
📌 Key Points
- నాగశౌర్య, విధి యాదవ్ జంటగా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ చిత్రం విడుదల!
- ఏప్రిల్ 17న విడుదలైన ఈ సినిమా గురించి ప్రేక్షకులకు అవగాహన లేకపోవడం గమనార్హం.
- ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించినా సినిమాపై ఆసక్తి చూపని ప్రేక్షకులు.
- సినిమా రొటీన్ కమర్షియల్ కథతో ఉండటంతో ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన.
నాగశౌర్య నటించిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ సినిమా విడుదల అయింది. కానీ ఈ సినిమా గురించి ఎవరికీ తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు ఏం జరిగింది? ఎందుకు ఈ సినిమాను పట్టించుకోలేదు? పూర్తి వివరాల్లోకి వెళ్దాం.
బ్యాడ్ బాయ్ కార్తీక్: అసలు విషయం ఏంటి?
Bad Boy Karthik : నాగశౌర్య సరైన హిట్ కొట్టి చాలా కాలమే అయింది. గత సినిమా రంగబలి పర్వాలేదనిపించినా కమర్షియల్ సక్సెస్ అవ్వలేదు. రంగబలి సినిమాకు నాగశౌర్య భారీగా ప్రమోషన్స్ చేసాడు. కానీ తన కొత్త సినిమాని అసలు పట్టించుకోలేదు కూడా. అసలు నేడు సినిమా రిలీజ్ అని కూడా సాధారణ ప్రేక్షకులకు తెలియదు.
నాగశౌర్య, విధి యాదవ్ జంటగా తెరకెక్కిన సినిమా బ్యాడ్ బాయ్ కార్తీక్. కొత్త నిర్మాతలతో కొత్త దర్శకుడు రమేష్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. బ్యాడ్ బాయ్ కార్తీక్ సినిమా నేడు ఏప్రిల్ 17న థియేటర్స్ లోకి రిలీజ్ అయింది. కానీ ఈ విషయం ఎక్కువగా ఎవరికీ తెలీదు, దానికి తగ్గట్టు మూవీ యూనిట్ ప్రమోషన్స్ కూడా చేయలేదు.
ప్రమోషన్స్ లేని సినిమా.. ఎందుకో తెలుసా?
బ్యాడ్ బాయ్ కార్తీక్ సినిమాకు సంబంధించి ఓ ట్రైలర్ లాంచ్, ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు. ఆ ఈవెంట్స్ కూడా హైలెట్ అవ్వలేదు. అసలు ట్రైలర్ చూసినప్పుడే ఇంత పాత రొటీన్ కమర్షియల్ సినిమానా అని అంతా అనుకున్నారు. మరి ఈ విషయం ముందే తెలిసి, సినిమా బాగోలేదని ముందే గ్రహించి సినిమాకు ప్రమోషన్స్ కూడా అనవసరం అనుకున్నారేమో. NRI నిర్మాతలు ఈ సినిమాకు డబ్బులు పెట్టారని, ఆ డబ్బులు అంతా ఇప్పుడు పోయినట్టే అని టాలీవుడ్ టాక్.
మంచి లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నాగశౌర్య మంచి కథలను ఎంచుకోకుండా ఇలాంటి మాస్ రొటీన్ సినిమా ఎందుకు చేసాడో, చేసిన తర్వాత ఇలా ప్రమోట్ చేయకుండా ఎందుకు వదిలేసాడో అతనికే తెలియాలి. నాగశౌర్య ప్రమోషన్స్ కి ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు అని తెలుస్తుంది. ఇక హీరోయిన్ మాత్రం ఏం చేయగలదు. తను కూడా ఈ సినిమా తనకి పేరు తీసుకురాదేమో అని లైట్ తీసుకుంది. దర్శకుడ్ని నమ్మి డబ్బులు పెట్టిన నిర్మాతలు చివరకు ఏం చేయాలో తెలియక ఎలాంటి ప్రమోషన్ లేకుండా డైరెక్ట్ గానే సినిమా రిలీజ్ చేసారు.
నాగశౌర్య ఈ సినిమాను వదిలేశాడా?
అనుకోకుండా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కూడా ఎప్పుడో 2010 సమయంలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా, ఫైట్స్ తప్ప ఏమి లేవు, రొటీన్ కమర్షియల్ బోరింగ్ సినిమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా వర్కౌట్ అవ్వదు అని తెలిసినప్పుడు ఇటీవల కొంతమంది హీరోలు,హీరోయిన్స్ ముందే సినిమా ప్రమోషన్స్ కి రావట్లేదు. నాగశౌర్య కూడా ఇప్పుడు అదే ఫాలో అయినట్టు ఉన్నాడు.
నిర్మాతల ఒత్తిడి మేరకు కనీసం ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి అయినా వచ్చి కనపడి మాట్లాడి వెళ్ళిపోయాడు శౌర్య. థియేటర్స్ లో ఈ బ్యాడ్ బాయ్ కార్తీక్ ఆడదని, పూర్తి నష్టమే అని సమాచారం. కనీసం ఓటీటీ, శాటిలైట్ అమ్మకాలు అయినా అయ్యాయో లేదో. కనీసం పాటలు కూడా బాగోలేవు. అసలు పాటలు రిలీజ్ చేసినట్టు కూడా తెలీదు. ఏది ఏమైతేనేం బ్యాడ్ బాయ్ కార్తీక్ సినిమా నాగశౌర్యకి,నిర్మాతలకు బ్యాడ్ అనుభవాన్ని మిగిల్చింది.
బ్యాడ్ బాయ్ కార్తీక్ సినిమా పరిస్థితి చూస్తుంటే కష్టంగానే ఉంది. నాగశౌర్య భవిష్యత్తు సినిమాల గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


