|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాలకృష్ణ: `లారీ డ్రైవర్‌` షూటింగ్‌లో గొడవ.. డైరెక్టర్‌ చేసిన పనికి బాలయ్య రియాక్షన్‌ ఊహకందదు

Published: 24-09-2025, 3:47 AM
బాలకృష్ణ: `లారీ డ్రైవర్‌` షూటింగ్‌లో గొడవ.. డైరెక్టర్‌ చేసిన పనికి బాలయ్య రియాక్షన్‌ ఊహకందదు

నందమూరి బాలకృష్ణ మరియు దర్శకుడు బి. గోపాల్ కలిసి నటించిన ‘లారీ డ్రైవర్’ సినిమా షూటింగ్ సమయంలో ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. ఈ సినిమా షూటింగ్ లో చిన్న గొడవ జరిగింది. దానికి కారణమేమిటో తెలుసుకుందాం.

Key Points

1

బాలకృష్ణ, బి. గోపాల్ కాంబినేషన్ లోని ‘లారీ డ్రైవర్’ షూటింగ్ లో గొడవ.

2

కామెడీ సీన్ల వల్ల బాలయ్య ఆగ్రహం, చాలా రోజులు మాట్లాడలేదు.

4

పరుచూరి బ్రదర్స్ జోక్యం తో వివాదం తీవ్రత తగ్గింది.

లారీ డ్రైవర్ సినిమా షూటింగ్ లో గొడవ

నందమూరి బాలకృష్ణకి తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు బి గోపాల్‌. బాలయ్యని మాస్‌ హీరోగా నిలబెట్టిన దర్శకుడని చెప్పొచ్చు. 90లో బాలయ్య కెరీర్‌ పీక్‌లో ఉండేదంటే అందుకు దర్శకుడు బి గోపాల్‌ ఓ కారణంగా చెప్పొచ్చు. `లారీ డ్రైవర్‌`, `రౌడీ ఇన్‌స్పెక్టర్‌`, `సమరసింహారెడ్డి`, `నరసింహనాయుడు`, `పల్నాటి బ్రహ్మనాయుడు` వంటి చిత్రాలు వీరి కాంబినేషన్‌లో వచ్చాయి. ఇందులో నాలుగు బ్లాక్‌ బస్టర్స్ గా నిలిచాయి. ఇవి బాలయ్య కెరీర్‌ని మలుపు తిప్పిన చిత్రాలని చెప్పొచ్చు.

అయితే దర్శకుడు బి గోపాల్‌కి బాలయ్యతో మొదటి సినిమా `లారీ డ్రైవర్‌` సమయంలోనే పెద్ద ఇష్యూ అయ్యింది. షూటింగ్‌లో పెద్ద రచ్చ అయ్యింది. బాలయ్య చాలా సీరియస్‌ అయ్యారట. చాలా రోజులు మాట్లాడలేదట. ఆయన్ని చూస్తేనే షూటింగ్‌లో ఒక భయానక వాతావరణం క్రియేట్‌ అయ్యేదని, చాలా రోజులు బాలయ్య మాట్లాడలేదట. అసలు ఏం జరిగిందంటే. `లారీ డ్రైవర్‌` చిత్రానికి బి గోపాల్‌ దర్శకుడు. ఏ ఆంజనేయ పుష్పానంద్‌ కథ అందించారు. పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ రాశారు.

బాలకృష్ణ ఆగ్రహానికి కారణం ఏమిటి?

ఈ మూవీ సీరియస్‌గా సాగుతుందని చెప్పి పరుచూరి వెంకటేశ్వరరావు కామెడీ జోడించాడు. అయితే కలెక్టర్‌గా చేసిన శారదపై వచ్చే సీన్లలో కామెడీ రాశారట. ఆయా సీన్లని దర్శకుడు బి గోపాల్‌ చిత్రీకరించారు. బాలయ్య, శారదతోపాటు మెయిన్‌ కాస్టింగ్‌పై ఆయా సీన్లు తీశారు. ఆ తర్వాత పరుచూరి గోపాలకృష్ణ ఆ రష్‌ చూసి, వద్దు అన్నారట. కలెక్టర్‌ సీరియస్‌గా ఉండే పాత్ర. ఆమెపై ఇలాంటి కామెడీ పెడితే బాగోదు, ఆడియెన్స్ కనెక్ట్ కాదని చెప్పి, మరో వెర్షన్‌రాయించాడట.

దీంతో ఆయా సీన్లని పక్కన పెట్టి మళ్లీ కొత్తగా షూట్‌ చేయాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ముందుగా హీరో బాలకృష్ణకి చెప్పలేదు దర్శకుడు. టీమ్‌ కూడా ఆ సాహసం చేయలేకపోయింది. దీంతో బాలయ్య సీరియస్‌ అయ్యాడట. మళ్లీ షూట్‌ చేయడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశాడట. అయితే డెరెక్ట్ గా దర్శకుడు బి గోపాల్‌ ని ఏం అనలేదని, కాకపోతే చాలా రోజులు ఆయనతో మాట్లాడలేదట. షూటింగ్‌ అయిపోయాక పరుచూరి బ్రదర్స్ ఈ విషయాన్ని బాలయ్యకి చెప్పారు. అప్పుడు అయ్యో అలా జరిగిందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడట. కాకపోతే అప్పటికే షూటింగ్‌ అయిపోవడంతో అంతా లైట్‌ తీసుకున్నారట. ఈ విషయాన్ని దర్శకుడు బి గోపాల్‌ స్వయంగా వెల్లడించారు. సుమన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టారు. బేసిక్‌గా బాలయ్య ఇలాంటివి జరిగితే అరవడం, పెద్ద గొడవ చేస్తుంటారని అంటుంటారు. కానీ అందుకు భిన్నంగా బాలయ్య సైలెంట్‌ అయిపోవడం, మాట్లాడకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.

బి. గోపాల్ వివరణ

ఆ విషయంలో విభేదాలు తప్పితే తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని తెలిపారు దర్శకుడు బి గోపాల్‌. బాలయ్యకి చెప్పిన టైమ్‌కి షూటింగ్‌ చేయాలని, మార్నింగ్‌ అనుకున్న టైమ్‌ కి షాట్‌ తీయకపోతే ఆయనకు కోపం వస్తుందని, అందుకే మేం అనుకున్న టైమ్‌కి షాట్‌ రెడీ చేసేవాళ్లమని, దీంతో అంతా సాఫీగా సాగిపోయిందన్నారు. మొదటి షాట్‌ తీశాక మధ్యలో గ్యాప్‌ వచ్చినా ఆయన పట్టించుకోరని చెప్పారు. సెట్‌లో బాలయ్య బాబు ఎంతో సరదాగా ఉంటారని, జోకులు వేస్తూ నవ్విస్తుంటారని తెలిపారు. బాలకృష్ణ, విజయశాంతి జోడీగా నటించిన `లారీ డ్రైవర్‌` మూవీ 1990 డిసెంబర్‌ 21న విడుదలైన మంచి విజయం సాధించింది.

చివరకు పరుచూరి బ్రదర్స్ జోక్యం చేసుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది. బాలకృష్ణ తన అభిప్రాయాలను తెలియజేయడంలో ఎంతో దృఢంగా ఉంటారని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.