|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kaantha Movie: దుల్కర్ సల్మాన్ కాంత.. ట్రైలర్ ఎప్పుడంటే?

Published: 04-11-2025, 7:48 AM
Kaantha Movie: దుల్కర్ సల్మాన్ కాంత.. ట్రైలర్ ఎప్పుడంటే?

దుల్కర్ సల్మాన్ నటించిన ‘కాంత’ సినిమా విడుదల తేదీ, ట్రైలర్ తేదీలను మేకర్స్ ప్రకటించారు. నవంబర్ 14న థియేటర్లలో విడుదల కానున్న ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ ట్రైలర్ నవంబర్ 6న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి.

Key Points

1

దుల్కర్‌ సల్మాన్‌, భాగ్యశ్రీ బోర్సే జంటగా 'కాంత' పీరియాడికల్ యాక్షన్‌ చిత్రం రూపొందింది.

2

నవంబర్ 14న 'కాంత' సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

4

ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్‌ పొట్లూరి నిర్మించారు.

కాంత సినిమా విశేషాలు

మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan),  భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri borse) జంటగా నటిస్తోన్న  పీరియాడికల్ యాక్షన్‌‌ చిత్రం కాంత(Kaantha Movie). ఈ మూవీకి సెల్వరాజ్‌ సెల్వమణి దర్శకత్వం వహించారు.  1950 మద్రాస్‌ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ నవంబర్‌ 14న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇప్పటికే సాంగ్స్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ఫస్ట్ స్పార్క్ ‍పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేశారు.

ఈ మూవీ ట్రైలర్ రిలీజ్‌ను డేట్‌ను ప్రకటించారు మేకర్స్. నవంబర్‌ 6న కాంత ట్రైలర్ విడుదల చేస్తామని వెల్లడించారు. కాగా.. ఈ మూవీని స్పిరిట్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్, వేఫేరర్‌ ఫిల్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్‌ సల్మాన్, ప్రశాంత్‌  పొట్లూరి, జోమ్‌ వర్గీస్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సముద్రఖని ఓ కీలక పాత్రలో నటించారు.

ట్రైలర్ విడుదల తేదీ ప్రకటన

నటీనటులు, నిర్మాణ బృందం

‘కాంత’ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, ట్రైలర్ విడుదల ప్రకటన అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకుల అంచనాలను ఎంత మేరకు అందుకుంటుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.