|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నరుకుడే నరుకుడు.. బీభత్సమైన వైలెన్స్.. ఏరులై పారే రక్తం.. మధ్యలో లవ్ స్టోరీ, రొమాన్స్.. బాఘీ 4 ట్రైలర్ రిలీజ్

Published: 30-08-2025, 6:15 AM
నరుకుడే నరుకుడు.. బీభత్సమైన వైలెన్స్.. ఏరులై పారే రక్తం.. మధ్యలో లవ్ స్టోరీ, రొమాన్స్.. బాఘీ 4 ట్రైలర్ రిలీజ్

టైగర్ ష్రాఫ్ నటించిన బాఘీ 4 చిత్రం యొక్క ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ లో అత్యంత భీకరమైన యాక్షన్ సన్నివేశాలు, రక్తపాతం, మరియు ఒక ఆకట్టుకునే లవ్ స్టోరీ కనిపిస్తాయి.

Key Points

1

బాఘీ 4 ట్రైలర్ లో అత్యంత హింసాత్మక సన్నివేశాలు ఉన్నాయి.

2

టైగర్ ష్రాఫ్ యొక్క పాత్రలోని మానసిక అస్థిరతను చూపించే సన్నివేశాలు.

4

రొమాన్స్ మరియు యాక్షన్ మధ్య సమతూకం.

బాఘీ 4 ట్రైలర్ విడుదల

టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘బాఘీ 4’ ట్రైలర్ ను శనివారం (ఆగస్టు 30) చిత్రబృందం విడుదల చేసింది. ఊహించినట్లుగానే ఇది యాక్షన్, హింస చుట్టూ సాగుతోంది. బాఘీ 4 ట్రైలర్ టైగర్ పాత్ర కేవలం గొడ్డలి పట్టుకుని విలన్లపై విరుచుకుపడే సన్నివేశాలతో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి హీరో, విలన్.. ఇలా నరుకుడే నరుకుడు. మొత్తం రక్తపాతం, వైలెన్స్ తో సాగుతుంది. మధ్యలో హీరోయిన్, కాస్త రొమాన్స్ ఉంటుంది.

బాఘీ 4 ట్రైలర్ చూస్తే హీరోయిన్ కోసం పిచ్చివాడిలా మారిపోయే టైగర్ ష్రాఫ్ లేని దాన్ని ఉన్నట్లు ఊహించుకుని గజినీలా ప్రవర్తిస్తాడని తెలుస్తోంది. మొదట నేవీ ఆఫీసర్ గా, ఆ తర్వాత మరింత క్రూరమైన అవతారంలో టైగర్ డిఫరెంట్ లుక్స్ కనిపిస్తాయి. రోనీ (టైగర్)ని ప్రపంచం మానసికంగా సరిగ్గా లేని వ్యక్తిగా చూస్తుంది. తను ప్రేమించిన అలీషా (హర్నాజ్ సంధు) చనిపోయిందని నమ్ముతాడు. కానీ మరికొందరైతే అలీషా ఎప్పుడూ అసలు ఉనికిలో లేదని, అది కేవలం అతని ఊహ మాత్రమేనని అంటున్నారు.

హింసాత్మక సన్నివేశాలు

ట్రైలర్ లో మధ్యలో ఒక రొమాంటిక్ మాంటేజ్ అనుసరిస్తుంది. కానీ అప్పుడు విలన్ సంజయ్ దత్.. అలీషాను బందీగా పట్టుకోవడం మనం చూస్తాము. విలన్ సంజయ్ దత్ వైట్ డ్రెస్ మొత్తం రక్తంతో తడిసిపోయి ఉంటుంది. అప్పుడు యానిమల్ లోని రణ్ బీర్ కపూర్ గుర్తుకొస్తాడు. ఈ ట్రైలర్ వైలెన్స్ ఎక్కడికో వెళ్లిపోయింది. తల తెగడాలు, శరీరాలు గాల్లోకి ఎగరడాలు, నిలువుగా బాడీని నరకడాలు.. ఇలా రక్తపాతం, హింస చాలానే ఉంది.

బాఘీ 4 ట్రైలర్ లో యాక్షన్ , హింసను పలువురు అభిమానులు మెచ్చుకున్నారు. ‘బాలీవుడ్ యాక్షన్ లెవల్ అప్ గ్రేడ్ అయింది – బాఘీ 4 స్టైల్’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘టైగర్ ష్రాఫ్ మెగా రీఎంట్రీ’ అని ఓ అభిమాని జోస్యం చెప్పాడు. ‘ఈసారి అలా కాదు’ అని మరొకరు కామెంట్ చేశారు. ఈ నెల ప్రారంభంలో విడుదలైన బాఘీ 4 సినిమా టీజర్ కు అభిమానుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు టైగర్ యాక్షన్ ను ప్రశంసించగా, మరికొందరు ఈ చిత్రం టోన్, విజువల్స్ లో రణబీర్ కపూర్ యానిమల్ మూవీని పోలి ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

రొమాన్స్ మరియు యాక్షన్

బాఘీ 4లో టైగర్ ష్రాఫ్, హర్నాజ్ సంధు, సంజయ్ దత్, సోనమ్ బజ్వా, శ్రేయాస్ తల్పాడే, సౌరభ్ సచ్ దేవా తదితరులు నటిస్తున్నారు. 2016లో టైగర్, శ్రద్ధా కపూర్ జంటగా బాఘీతో ప్రారంభమైన ఈ ఫ్రాంచైజీలో నాలుగో భాగం ‘బాఘీ 4’. బాఘీ 2లో టైగర్ తన పాత్రను పోషించగా, అతనితో దిశా పటానీ రొమాన్స్ చేసింది. బాఘీ 3 లో శ్రద్ధా కపూర్ హీరోయిన్.

ఇప్పుడు ‘బాఘీ 4’ చిత్రానికి సాజిద్ నడియాడ్ వాలా కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఎ. హర్ష దర్శకత్వం వహించారు. సాజిద్ నదియాడ్ వాలా నిర్మించిన బాఘీ 4 సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది.

మొత్తంమీద, బాఘీ 4 ట్రైలర్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. యాక్షన్, హింస, మరియు రొమాన్స్ అద్భుతమైన మిశ్రమం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.