|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Baahubali: బాహుబలి ప్రభాస్ కోసం కాదు.. నిర్మాత ఏమన్నారంటే?

Published: 07-10-2025, 9:25 AM
Baahubali: బాహుబలి ప్రభాస్ కోసం కాదు.. నిర్మాత ఏమన్నారంటే?

బాహుబలిలో ప్రభాస్ పాత్రకు మొదట హృతిక్ రోషన్ అనుకున్నారనే రూమర్లపై నిర్మాత శోభు యార్లగడ్డ క్లారిటీ ఇచ్చారు. ఆ పాత్ర ప్రభాస్ కోసమే సృష్టించబడిందని, ఇతర నటులను సంప్రదించలేదని ఆయన వెల్లడించారు. రాజమౌళి గతంలో హృతిక్ పై చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి.

Key Points

1

బాహుబలిలో ప్రభాస్ పాత్ర కోసం హృతిక్ రోషన్ ను సంప్రదించారనే వార్తలు అవాస్తవం.

2

నిర్మాత శోభు యార్లగడ్డ ప్రకారం, బాహుబలి పాత్ర ప్రభాస్ కోసమే రాశారు.

4

రెండు బాహుబలి పార్ట్ లను కలిపి 'బాహుబలి ది ఎపిక్' అక్టోబర్ 31న విడుదల కానుంది.

ప్రభాస్ కోసమే బాహుబలి పాత్ర

టాలీవుడ్ ‌ ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకధీరుడు రాజమౌళి . ఆయన డైరెక్షన్ ‌ లో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ , బాహుబలి -2 చిత్రాలు తెలుగు సినిమాను ఓ రేంజ్ ‌ కు తీసుకెళ్లాయి . ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సైతం ఆస్కార్ ‌ ఘనతను సాధించింది . తెలుగు సినిమాను విశ్వవ్యాప్తం చేసిన రాజమౌళి .. మరోసారి బాహుబలిని అభిమానుల ముందుకు తీసుకొస్తున్నారు . రెండు పార్ట్ ‌ లను కలిసి బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు . ఈ మూవీ అక్టోబర్ 31 న థియేటర్లలో సందడి చేయనుంది .

ఈ నేపథ్యంలో బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు . ఈ సందర్భంగా చాలా రోజులుగా వైరలవుతోన్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు . బాహుబలి చిత్రానికి మొదట అనుకున్నది ప్రభాస్ ‌ ను కాదని .. బాలీవుడ్ స్టార్ హృతిక్ ‌ రోషన్ ‌ అని గతంలో చాలాసార్లు రూమర్స్ వచ్చారు . ఈ వార్తలపై నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు . బాహుబలిలో ప్రభాస్ పాత్ర కోసం మేము హృతిక్‌ను సంప్రదించినట్లు ఆన్ ‌ లైన్ ‌ లో వచ్చిన వార్తలు విన్నానని అన్నారు .

హృతిక్ రోషన్ పై రాజమౌళి వివాదం

అయితే అవన్నీ కేవలం ఊహగానాలేనని కొట్టిపారేశారు . ఈ సినిమాను కేవలం ప్రభాస్ ‌ కోసమే సిద్ధం చేశామని శోభు వెల్లడించారు . ఈ పాత్ర మొదటి నుంచి ప్రభాస్‌ను దృష్టిలో ఉంచుకుని రాశారని తెలిపారు . ఇతర నటులు ఎవరికీ కూడా ఆడిషన్లు నిర్వహించలేదని అన్నారు . ఆ పాత్రకు హృతిక్ రోషన్ ‌ కోసం సంప్రదిచారని చాలా కాలంగా వస్తున్న రూమర్స్ ‌ కు చెక్ ‌ పెట్టారు నిర్మాత యార్లగడ్డ .

హృతిక్ ‌ పై రాజమౌళి వివాదాస్పద కామెంట్స్ ..

బాహుబలి ది ఎపిక్ విడుదల

కాగా .. బాహుబలి దర్శకుడు రాజమౌళికి హృతిక్ రోషన్ పట్ల 2009లో రాజమౌళి చేసిన కామెంట్స్ వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే . మెహర్ రమేశ్ తెరకెక్కించిన బిల్లా సినిమాను ప్రమోట్ చేస్తున్న కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడారు . ధూమ్ – 2 రెండేళ్ల క్రితం విడుదలైనప్పుడు బాలీవుడ్ మాత్రమే ఇలాంటి నాణ్యమైన సినిమాలు ఎందుకు చేయగలదా ? అని ఆశ్చర్యపోయానని అన్నారు. మనకు హృతిక్ రోషన్ లాంటి హీరోలు లేరా? బిల్లా పాటలు, పోస్టర్ , ట్రైలర్ చూశా .. నేను ఒక్క విషయం మాత్రమే చెప్పగలను. . ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ అసలు ఏం కూడా కాదు. తెలుగు సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లినందుకు మెహర్ రమేష్ (దర్శకుడు)కి కృతజ్ఞతలు అంటూ రాజమౌళి మాట్లాడారు . ఈ కామెంట్స్ ‌ వివాదానికి దారి తీయడంతో రాజమౌళి క్లారిటీ ఇచ్చారు . ఆ తర్వాత నా ఉద్దేశ్యం అతన్ని ఎప్పుడూ కించపరచడం కాదని .. హృతిక్ రోషన్ ‌ ను చాలా గౌరవిస్తానని అన్నారు .

బాహుబలి ప్రభాస్ కోసమే రూపొందిందని నిర్మాత శోభు యార్లగడ్డ స్పష్టం చేయడంతో హృతిక్ రోషన్ రూమర్లకు తెరపడింది. రాజమౌళి గత వ్యాఖ్యలు కూడా మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. బాహుబలి ఎపిక్ విడుదల నేపథ్యంలో ఈ వివరాలు ఆసక్తికరంగా మారాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.