
📌 Key Points
- రాజస్థాన్‌లోని బాలాజీ ఆలయంలో ఇద్దరు మహిళలపై దాడి
- క్యూ లైన్ వివాదంలో మహిళలను జుట్టు పట్టుకుని కొట్టిన దుండగులు
- బాధితులు ఆర్తనాదాలు పెట్టినా పట్టించుకోని భక్తులు
- ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభం
రాజస్థాన్‌లోని బాలాజీ ఆలయంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. క్యూ లైన్ వివాదంలో ఇద్దరు మహిళలపై కొందరు వ్యక్తులు దారుణంగా దాడి చేశారు. మహిళలను జుట్టు పట్టుకుని కొట్టడంతో భక్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
బాలాజీ ఆలయంలో వివాదం, మహిళలపై దాడి
ఇండియాలో మహిళలపై దాడులు క్రమ క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. కొంతమందిపై లైంగిక దాడులు జరుగుతుంటే.. మరికొంత మంది మహిళలపై అత్యంత కిరాతకంగా దాడులు కూడా జరుగుతున్నాయి. వరకట్నం, ఇతర కారణాల వల్ల మహిళలను చిన్నచూపు చూస్తూ పురుషులు దండిస్తున్నారు. కొందరినైతే జాలి లేకుండా హత్య చేస్తున్నారు. అయితే తాజాగా ఇలాంటి సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలాజీ ఆలయానికి వచ్చిన ఇద్దరు మహిళలపై అత్యంత దారుణంగా ఓ వర్గానికి సంబంధించిన వాళ్లు కొట్టారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో బాలాజీ ఆలయం ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆలయంలో రెండు వర్గాల మధ్య వివాదం రాజుకుంది. దర్శనం సమయంలో క్యూ లైన్ దగ్గర గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరు మహిళలపై ఓ వర్గానికి చెందిన వ్యక్తులు అత్యంత దారుణంగా దాడి చేశారు. భక్తుల సమక్షంలోనే మహిళలను జుట్టు పట్టుకొని కొట్టారు. కాళ్లు పట్టి ఈడ్చుకెళ్ళారు. ఆపండి… మమ్మల్ని కొట్టకండి.. ఎవరైనా కాపాడండి అంటూ బాధిత మహిళలు ఆర్తనాదాలు పెట్టారు. అయినప్పటికీ ఈ ఘటనను చూస్తూ ఉండిపోయారు అక్కడ ఉన్న భక్తులు.
క్యూ లైన్‌లో గొడవ, జుట్టు పట్టుకుని కొట్టిన వైనం
ఇదంతా గర్భగుడిలోనే జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఘటన వైరల్ అయిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దాడి చేసిన వారిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అటు ఈ సంఘటనపై ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా మహిళలను కొట్టడం దారుణమని..దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.
పోలీసుల కేసు నమోదు, దర్యాప్తు ప్రారంభం
A post shared by Siraj Noorani (@sirajnooraniofficial)
ఈ ఘటనపై ప్రజా సంఘాలు తీవ్రంగా స్పందించాయి. మహిళలపై దాడిని ఖండిస్తూ, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.

