|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాలయ్యను డామినేట్ చేసిన రాజశేఖర్! రిజెక్ట్ చేసిన సినిమాలతో ఇండస్ట్రీ హిట్లు.. షాకింగ్ రికార్డ్స్!

Published: 14-02-2026, 11:35 AM
బాలయ్యను డామినేట్ చేసిన రాజశేఖర్! రిజెక్ట్ చేసిన సినిమాలతో ఇండస్ట్రీ హిట్లు.. షాకింగ్ రికార్డ్స్!
  • బాలయ్య నో చెప్పిన ‘అంకుశం’తో రాజశేఖర్ ఇండస్ట్రీ హిట్, పోలీస్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టాడు!
  • ‘అల్లరి ప్రియుడు’ మూవీతో రాజశేఖర్ యాక్షన్ హీరో నుండి కమర్షియల్ హీరోగా టర్న్ తీసుకున్నాడు.
  • రాఘవేంద్రరావు దర్శకత్వంలో రమ్యకృష్ణ కెరీర్ కూడా ఈ సినిమాతోనే మారిపోయింది, ఇది ఒక సంచలనం!
  • ‘మా అన్నయ్య’లో రాజశేఖర్ ద్విపాత్రాభినయం, మీనా, మహేశ్వరి హీరోయిన్లుగా నటించారు, సూపర్ హిట్ కొట్టారు.

టాలీవుడ్ చరిత్రలో ఊహించని ట్విస్ట్! బాలకృష్ణ రిజెక్ట్ చేసిన సినిమాలతో రాజశేఖర్ ఇండస్ట్రీ హిట్స్ కొట్టడం సంచలనంగా మారింది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామా!

బాలయ్య నో చెప్పిన ‘అంకుశం’.. రాజశేఖర్ కెరీర్ టర్నింగ్ పాయింట్!

ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేయడం ఇండస్ట్రీలో కామన్‌. ఒకరు రిజెక్ట్ చేస్తే మరొకరి వద్దకు వెళ్తుంటాయి. వాళ్లకి నచ్చితే చేస్తారు. ఇది సినిమా ప్రారంభం నుంచి జరుగుతున్నది. అయితే కొన్ని సినిమాలు వదులుకున్న వారికి లాభాలు తెస్తే, మరికొన్ని నష్టాలను తీసుకొస్తాయి. అవి చేసిన వారికి హెల్ప్ అవుతాయి. అలా నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో చాలా సినిమాలు వదులుకున్నారు. కానీ అవి చేసిన రాజశేఖర్‌ ఇండస్ట్రీ హిట్‌ కొట్టారు. ఇమేజ్‌ పరంగా బాలయ్యని డామినేట్‌ చేశారు. ఆ సినిమాలేంటనేది చూస్తే,

బాలకృష్ణ వదులుకున్న చిత్రాల్లో `అంకుశం` ఒకటి. ఈ మూవీకి కోడి రామకృష్ణ దర్శకుడు. ఇందులో జీవిత హీరోయిన్‌గా నటించింది. యాక్షన్‌ ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీలో రామిరెడ్డి విలన్‌గా నటించారు. ఇందులో పోలీస్‌ ఆఫీసర్‌గా రాజశేఖర్‌ గా ఇరగదీశాడు. ఆవేశంతో కూడిన పాత్రలో అదరగొట్టారు. ఈ చిత్రం 1989లో విడుదలై బాక్సాఫీసు వద్ద బంపర్‌ హిట్‌ గా నిలిచింది. ఓ రకంగా ఇది ఇండస్ట్రీ హిట్‌ అని చెప్పొచ్చు. అయితే ఈ మూవీ స్టోరీని మొదట బాలయ్యకి చెప్పారట దర్శకుడు కోడిరామకృష్ణ. ఆయన కొన్ని మార్పులు చెప్పారట. కానీ అది చేయలేదు దర్శకుడు. దీంతో నో చెప్పారు. అనంతరం రాజశేఖర్‌కి చెప్పగా, ఆయన ఓకే చేశారు, ఇండస్ట్రీ హిట్‌ని కొట్టాడు. ఈ మూవీతో రాజశేఖర్ కెరీర్‌ పీక్ లోకి వెళ్లింది.

