|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆధార్ యాప్ సంచలనం: 5 నెలల్లో కోట్లాది డౌన్‌లోడ్‌లు, ప్రైవసీ భద్రం!

Published: 23-06-2026, 4:34 PM
ఆధార్ యాప్ సంచలనం: 5 నెలల్లో కోట్లాది డౌన్‌లోడ్‌లు, ప్రైవసీ భద్రం!
  • కొత్త ఆధార్ యాప్ కేవలం 5 నెలల్లో 3.1 కోట్ల డౌన్‌లోడ్‌లు సాధించింది.
  • ఈ యాప్ ద్వారా 40 లక్షల మొబైల్ నంబర్ అప్‌డేట్‌లు, 8.5 లక్షల అడ్రస్ మార్పులు జరిగాయి.
  • పాత ఎం-ఆధార్ యాప్‌లో ఉన్న గోప్యతా సమస్యలను కొత్త యాప్ పరిష్కరించింది.
  • ఆధార్ కేంద్రాలకు వెళ్లకుండానే ఇంటి నుంచే సేవలు పొందే సౌలభ్యం.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఆధార్ యాప్ అద్భుత విజయం సాధించింది. కేవలం ఐదు నెలల్లోనే 3.1 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకోగా, లక్షలాది మంది తమ ఆధార్ వివరాలను సులభంగా అప్‌డేట్ చేసుకున్నారు. ఇది ప్రజల్లో యాప్ పట్ల పెరిగిన నమ్మకాన్ని సూచిస్తోంది.

ఆధార్ యాప్: 5 నెలల్లో అద్భుత రికార్డులు

కేంద్రం తీసుకువ‌చ్చిన ఆధార్ యాప్ రికార్డులు సృష్టిస్తోంది. యాప్ తీసుకువ‌చ్చిన కేవ‌లం 5 నెల‌ల్లోనే 3.1 కోట్ల మంది ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా 40 ల‌క్ష‌ల మంది త‌మ మొబైల్ నంబ‌ర్ అప్డేట్ చేసుకున్నారు. అంతేకాకుండా 8.5 ల‌క్ష‌ల మంది త‌మ అడ్ర‌స్ మార్చుకున్నారు. ఐదు నెల‌ల్లో ఈ స్థాయిలో డౌన్ లోడ్స్ పెర‌గ‌టం ఆధార్ యాప్ పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం పెర‌గ‌డాన్ని సూచిస్తున్న‌ట్టు అధికారులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఉన్న ఆధార్ యాప్ కంటే ముందు ఎం ఆధార్ యాప్ ఉండేది.

పాత యాప్‌లో గోప్యతా సమస్యలు: కొత్త యాప్ పరిష్కారం

అయితే ఇందులో గోప్య‌త‌కు సంబంధించిన స‌మ‌స్య ఉంద‌నే ఫిర్యాదులు వ‌చ్చాయి. ధృవీక‌ర‌ణ స‌మ‌యంలో వినియోగ‌దారుల పూర్తి స‌మాచారం క‌నిపించ‌డంతో ఈ యాప్ పై ఫిర్యాదులు అందాయి. ఇక ప్ర‌స్తుతం తీసుకువ‌చ్చిన యాప్ లో అలాంటి స‌మ‌స్య‌లు లేక‌పోవ‌డంతో అనుమానం లేకుండా వినియోగిస్తున్నారు. అంతేకాకుండా గ‌తంలో ఏదైనా అప్డేట్ చేయాలంటే ఆధార్ కేంద్రాల వ‌ద్ద క్యూలో నిల‌బ‌డాల్సిన ప‌ని త‌ప్పింది. ఇక ఇప్ప‌టికీ కొంద‌రు ఆధార్ అప్డేట్ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది ప‌డుతున్నారు.

ఆధార్ సేవలు సులభతరం: ఎలా వాడాలి?

యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల‌నుకునేవాళ్లు ముందుగా యాపిల్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్‌లో ఆధార్ యాప్ అని ఇంగ్లీష్‌లో టైప్ చేయాలి. తరవాత యూఐడీఏఐ విడుదల చేసిన అఫిషియల్ యాప్ పైన కనిపిస్తుంది. దానిని డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్ ఇన్ స్టాల్ అయిన తరవాత అందులో మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. అనంతరం ఓటీపీ ఎంటర్ చేసి తరవాత ఆధార్ సేవలను వినియోగించుకోవచ్చు.

పాత యాప్‌లోని గోప్యతా సమస్యలను పరిష్కరించి, ఆధార్ సేవలను సులభతరం చేసిన ఈ కొత్త యాప్, డిజిటల్ ఇండియా లక్ష్యాలకు ఊతమిస్తోంది. ఇది ప్రజలకు మరింత సౌలభ్యాన్ని, సురక్షితమైన ఆధార్ వినియోగాన్ని అందిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.