
యంగ్ హీరోయిన్ అంజలి శివరామన్ నటించిన ‘బ్యాడ్ గర్ల్’ చిత్రం చివరకు రిలీజ్ కు సిద్ధమైంది. ఈ సినిమా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో అవార్డులు గెలుచుకున్నప్పటికీ, వివాదాలను కూడా ఎదుర్కొంది.
Key Points
అంజలి శివరామన్, శాంతి ప్రియ నటించిన 'బ్యాడ్ గర్ల్' సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!
రోటర్‌డ్యామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అవార్డులు గెలుచుకుంది.
టీజర్ విడుదల తర్వాత వివాదాస్పదమైంది, సెన్సార్ బోర్డ్ నిరాకరణ.
సెన్సార్ బోర్డ్ సూచనల తర్వాత సెప్టెంబర్ 5న విడుదల.
‘బ్యాడ్ గర్ల్’ సినిమా విడుదల తేదీ ఖరారు
యంగ్ హీరోయిన్ అంజలి శివరామన్(Anjali Sivaraman), శాంతి ప్రియ కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్యాడ్ గర్ల్’(Bad girl). వర్షా భరత్ ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతోంది. దీనిని గ్రాస్ రూట్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అనురాగ్ కశ్యప్, వెట్రిమారన్ నిర్మిస్తున్నారు.ఇందులో ఆచారాలు, కట్టుబాట్లు పాటించే కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి తనకు నచ్చిన వాడి ఎలా ఎంపిక చేసుకుంది. ఈక్రమంలో ఎదురైన సంఘటనలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు. ఫిబ్రవరి 7న ఈ మూవీని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్‌డ్యామ్‌లో ప్రదర్శించగా.. సినీ ప్రియుల ప్రశంసలతో పాటు పలు అవార్డులు కూడా దక్కించుకుంది. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేయగా వివాదాస్పదమైంది.
ఇందులోని పలు సన్నివేశాలు ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని సినీ ప్రియులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సామాజిక వర్గాన్ని తక్కువ చేసి చూపించేలా ఉన్నాయని విమర్శలు రావడంతో సెన్సార్ బోర్డ్ విడుదలకు నిరాకరించింది. విమర్శలు వచ్చిన పలు సీన్స్ తొలగించాలని లేదంటే సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వమని హెచ్చిరించారు. కానీ ఈ కండీషన్‌కు మూవీ టీమ్ ఒప్పుకోకపోవడంతో విడుదల వాయిదా పడింది. తాజాగా, ‘బ్యాడ్ గర్ల్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు హీరోయిన్ అంజలి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. సెన్సార్ బోర్డ్ చెప్పిన మార్పులు చేయడంతో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అవార్డులు, వివాదాలు: ‘బ్యాడ్ గర్ల్’ యొక్క ప్రయాణం
సెన్సార్ సమస్యలు మరియు పరిష్కారం
చివరకు, సెన్సార్ బోర్డ్ సూచనలను పాటిస్తూ ‘బ్యాడ్ గర్ల్’ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వివాదాలను అధిగమించి సినిమా విడుదల కావడం ఆసక్తికరంగా ఉంది.