‘అల్లరి ప్రియుడు’తో రాజశేఖర్ ఇమేజ్ ఛేంజ్.. రమ్యకృష్ణకు బూస్టింగ్!

బాలయ్య వదులుకున్న మరో మూవీ `అల్లరి ప్రియుడు`. దీనికి కె రాఘవేంద్రరావు దర్శకుడు. రాజశేఖర్‌ ఇమేజ్‌ని మార్చిన చిత్రమిది. ఈ మూవీతో రమ్యకృష్ణ హీరోయిన్‌గా కెరీర్‌ టర్న్ తీసుకుంది. అయితే ఈ మూవీ కథని మొదట బాలయ్యకే చెప్పారు దర్శకేంద్రుడు. కానీ అప్పటికే బాలయ్య `బంగారు బుల్లోడు`, `నిప్పురవ్వ` చిత్రాలతో బిజీగా ఉన్నారు. డేట్స్ కుదరకపోవడంతో ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత రాజశేఖర్‌తో చేశారు రాఘవేంద్రరావు. వీరి కాంబినేషన్‌లో మొదటి సినిమా. రాజశేఖర్‌ ని యాక్షన్‌ హీరో ఇమేజ్‌ నుంచి కమర్షియల్‌ హీరోగా మార్చేసింది. ఈ మూవీతో రాజశేఖర్‌ కథల ఎంపికలో చాలా మార్పు వచ్చింది. సినిమా కూడా 1993లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

బాలకృష్ణ వదులుకున్న మరో సూపర్‌ హిట్‌ మూవీ `మా అన్నయ్య`. రాజశేఖర్‌ హీరోగా నటించారు. రవి రాజా పినిశెట్టి దర్శకుడు. ఇది అన్నయ్య, ముగ్గురు తమ్ముళ్ల మధ్య జరిగే కథ. ఇందులో రాజశేఖర్‌ ద్విపాత్రాభినయం చేశారు. మీనా, మహేశ్వరి హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ కథని కూడా మొదట బాలయ్యకే చెప్పారు రవిరాజా పినిశెట్టి. కానీ ఇదే తరహా ఫ్యామిలీ డ్రామాలు తాను ముందే చేయడంతో వద్దు అనుకున్నారట. దీంతో రాజశేఖర్‌ వద్దకు ఈ కథ వెళ్లింది. ఆయన ఓకే చేశారు. 2000లో వచ్చిన ఈ మూవీ మంచి ఆదరణ పొందింది.

‘మా అన్నయ్య’తో మరో హిట్.. బాలయ్యకు మిస్ అయిన బ్లాక్ బస్టర్!

ఇలా బాలయ్య వదులుకున్న చిత్రాలను రాజశేఖర్‌ చేసి సూపర్‌ హిట్‌ కొట్టారు. మంచి ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఆ సమయంలో రాజశేఖర్‌, బాలయ్య సినిమాలు నువ్వా నేనా అనేలా రిలీజ్‌ అయ్యేవి. బాక్సాఫీసు వద్ద గట్టి వార్‌ నడిచేది. అలాగే బాలయ్య వదులుకున్న `వేటగాడు` మూవీ చేసి దారుణమైన పరాజయాన్ని చవిచూశారు రాజశేఖర్‌. ప్రస్తుతం బాలయ్య.. గోపీచంద్‌ మలినేనితో సినిమా చేస్తున్నారు. రాజశేఖర్‌ `బైకర్‌` మూవీతో కమ్‌ బ్యాక్‌ కాబోతున్నారు.

ఈ వార్త ఒక సంచలనం. బాలకృష్ణ వదులుకున్న సినిమాలు రాజశేఖర్ కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడ్డాయి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.