
ఓటీటీ ప్రేక్షకులకు పండగ లాంటి వార్త. హారర్, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలలో అద్భుతమైన కొత్త కంటెంట్ రాబోతోంది. నెట్‌ఫ్లిక్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ కానున్న ఈ అదిరిపోయే థ్రిల్లర్‌లు మీకు అస్సలు మిస్ అవ్వకూడని సూపర్ ట్విస్ట్‌లు, ఉత్కంఠను అందిస్తాయి. ఈ జాబితా మీ థ్రిల్లర్ అనుభూతిని రెట్టింపు చేస్తుంది.
Key Points
ఓటీటీలో అదిరిపోయే హారర్, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్లు త్వరలో స్ట్రీమింగ్ కానున్నాయి.
నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 3న 'మాన్‌స్టర్: ది ఎడ్ గీన్ స్టోరీ' రాబోతుంది.
'ఐ నో వాట్ యు డిడ్ లాస్ట్ సమ్మర్' అక్టోబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు.
ట్రూ క్రైమ్ సిరీస్ 'ది మాన్‌స్టర్ ఆఫ్ ఫ్లోరెన్స్' అక్టోబర్ 22న అందుబాటులోకి వస్తుంది.
నెట్‌ఫ్లిక్స్‌లో అదిరిపోయే హారర్ కథలు
ఓటీటీలో అదిరిపోయే ఫ్రెష్ కంటెంట్ రాబోతుంది. ముఖ్యంగా థ్రిల్లర్ ఫ్యాన్స్ కు ఇది పండగ లాంటి వార్త. ఓటీటీలోకి చాలా హారర్, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు, సిరీస్ లు రాబోతున్నాయి. వీటిల్లో ఇవి స్పెషల్ గా కనిపిస్తున్నాయి. వీటిపై ఓ లుక్కేయండి.
మాన్‌స్టర్: ది ఎడ్ గీన్ స్టోరీ
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఆంథాలజీ సిరీస్ ఇది. ఇందులో మూడో సీజన్ గా మాన్‌స్టర్: ది ఎడ్ గీన్ స్టోరీ రాబోతుంది. ఈ మాన్‌స్టర్ సిరీస్ లో రియల్ క్రైమ్ థ్రిల్లర్లను బేస్ చేసుకుని స్టోరీలు తెరకెక్కిస్తుంటారు. ఇప్పుడు ఎడ్ గీన్ అనే సీరియల్ కిల్లర్ స్టోరీతో ఈ సీజన్ ను తీసుకొస్తుంది నెట్‌ఫ్లిక్స్ . ఎడ్ గీన్ మోస్ట్ డేంజరస్ కిల్లర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు.
క్రైమ్ థ్రిల్లర్ అభిమానులకు పండగే
సస్పెన్స్ తో పాటు థ్రిల్ పంచే మాన్‌స్టర్: ది ఎడ్ గీన్ స్టోరీ అక్టోబర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సీజన్ చూసే ఆడియన్స్ కు కచ్చితంగా థ్రిల్ కలుగుతుందని చెప్పొచ్చు.
రియల్ ఇన్సిడెంట్లను చూపించి డాక్యుమెంటరీ సిరీస్ ట్రూ హంటింగ్. నిజమైన పారానార్మల్ ఎన్ కౌంటర్ల కథను చెప్తుంది ఈ సిరీస్. ఆ దిశగా జరిగే పరిణామలు ఉత్కంఠ కలిగిస్తాయి. ఈ థ్రిల్లర్ అక్టోబర్ 7న నెట్‌ఫ్లిక్స్‌లోకి అడుగుపెట్టనుంది.
ఐ నో వాట్ యు డిడ్ లాస్ట్ సమ్మర్
సస్పెన్స్, మిస్టరీ థ్రిల్లర్లను చూడండి
అదిరిపోయే హారర్ , మిస్టరీ థ్రిల్లర్ ఈ ‘ఐ నో వాట్ యు డిడ్ లాస్ట్ సమ్మర్’. ఇది అక్టోబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ థియేటర్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీని ఊపేసేందుకు వచ్చేస్తోంది. ఇందులో అయిదుగురు ఫ్రెండ్స్ ఓ ట్రిప్ కు వెళ్తారు. అప్పుడు ఓ కారు యాక్సిడెంట్ జరుగుతుంది. కానీ అక్కడి నుంచి వాళ్ల వెళ్లిపోతారు. వాళ్లను ఓ మాస్క్ మ్యాన్ వెంటాడుతాడు. ఫుల్ సస్పెన్స్ తో సాగే ఈ థ్రిల్లర్ ఉత్కంఠ రేపుతుంది.
ది మాన్‌స్టర్ ఆఫ్ ఫ్లోరెన్స్
ఇది ట్రూ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. ది మాన్‌స్టర్ ఆఫ్ ఫ్లోరెన్స్ సిరీస్ సీరియల్ హత్యల కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. ఇది అక్టోబర్ 22 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ రాబోయే థ్రిల్లర్ సినిమాలు మరియు సిరీస్‌లు ఓటీటీలో మీ సమయాన్ని సద్వినియోగం చేస్తాయి. ఉత్కంఠభరితమైన కథలు, ఊహించని ట్విస్ట్‌లతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ హారర్, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌లను అస్సలు మిస్సవొద్దు!


