|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Baahubali: సీఈవోగా ప్రభాస్.. హెచ్‌ఆర్‌గా అనుష్క.. సోషల్ మీడియాలో వైరల్!

Published: 21-07-2025, 8:43 AM
Baahubali: సీఈవోగా ప్రభాస్.. హెచ్‌ఆర్‌గా అనుష్క.. సోషల్ మీడియాలో వైరల్!

తాజాగా సోషల్ మీడియాలో బాహుబలి స్టార్స్ ప్రభాస్ మరియు అనుష్క శెట్టి వైరల్ అయ్యారు. ప్రభాస్ సీఈవోగా, అనుష్క హెచ్‌ఆర్‌గా ఉన్న ఫోటో నెట్టింట తెగ వైరలైంది. ఈ ఫోటో కోల్డ్‌ప్లే కన్సర్ట్‌ను పోలి ఉండటం విశేషం.

Key Points

1

ప్రభాస్ సీఈవోగా, అనుష్క హెచ్‌ఆర్‌గా బాహుబలి పోస్టర్ వైరల్!

2

కోల్డ్‌ప్లే కన్సర్ట్‌ను పోలిన ప్రభాస్-అనుష్క ఫోటో

4

సోషల్ మీడియా ప్రభావం: ఉద్యోగాలు పోయే ప్రమాదం

బాహుబలి టీం సోషల్ మీడియా పోస్ట్

సోషల్ మీడియా వచ్చాక ఎప్పుడు ఎవరు ఎందుకు వైరల్ అవుతున్నారో అర్థం కావట్లేదు . కొందరు ఫేమస్ అవుతుంటే .. మరికొందరు ఊహించని విధంగా బుక్కైపోతున్నారు . తాజాగా లండన్ ‌ లో ఓ కంపెనీ సీఈవో అండ్ హెచ్ ‌ ఆర్ చీఫ్ ఓ మ్యూజిక్ కన్సర్ట్ ‌ కు హాజరయ్యారు . వీరిద్దరు అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియో నెట్టింట తెగ వైరలైంది . దీంతో ఆ కంపెనీ సీఈవో ఏకంగా తన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది . సోషల్ మీడియాతో ఫేమస్ అవ్వడం మాత్రమే కాదు .. ఉద్యోగం కూడా ఊడుతుందన్న సంగతి తెలిసొచ్చింది .

అయితే ఈ సీన్ ‌ తో లింక్ ‌ చేస్తూ బాహుబలి టీమ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ ‌ గా మారింది . మాహిస్మతి రాజ్యానికి సీఈవో అండ్ హెచ్ ‌ ఆర్ అంటూ ప్రభాస్ , అనుష్క పోస్టర్ ‌ ను పోస్ట్ చేసింది . ఇందులో ప్రభాస్ – అనుష్క అచ్చం కోల్డ్ ప్లే కన్సర్ట్ ‌ లో చేసిన స్టైల్లోనే ఫోటోను షేర్ చేశారు . ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు . కోల్డ్‌ప్లే కన్సర్ట్ ‌ వర్సెస్ ‌ భల్లాలదేవా కన్సర్ట్ అంటూ పోస్టులు పెడుతున్నారు . కెమెరామెన్ కట్టప్ప అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు .

ప్రభాస్ మరియు అనుష్క వైరల్ ఫోటో

అభిమానుల ప్రతిచర్యలు

ప్రభాస్ మరియు అనుష్క శెట్టి యొక్క బాహుబలి థీమ్‌తో కూడిన వైరల్ ఫోటో సోషల్ మీడియాలో వినోదాన్ని పంచింది. కోల్డ్‌ప్లే కన్సర్ట్‌తో పోల్చడం మరింత ఆసక్తిని కలిగించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.