
📌 Key Points
- బాలకృష్ణకు చిరంజీవి నటించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ అంటే చాలా ఇష్టం.
- ఖైదీ సినిమాలో చిరంజీవి యాక్షన్, డ్యాన్స్ బాలకృష్ణను ఆకట్టుకున్నాయి.
- నరసింహనాయుడు, సమరసింహారెడ్డి సినిమాలను చిరంజీవి ప్రశంసించారు.
- బాలకృష్ణ, చిరంజీవి మధ్య వ్యక్తిగత స్నేహం ఎంతో గొప్పది.
బాలకృష్ణకు చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా అంటే చాలా ఇష్టమని తెలిపారు. అంతేకాకుండా ఖైదీ సినిమాలో చిరంజీవి నటనను మెచ్చుకున్నారు. వారి మధ్య స్నేహ సంబంధం గురించి ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
బాలకృష్ణకు ఇష్టమైన చిరంజీవి సినిమాలు
Balakrishna Favourite Movie: ఎన్నో సంవత్సరాల నుంచి బాక్సాఫీస్ దగ్గర చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఎంతలా పోటీ పడుతుంటాయో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఎన్నో సంక్రాంతికి వీళ్ళిద్దరి సినిమాలు విడుదలై ఒకదాని పైన ఒకటి విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఈ ఇద్దరి హీరోల అభిమానులు ఎప్పటికప్పుడు తమ హీరో గొప్ప.. అంటే తమ హీరో గొప్ప అంటూ కూడా వాదన జరుపుతూ ఉంటారు. అలాంటి తెలుగు ఇండస్ట్రీ దిగ్గజాలు అయిన వీరిద్దరు మాత్రం ఒకరితో ఒకరు స్నేహభావంతో కలిసి ఉంటూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు.
ఇద్దరు నటులు ఒకరి సినిమాలపై మరొకరు గౌరవం చూపిస్తుంటారు. పలు సందర్భాల్లో ఒకరి విజయాలను మరొకరు అభినందించారు. సినిమా కార్యక్రమాల్లో కలిసినప్పుడు స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటూ కనిపిస్తారు.
చిరంజీవి ప్రశంసించిన బాలకృష్ణ సినిమాలు
బాలకృష్ణ ఒకసారి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి నటించిన “జగదేకవీరుడు అతిలోకసుందరి” సినిమా తనకు చాలా ఇష్టమని చెప్పారు. ఆ సినిమా కథ, మేకింగ్ మరియు విజువల్స్ తనను చాలా ఆకట్టుకున్నాయని తెలిపారు. తెలుగు సినిమా చరిత్రలో ఆ చిత్రం ఒక ప్రత్యేక స్థానం సంపాదించిందని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రీదేవి హీరోయిన్గా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఎంతటి బ్లాక్ బస్టర్ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాని బాలకృష్ణ తనకెంతో ఇష్టం అని చెప్పారు..
అంతేకాకుండా చిరంజీవి నటించిన ఖైదీ సినిమా కూడా తనకు ఎంతో ఇష్టమని బాలకృష్ణ చెప్పారు. ఆ సినిమాలో చిరంజీవి చేసిన యాక్షన్ సన్నివేశాలు, డ్యాన్స్‌లు ప్రేక్షకులను చాలా ఆకట్టుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పోరాట సన్నివేశాల్లో చిరంజీవి చూపించే స్టైల్ మరియు గ్రేస్ తనకు చాలా నచ్చుతాయని బాలకృష్ణ వెల్లడించారు.
బాలకృష్ణ, చిరంజీవి స్నేహ బంధం
మరోప బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు.. సమరసింహారెడ్డి సినిమాలు భారీ విజయాలు సాధించాయి. ఈ సినిమాల గురించి చిరంజీవి కూడా పలు సందర్భాల్లో ప్రశంసలు చెప్పారు. ఇలా బాక్సాఫీస్ వద్ద పోటీ ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా ఒకరి పట్ల మరొకరికి గౌరవం.. స్నేహం ఉండటం అందరినీ తెగ ఆకట్టుకుంటుంది.
బాలకృష్ణ, చిరంజీవి ఇద్దరూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు తెచ్చుకున్నారు. వారి మధ్య ఆరోగ్యకరమైన పోటీ, స్నేహం ఎందరికో ఆదర్శం. వారి అభిమానులు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.


