
📌 Key Points
- బాలకృష్ణ నటించిన ‘రౌడీ ఇన్స్పెక్టర్’ చిత్రం విడుదలై 34 సంవత్సరాలు పూర్తయ్యాయి.
- బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పోలీస్ కథలకు ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది.
- ఈ సినిమా బాలకృష్ణ కెరీర్‌లో 57వ చిత్రం, విజయశాంతితో 16వ కాంబినేషన్.
- ఆ రోజుల్లోనే 35 సెంటర్లలో వంద రోజులు ఆడి సంచలన వసూళ్లు సాధించింది.
బాలకృష్ణ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిన ‘రౌడీ ఇన్స్పెక్టర్’ చిత్రం విడుదలై 34 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సినిమా సృష్టించిన రికార్డులు, బాలయ్య అందుకున్న గౌరవాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ బ్లాక్‌బస్టర్ విశేషాలను తెలుసుకుందాం.
రౌడీ ఇన్స్పెక్టర్: బాలయ్య కెరీర్‌లో మైలురాయి
Balakrishna: సాధారణంగా కొన్ని కొన్ని చిత్రాలు సెలబ్రిటీల కెరియర్లో మైలురాయిగా నిలిచిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఆ సినిమాలు సృష్టించిన ప్రభంజనం.. క్రియేట్ చేసిన రికార్డులు అంతా ఇంతా కాదు. అంతేకాదు ఆ చిత్రాలు ఆయా హీరోలను లేదా హీరోయిన్లను ఉన్నత స్థానానికి చేరుస్తాయి అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే బాలకృష్ణ నటించిన రౌడీ ఇన్స్పెక్టర్ మూవీకి 34 సంవత్సరాలు. ఈ సందర్భంగా ఈ సినిమా సృష్టించిన రికార్డులతో పాటు ఈ సినిమాతో బాలకృష్ణ అందుకున్న గౌరవాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ సినిమా విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…
ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ పతాకం పై టి.త్రివిక్రమ రావు నిర్మించిన చిత్రం రౌడీ ఇన్స్పెక్టర్. ఈ సినిమా విడుదల అయి 34 సంవత్సరాలు. బాలకృష్ణ హీరోగా, విజయశాంతి హీరోయిన్గా వచ్చిన ఈ సినిమా అప్పట్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. అంతేకాదు పోలీస్ ఆఫీసర్ సినిమాల్లో ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందని చెప్పవచ్చు. 1992లో వచ్చిన ఈ సినిమా.. అప్పటివరకు వచ్చిన సినిమాలలో పోలీస్ పాత్రలు అంటే నీతి, నిజాయితీకి మారుపేరుగా ఉండేవి. కానీ ఈ సినిమాలో అన్యాయాన్ని అంత మొందించడానికి పోలీస్ రౌడీ లాగా ప్రవర్తించక తప్పదు అనే కాన్సెప్ట్ తో చాలా అద్భుతంగా తెరకెక్కించారు.
ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన పోలీస్ కథ
దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన రెండవ చిత్రమిది. అంతకుముందు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన లారీ డ్రైవర్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా విడుదలైన తర్వాత సమరసింహారెడ్డి, పల్నాటి నరసింహనాయుడు, నరసింహనాయుడు వంటి సినిమాలు వచ్చి సందడి చేశాయి. అంతేకాదు బాలకృష్ణ కి రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా హీరోగా 57వ చిత్రం కావడం విశేషం. మరో విశేషం ఏమిటంటే ..బాలయ్య, విజయశాంతి కాంబినేషన్లో వచ్చిన 16వ చిత్రం ఇది. ఈ సినిమా తర్వాత చివరిగా వీళ్ళిద్దరూ నిప్పురవ్వ సినిమాలో జోడిగా నటించారు. ముఖ్యంగా వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు 90% బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.
సినిమా సృష్టించిన రికార్డులు, విశేషాలు
ఈ సినిమా రికార్డులు కూడా క్రియేట్ చేసింది. విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ నిర్మించిన ఈ సినిమా సంచలన వసూళ్లు అందుకుంది. ఆ రోజుల్లోనే 35 సెంటర్లలో వంద రోజులు ఆడింది . తమిళ్ లో కూడా ఈ సినిమాను అదే పేరుతో అనువదించగా.. అక్కడ కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. తమిళ్ లోనే కాకుండా హిందీలో కూడా డబ్బింగ్ చేయగా డబ్బింగ్ చిత్రాలలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ముంబైలో రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు సీనియర్ స్టార్ హీరోలలో ఫుల్ లెంగ్త్ పోలీస్ రోల్ లో నటించి బ్లాక్ బాస్టర్ కొట్టిన ఒకే ఒక హీరోగా బాలకృష్ణ సంచలనం సృష్టించారు .మొత్తానికైతే ఈ సినిమాతో అప్పట్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు బాలయ్య.
రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా బాలకృష్ణ కెరీర్‌లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ చిత్రం సృష్టించిన రికార్డులు, దాని ప్రభావం ఇప్పటికీ సినీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇది నిజంగా ఒక అరుదైన మైలురాయి.


