ 16న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు ఈ అవతార్ ఫ్రాంఛైజీ నుంచి మరో సినిమా మూడో పార్ట్ రానుంది.
అవతార్ 3: ‘ఫైర్ అండ్ యాష్’ కథాంశం
అదే అవతార్ 3. అవతార్ సిరీస్‌లో మూడో పార్ట్‌గా వస్తోన్న సినిమాకు అవతార్ ఫైర్ అండ్ యాష్ అని టైటిల్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సెప్టెంబర్ 25న రాత్రి సమయంలో అవతార్ 3 ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఆద్యంతం ఆకట్టుకునేవిధంగా అవతార్ ఫైర్ అండ్ యాష్ ట్రైలర్ సాగింది.
ఈసారి మరింత బలమైన ఎమోషన్స్, డ్రామా, అడ్వెంచర్ , యాక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో అవతార్ 3 ప్రేక్షకులను ఆశ్చర్యపరచనుందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఇదివరకు భూమి మీద, నీళ్లలో కథ నడించింది. ఈసారి అగ్నితో పాండారా వాసులు ఆట ఆడబోతున్నారు.
అవతార్ 3 ట్రైలర్ అంచనాలు, విడుదల తేదీ
అగ్ని, నీళ్లలో వచ్చే సీక్వెన్స్ హైలెట్‌గా ఉన్నాయి. రెండు తెగల మధ్య జరిగే యుద్ధంతో విజువల్ వండర్‌గా అవతార్ 3 ఉంది. ఇందులో ఆ గ్రహం మీద మానవ పాత్ర ఎలాంటి మాస్క్ లేకుండా గాలి పీల్చుకోవడం పెద్ద ట్విస్ట్ ఇచ్చింది.
అవతార్, అవతార్ 2 సినిమా రికార్డ్స్‌ను అవతార్ 3 తిరగరాసేలా అవతార్ ఫైర్ అండ్ యాష్ ట్రైలర్ అంచనాలను పెంచేసింది. ఇదివరకు రెండు నెలల క్రితం అవతార్ 3 మొదటి ట్రైలర్ రిలీజ్ అయింది. తాజాగా అవతార్ 2 రెండో ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇకపోతే డిసెంబర్ 19న వరల్డ్ వైడ్‌గా అవతార్ 3 సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
అవతార్ 3 ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో మరోసారి విజువల్ వండర్‌ను చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 19న థియేటర్లలో ఈ అద్భుతాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి.


