|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పిల్లల భవిష్యత్తుకు సెల్ ఫోన్ శాపమా? తల్లిదండ్రులారా జాగ్రత్త!

Published: 23-06-2026, 4:34 PM
పిల్లల భవిష్యత్తుకు సెల్ ఫోన్ శాపమా? తల్లిదండ్రులారా జాగ్రత్త!
  • 13 ఏళ్లలోపు పిల్లల్లో స్మార్ట్‌ఫోన్ వ్యసనం పెరిగి మానసిక ఆరోగ్య సమస్యలు.
  • ఆత్మహత్య ఆలోచనలు, దూకుడు ప్రవర్తన, డిప్రెషన్ వంటి ప్రమాదాలు.
  • బాలికలపై తీవ్ర ప్రభావం: 5-6 ఏళ్లలో 48% మందికి సూసైడ్ థాట్స్.
  • తల్లిదండ్రులు ఫోన్ వాడకాన్ని నియంత్రించాలని నిపుణుల సూచన.

ఈ కథనం ఒక కీలక సామాజిక సమస్యను హైలైట్ చేస్తుంది: పిల్లలలో, ముఖ్యంగా 13 ఏళ్లలోపు వారిలో స్మార్ట్‌ఫోన్ వ్యసనం పెరుగుదల. ఈ ధోరణి తీవ్రమైన మానసిక, శారీరక ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది, ఇది భవిష్యత్ తరాలను డిజిటల్ హాని నుండి రక్షించడానికి తల్లిదండ్రులు, విద్యావేత్తలు, విధాన రూపకర్తల నుండి తక్షణ దృష్టిని కోరుతుంది.

చిన్నారులపై ఫోన్ వ్యసనం తీవ్ర ప్రభావం

కమ్యూనికేషన్ కోసమో.. ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమో వాడితే స్మార్ట్‌ఫోన్ వల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. కానీ దీని అధిక వాడకమే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పదమూడేండ్లలోపు చిన్నారులు సైతం ఇప్పుడు ఫోన్ వ్యసనానికి లోనవుతున్నారని, ఇది అనర్థాలకు దారితీస్తుందని మానసి ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

మానసిక సమస్యలు: అధ్యయనాల వెల్లడి

స్మార్ట్‌ఫోన్ ప్రభావాన్ని తెలుసుకునేందుకు పరిశోధకులు 18 నుంచి 24 ఏండ్ల వయసు గల మొత్తం ఒక లక్షకంటే ఎక్కువ మందిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు 13 సంవత్సరాలలోపు పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లు వాడటంవల్ల మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా 12 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సుగల పిల్లలు స్మార్ట్‌ఫోన్ తరచుగా వాడటంవల్ల ఆత్మహత్యా ఆలోచనలు, దూకుడు ప్రవర్తన, వాస్తవికత నుంచి వేరుపడటం, భావోద్వేగ నియంత్రణలో లోపం(Emotional dysregulation), తక్కువ స్వీయ- నిర్ధారణ (Self-evaluation) వంటి సమస్యలు ఎదుర్కొన్నట్టు తేలింది. ఇక బాలురకంటే కూడా బాలికలు ఈ విషయంలో మరింత ఎక్కువగా సమస్యను ఎదుర్కొన్నారని, 5-6 సంవత్సరాల వయస్సులో స్మార్ట్‌ఫోన్ చూస్తున్న బాలికలలో 48% మంది తమకు ఒక్కసారైనా సూసైడ్ థాట్స్ వచ్చిందని వెల్లడించినట్లు అధ్యయనం పేర్కొన్నది.

తల్లిదండ్రులకు నిపుణుల సూచనలు

మరొక అధ్యయనం ప్రకారం కూడా.. దాదాపు ఇదే వెల్లడించింది. 12 సంవత్సరాల వయస్సులో స్మార్ట్‌ఫోన్ అధికంగా వాడుతున్న పిల్లలు డిప్రెషన్, ఒబేసిటీ, నిద్రలేమి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తేలింది. దీంతోపాటు పిల్లల్లో సైబర్‌ బెదిరింపులు(Cyberbullying), నిద్రా భంగం, కుటుంబ సంబంధాలలో లోపాలు వంటివి స్మార్ట్‌ఫోన్ అధిక వాడకం వల్ల కలుగుతున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లు అనేక రకాల సోషల్ మీడియా యాక్సెస్‌కు దారి తీయడం కూడా ఇందుకు కారణం అవుతున్నది. ఈ పరిస్థితి 18 ఏండ్లు దాటిన మానసిక పరిపక్వత ఉన్న యువతపై పెద్ద ప్రభావం చూపకపోవచ్చు కానీ.. 13 ఏండ్లలోపు వారిలో మాత్రం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలకు స్మార్ట్‌ఫోన్ యాక్సెస్‌ను నియంత్రించాలని, డిజిటల్ లిటరసీని ప్రోత్సహించాలని, గాడ్జెట్స్ వాడకంలో పరిమితులు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

పిల్లల్లో పెరుగుతున్న ఫోన్ వ్యసనం తీవ్ర సామాజిక, ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. దీనిని అరికట్టడానికి తల్లిదండ్రులు, పాఠశాలలు, ప్రభుత్వం సమన్వయంతో పనిచేయడం అత్యవసరం. భవిష్యత్ తరాలను కాపాడటానికి డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.