
బాహుబలి: ది ఎపిక్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. రాజమౌళి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఈ సినిమాలో కొన్ని పాటలు, రొమాంటిక్ సన్నివేశాలు తొలగించబడినట్లు తెలిపారు. అయితే కొత్త సర్‌ప్రైజ్‌లు కూడా ఉంటాయని ఆయన చెప్పారు.
Key Points
బాహుబలి: ది ఎపిక్ ఒకే సినిమాగా విడుదలవుతోంది.
కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు, పాటలు తొలగించబడ్డాయి.
రాజమౌళి ఈ సినిమా కోసం కొత్త సర్ప్రైజ్లను జోడించారు.
మూడు గంటల నిడివితో అక్టోబర్ 31న విడుదల.
బాహుబలి: ది ఎపిక్ విడుదల తేదీ
బాహుబలి: ది ఎపిక్ తో మరోసారి ప్రపంచాన్ని ఉర్రూతలూగించడానికి సిద్ధమవుతున్నాడు రాజమౌళి. బాహుబలి రెండు భాగాలను ఒక్కటిగా చేస్తూ అక్టోబర్ 31న రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు హాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ మ్యాగజైన్ ఎంటర్టైన్మెంట్ వీక్లీతో మాట్లాడుతూ.. ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
బాహుబలి: ది బిగినింగ్ రిలీజై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది రెండు భాగాలను కలిపి బాహుబలి: ది ఎపిక్ గా తీసుకొస్తున్నారు. దీనిని రాజమౌళే స్వయంగా రీఎడిట్ చేయడం విశేషం. దీనిపై ఈ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో రాజమౌళి స్పందించాడు.
తొలగించబడిన సన్నివేశాలు, పాటలు
“రెండు బాహుబలి సినిమాలను ఎప్పుడూ ఒకే కథలా ఊహించుకున్నాం. కానీ అది ఒకే సినిమాకి సరిపోనంత పెద్ద కథ. అందుకే దాన్ని రెండు పార్ట్‌లుగా చెప్పాం. పదో యానివర్సరీ కోసం ఆడియన్స్ అప్పటికే చూసిన సినిమాను మళ్లీ రిలీజ్ చేయాలని నేను అనుకోలేదు. ఒక కొత్త అనుభవాన్ని ఇవ్వాలనుకున్నాను” అని రాజమౌళి ఈడబ్ల్యూతో చెప్పాడు.
ఇప్పుడు బాహుబలి: ది ఎపిక్ మూవీని పూర్తిగా రీమాస్టర్డ్ పిక్చర్, సౌండ్‌తో పాటు కొన్ని కొత్త సర్ ప్రైజ్ లు కూడా ఉంటాయని చెబుతున్నారు. అయితే ఈ రెండు సినిమాలను కలిపి ఒకే మూవీగా చేయడం అంత సులువైన పని కాదని రాజమౌళి అన్నాడు.
రాజమౌళి కొత్త సర్‌ప్రైజ్‌లు
ఈ సినిమాలో దేనిని ఉంచాలి? దేనిని తీసేయాలనేదానిపై తమ మధ్య చాలా వాదనలే జరిగినట్లు కూడా ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పాడు. “5 గంటల 27 నిమిషాల రన్‌టైమ్‌ని ఒకే వెర్షన్‌గా ఎడిట్ చేయడం ఈ జర్నీలో చాలా కష్టమైన పార్ట్. ఏది ఉంచాలి, ఏది తీసేయాలి అన్నదానిపై మేము గట్టిగా డిబేట్ చేసుకున్నాం. కొన్నిసార్లు వాదించుకున్నాం కూడా. బాహుబలిలోని ప్రతీ సీన్, ప్రతీ పాట నాకు చాలా విలువైనవి. కాబట్టి ఆ ఛాయిసెస్ తీసుకోవడం ఎప్పుడూ ఈజీ కాదు. కానీ కొన్ని త్యాగాలు తప్పలేదు” అని జక్కన్న చెప్పాడు.
అత్యంత కష్టమైన కట్స్‌లో “కన్నా నిదురించరా” పాట.. శివుడు (ప్రభాస్), అవంతిక (తమన్నా భాటియా) మధ్య ఉన్న రొమాంటిక్ సీక్వెన్సెస్‌ను వదిలేయడం అని రాజమౌళి వెల్లడించాడు. ఈ పాట రెండో భాగంలో ఉండగా.. తమన్నాతో రొమాన్స్ మొదటి భాగంలో ఉంది. అయితే బాహుబలి: ది ఎపిక్ సినిమా నిడివిపై మాత్రం ఇంకా ఏమీ వెల్లడించలేదు. సుమారు మూడు గంటల పాటు మూవీ ఉండొచ్చని భావిస్తున్నారు. అక్టోబర్ 31న రిలీజ్ కు సిద్ధమవుతోంది.
చివరగా, బాహుబలి: ది ఎపిక్ సినిమా అక్టోబర్ 31న విడుదలవుతుందని, కొత్త అంశాలతో ప్రేక్షకులను అలరించనుందని తెలుస్తోంది. రాజమౌళి తీసుకున్న నిర్ణయాలు చిత్రంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో చూడాలి.


