
📌 Key Points
- హీరోయిన్ అయేషా ఖాన్ పేరుతో ఫేక్ వాట్సాప్ ఖాతా సృష్టించిన సైబర్ నేరగాళ్లు.
- నకిలీ ఖాతా ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు అయేషా ఖాన్ గుర్తించారు.
- అభిమానులను అప్రమత్తం చేస్తూ సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్లను షేర్ చేసిన అయేషా.
- నకిలీ అకౌంట్ నెంబర్ ను వెల్లడించి, వ్యక్తిగత వివరాలు పంపవద్దని సూచన.
ప్రముఖ హీరోయిన్ అయేషా ఖాన్ తన పేరుతో క్రియేట్ చేసిన ఫేక్ వాట్సాప్ అకౌంట్ గురించి అభిమానులను హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు తన పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని ఆమె తెలిపారు. అభిమానులను అప్రమత్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అయేషా ఖాన్ పేరుతో నకిలీ ఖాతా
Ayesha Khan: సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వారి పేర్లను ఉపయోగించి ఫేక్ ఐడి లను సృష్టిస్తూ కొంతమంది సైబర్ నేరస్తులు దారుణాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీల అకౌంట్లను హ్యాక్ చేయడమే కాకుండా వారి వ్యక్తిగత వివరాలను హననం చేస్తున్నారు. అంతేకాదు సెలబ్రిటీల పేరిట డబ్బులు లాగుతూ ఆర్థికంగా ఇబ్బందులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా సైబర్ నేరస్తులకు చెక్ పెడుతూ.. అభిమానులకు జాగ్రత్తలు , హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు.. ఈ క్రమంలోనే ప్రముఖ హీరోయిన్ అయేషా ఖాన్ (Ayesha Khan) కూడా సోషల్ మీడియా వేదికగా తాను ఎదుర్కొన్న ఇబ్బందులను అభిమానులతో పంచుకోవడమే కాకుండా సైబర్ నేరగాళ్లను హెచ్చరించింది కూడా.
వివరాల్లోకి వెళితే.. ఒక ఏడాది డిసెంబర్ 5న రణవీర్ సింగ్ హీరోగా, సారా అర్జున్ హీరోయిన్ గా ఆదిత్యధర్ దర్శకత్వంలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘ధురంధర్’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమెకు ఈ సినిమా తర్వాత ఫాలోయింగ్ కూడా గణనీయంగా పెరిగిపోయింది. ఈ సినిమా ద్వారా వచ్చిన క్రేజ్ ను కొంతమంది సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేస్తున్నట్లు సమాచారం. అయేషా ఖాన్ పేరుతో నకిలీ వాట్సప్ అకౌంట్ సృష్టించి పలువురిని సంప్రదిస్తూ.. మోసాలకు పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయం కాస్త తన దృష్టికి చేరడంతో వెంటనే అప్రమత్తమయి అందరినీ అలర్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టి ఫేక్ అకౌంట్ కు సంబంధించిన వాట్సప్ చాట్ స్క్రీన్ షాట్లను కూడా అభిమానులతో పంచుకుంది.
అభిమానులకు అయేషా హెచ్చరిక
“ఇది నా అకౌంట్ కాదు.. ఎవరూ కూడా దయచేసి ఇలాంటి మెసేజ్లను నమ్మకండి” అంటూ స్క్రీన్ షాట్ తో సహా ఈ విషయాన్ని అభిమానులతో స్పష్టం చేసింది. పైగా ఆ నకిలీ అకౌంట్ కు సంబంధించిన ఫోన్ నెంబర్ ని కూడా ఆమె వెల్లడించింది. ఇలాంటి మోసపూరిత చర్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలు లేదా డబ్బులు పంపకూడదు అని సూచించింది. ప్రస్తుతం అయేషా ఖాన్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. అటు అభిమానులు నెటిజన్స్ కూడా ఈమెకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.
అయేషా ఖాన్ సినిమాల విషయానికి వస్తే.. హిందీలోనే కాకుండా తెలుగు సినిమాలలో కూడా నటిస్తూ ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. ముఖచిత్రం సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె ఓం భీమ్ బుష్ , మనమే, లక్కీ భాస్కర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి చిత్రాలలో నటించింది. అలాగే బిగ్ బాస్ హిందీ సీజన్ 17 లో కూడా పాల్గొని సందడి చేసింది. అయితే తాజాగా నటించిన ధురంధర్ సినిమా ఐటెం సాంగ్ ద్వారానే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ తో ఆకట్టుకుంటూ అభిమానులకు చేరువ అవుతూనే ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ . ఏది ఏమైనా తన పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పై అప్రమత్తత అవసరమని నిపుణులు సూచించడంతోనే వెంటనే స్పందించి సైబర్ మోసాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది.
సోషల్ మీడియాలో అయేషా పోస్ట్ వైరల్
అయేషా ఖాన్ తీసుకున్న ఈ చర్య సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచడానికి సహాయపడుతుంది. సెలబ్రిటీల పేర్లతో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం.


