|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: బాలయ్య కెరీర్‌ను నాశనం చేసిన రాఘవేంద్రరావు! బ్లాక్ బస్టర్ మిస్!

Published: 02-03-2026, 10:35 PM
షాకింగ్: బాలయ్య కెరీర్‌ను నాశనం చేసిన రాఘవేంద్రరావు! బ్లాక్ బస్టర్ మిస్!
  • బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన `పాండురంగడు` మూవీ డిజాస్టర్.
  • రాఘవేంద్రరావు రొమాన్స్ డోస్ ఎక్కువవ్వడం వల్లే సినిమా ఫ్లాప్: విమర్శకులు.
  • టబుతో బాలయ్య రొమాన్స్ సీన్స్ ఓవర్ ది టాప్ అని టాక్.
  • 2008 మే 30న విడుదలైన `పాండురంగడు` బాక్సాఫీస్ వద్ద బోల్తా.

బాలకృష్ణ కెరీర్‌లో ఊహించని విషాదం! ఒక దర్శకుడు చేసిన పనికి బ్లాక్ బస్టర్ సినిమా కాస్తా డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి!

రాఘవేంద్రరావు చేసిన తప్పేంటి?

బాలకృష్ణ కెరీర్‌లో హిట్లతోపాటు చాలా పరాజయాలు కూడా ఉన్నాయి. కానీ కొన్ని ఇండస్ట్రీ హిట్‌ కావాల్సిన సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద పరాజయం చెందాయి. బాలయ్య కెరీర్లో ఓ మూవీ మాత్రం ఇండస్ట్రీ హిట్‌ గా నిలవాల్సింది. కానీ దర్శకుడు రాఘవేంద్రరావు చేసిన పనికి అది డిజాస్టర్‌గా నిలిచింది. చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి ఆ సినిమా ఏంటి? రాఘవేంద్రరావు ఏం చేశాడనేది చూస్తే.

బాలయ్య తన కెరీర్‌లో చాలా భక్తిరస చిత్రాలు చేశారు. ఫౌరాణికాలు చేశారు. రీసెంట్‌ టైమ్స్ లో మాత్రం `శ్రీరామరాజ్యం`, `పాండురంగడు` మూవీస్‌ ప్రధానంగా నిలుస్తాయి. `శ్రీరామరాజ్యం` డీసెంట్‌గానే ఆడింది. మంచి ప్రశంసలందుకుంది. కానీ మరో భక్తిరస చిత్రం `పాండురంగడు` ఆడలేదు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. అప్పట్లో ఎన్టీఆర్ `పాండురంగ మహత్యం` అనే చిత్రంలో నటించారు. అది సంచలన విజయం సాధించింది. ఆ సినిమా స్ఫూర్తితోనే `పాండురంగడు` మూవీని తెరకెక్కించారు రాఘవేంద్ర రావు. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. శ్రీకృష్ణుడిగా, పాండరిక రంగనాథుడిగా కనిపించారు. స్నేహ, టబు హీరోయిన్లుగా నటించారు. 2008 మే 30న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం చెందింది. డిజాస్టర్‌గా నిలిచింది.

బాలయ్య కెరీర్‌లో బ్లాక్ బస్టర్ మిస్?

`పాండురంగడు` మూవీ పరాజయానికి కారణం దర్శకుడు రాఘవేంద్రరావు అని చెబుతారు. ఎందుకంటే ఆయన రూపొందించింది భక్తిరస చిత్రం. కానీ అందులో రొమాన్స్ ఎక్కువ పెట్టారు. రాఘవేంద్రరావు `శ్రీరామదాసు`, `అన్నమయ్య` చిత్రాలు రూపొందించారు. వాటిని భక్తిరస చిత్రాలుగానే తెరకెక్కించారు. గ్లామర్‌ ఉన్నా, ఇబ్బంది పెట్టదు, వెగటు పుట్టించదు. కానీ `పాండురంగడు`లో మాత్రం అది కాస్త శ్రుతి మించినట్టుగా ఉంటుంది. బాలయ్య ఇందులో టబుతో చేసిన రొమాన్స్ ఓవర్‌ డోస్‌లో ఉంటుంది. టబుని కూడా రాఘవేంద్రరావు చాలా గ్లామరస్‌గా చూపించారు.

సినిమాలో పాండరిక రంగనాథుడిగా బాలయ్య స్త్రీ(టబు) మోజులో ఉంటాడు. ఆమెతో రొమాన్స్ చేస్తుంటాడు. అయితే ఈ సన్నివేశాలు మరీ టూ మచ్‌ అనేలా ఉన్నాయి. సాధారణంగా రాఘవేంద్రరావు తన కమర్షియల్‌ చిత్రాల్లో పాటల్లో రొమాన్స్ ని, హీరోయిన్ల గ్లామర్‌ని పీక్‌లో చూపిస్తారు. పూలు, పండ్లు వేస్తారు.  అదే స్టయిల్‌ని ఇందులో ఫాలో అయ్యాడు రాఘవేంద్రరావు. ఇంకా చెప్పాలంటే వాటికి డబుల్‌ డోస్‌ ఇందులో చూపించారు. దీంతో ఆడియెన్స్‌ తీసుకోలేకపోయారు. ఇదే `పాండురంగడు` మూవీ పరాజయానికి కారణమని తమ్మారెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మొత్తంగా రాఘవేంద్రరావు తన అన్ని సినిమాల్లాగే ఈచిత్రాన్ని కూడా డీల్‌ చేశాడు, గట్టి దెబ్బ తిన్నాడు. బ్లాక్‌ బస్టర్‌ కావాల్సిన మూవీని డిజాస్టర్‌ చేశారు. అప్పటికే బాలయ్య వరుసగా ఐదు పరాజయాలను చవిచూశారు. అలాంటి సమయంలో ఈ చిత్రంతో హిట్‌ కొట్టాలనుకున్నారు. కానీ ఊహించని దెబ్బ పడిందని చెప్పొచ్చు.

`పాండురంగడు` మూవీ వెనుక అసలు నిజం!

రాఘవేంద్రరావు, బాలయ్య కాంబినేషన్‌లో చాలా సినిమాలు వచ్చాయి. హిట్లుగా నిలిచాయి. కానీ `పాండురంగడు` విషయంలో మాత్రం దారుణమైన విమర్శలు ఎదుర్కొన్నారు.  బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్‌ మలినేనితో సినిమా చేస్తున్నారు. `ఎన్బీకే 111` పేరుతో ఈ మూవీ రూపొందనుంది. ముంబాయి గ్యాంగ్‌ స్టర్‌ కథతో సినిమా సాగుతుందని తెలుస్తోంది. మొదట వారియర్‌ కథతో సినిమా చేయాలనుకున్నారు. ప్రారంభోత్సవం చేశారు. కానీ బడ్జెట్‌ సమస్య కారణంగా మూవీని గ్యాంగ్‌ స్టర్‌ కథగా మార్చారు. నయనతార హీరోయిన్‌గా నటించే ఈ చిత్రం త్వరలోనే రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది.

ఇలాంటి సంచలన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా వెబ్‌సైట్‌ను చూస్తూ ఉండండి. మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ కోసం వేచి చూడండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.