|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాలయ్య మనసు వెన్న.. చిన్నారి ప్రాణం కోసం 16 కోట్లు అభ్యర్థన!

Published: 10-04-2026, 8:05 AM
బాలయ్య మనసు వెన్న.. చిన్నారి ప్రాణం కోసం 16 కోట్లు అభ్యర్థన!
  • బాలకృష్ణ చిన్నారి కేయాన్ష్ అద్విక్ కోసం రూ. 16 కోట్ల విరాళం కోరారు.
  • స్పైనల్ మస్కులర్ అట్రోఫీ టైప్ 2తో కేయాన్ష్ బాధపడుతున్నాడు.
  • చిన్నారి చికిత్స కోసం ఇంజెక్షన్ భారతదేశంలో అందుబాటులో లేదు.
  • దాతలు నటరాజ్ ఖాతాకు డబ్బు పంపాలని బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు.

నందమూరి బాలకృష్ణ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. లేపాక్షికి చెందిన కేయాన్ష్ అద్విక్ అనే చిన్నారి స్పైనల్ మస్కులర్ అట్రోఫీతో బాధపడుతుండటంతో, అతడి వైద్యం కోసం రూ. 16 కోట్లు విరాళం ఇవ్వాలని బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు.

బాలకృష్ణ మానవత్వం: చిన్నారి కోసం విరాళం

Balakrishna: నందమూరి బాలకృష్ణ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. ఈయన హీరోగా ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని ఎన్నో సందర్భాలలో నిరూపించుకున్నారు. బాలకృష్ణ బసవతారకం కేన్సర్ హాస్పిటల్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో చిన్నారి ఆరోగ్యం కోసం బాలయ్య అండగా నిలబడటమే కాకుండా చిన్నారి కోసం సాయం చేయండి అంటూ సోషల్ మీడియా వేదికగా అభ్యర్థించారు. చిన్నారి ఆరోగ్యానికి 16 కోట్లు కావాలని మానవ దృక్పథంతో సాయం చేయండి అంటూ ఈయన కోరారు.

బాలకృష్ణ ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తన నియోజకవర్గ పరిధిలో లేపాక్షి గ్రామానికి చెందిన నటరాజు దంపతులకు కేయాన్ష్ అద్విక్ (Keyansh Advik)ఉన్నారు ఈ చిన్నారికి రెండున్నర సంవత్సరాల వయసు అయితే ఈ చిన్నారి ప్రాణాంతకరమైన స్పైనల్ మస్కులర్ అట్రోఫీ టైప్ 2 అనే వ్యాధితో బాధపడుతున్నారు. బెంగళూరులోని బాపిస్ట్ వైద్యుల ప్రకారం ఈ చిన్నారి గత 21 సంవత్సరాల నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్నారని తెలియజేశారు అయితే ఈ వ్యాధికి చికిత్స చేయించాలి అంటే అందుకు సరిపడా ఇంజక్షన్ మన భారత దేశంలో లభించదు.

కేయాన్ష్ అద్విక్ వ్యాధి వివరాలు

ఇక ఈ ఇంజక్షన్ ఖరీదు సుమారు 16 కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. ఒకసారి మాత్రమే ఇవ్వాల్సిన ఈ ఇంజక్షన్ కోసం అవసరమయ్యే డబ్బును ఇవ్వలేని పరిస్థితులలో చిన్నారి తల్లిదండ్రులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చిన్నారి ప్రాణాలకు అండగా ప్రతి ఒక్కరూ మానవత దృక్పథంతో ముందుకు రావాలని ఈయన సూచించారు. ఇక తనవంతుగా చిన్నారి కుటుంబానికి సహాయం చేయడమే కాకుండా, ప్రభుత్వం తరఫున నుంచి చిన్నారికి సాయం అందజేస్తామని బాలకృష్ణ తెలిపారు. ఇక చిన్నారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సాయం చేయమని ఈయన కోరారు.

ఇలా బాలకృష్ణ కేయాన్ష్ ఆరోగ్య విషయంలో అందరిని అభ్యర్థించడమే కాకుండా సాయం చేసే దాతలు డబ్బు పంపించాలి అంటే బ్యాంకుకు సంబంధించిన వివరాలను కూడా షేర్ చేశారు.8265662545 అనే అకౌంట్ నెంబర్ కు డబ్బులు పంపించాలని తెలిపారు. ఈ అకౌంట్ ఏ ఎస్ నటరాజ్ IFSC:IDIB 000J0 28, Jp నగర్ బ్రాంచ్ అంటూ బ్యాంకుకు సంబంధించిన వివరాలను కూడా బాలకృష్ణ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇలా ఇండస్ట్రీలో నటుడిగా మాత్రమే కాకుండా రాజకీయాలలో ప్రజానాయకుడిగా కొనసాగుతూ ప్రజల కష్టసుఖాలలో భాగమవుతూ బాలయ్య వారికి అండగా నిలవటం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విరాళం ఎలా ఇవ్వాలి: బాలకృష్ణ సూచనలు

బాలకృష్ణ తనవంతు సాయం చేయడమే కాకుండా, ప్రజలందరూ మానవత్వంతో స్పందించి కేయాన్ష్ ప్రాణాలు కాపాడాలని కోరారు. దాతలు ముందుకు వచ్చి సహాయం అందిస్తారని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.