
📌 Key Points
- ఎన్టీఆర్ తో నేరుగా మాట్లాడే దమ్మున్న వ్యక్తి ఎవరు? బాలకృష్ణ సంచలన ప్రకటన.
- నందమూరి హరికృష్ణ పాత్రపై బాలయ్య షాకింగ్ నిజాలు వెల్లడి.
- రామారావుకు కుడిభుజంగా నిలిచిన హరికృష్ణ అరుదైన బంధం.
- రాజకీయ, సినీ రంగాల్లో ఎన్టీఆర్ కు హరికృష్ణ మద్దతు, సలహాలు.
తెలుగు సినీ చరిత్రలో, రాజకీయాల్లో ఎన్టీఆర్ ఒక ధృవతార. అలాంటి మహానాయకుడికి ఎదురు చెప్పే ధైర్యం ఎవరికి ఉండేది? బాలకృష్ణ బయటపెట్టిన ఈ షాకింగ్ రహస్యం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ వార్త తెలుగు అభిమానులను ఉర్రూతలూగిస్తోంది!
ఎన్టీఆర్ ను ఎదిరించిన ఒకే ఒక్కరు!
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మాత్రమే కాదు.. తెలుగు రాజకీయాల్లో కూడా ఎన్నో సంచనాలకు కారణం ఎన్టీఆర్. తెలుగు జాతి గర్వంగా చెప్పుకునే పేరు అది. పౌరాణిక పాత్రలతో జనాల్లో దేవుడిగా కొలవబడిన రామారావు.. ఆతరువాత రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. సీఎంగా సంచలన నిర్ణయాలు తీసుకున్న ఆయన.. కొన్ని తరాల పాలు తెలుగువారు తలుచుకునే లీడర్ అయ్యారు. ఇక షూటింగ్ సెట్ లో కానీ.. రాజకీయ రణరంగంలో కానీ ఎన్టీఆర్ తో మాట్లాడాలంటే ఎవరైనా భయపడే వారు. ఆయన ఎదురుగా వెళ్లి మాట్లాడాలంటే వెనకడుగు వేసేవారు. ఎదిరించి మాట్లాడాలంటే ఎవరికి సాధ్యం అయ్యేది కాదు.
ఎన్టీఆర్ కు సినిమాల్లో కుడిభుజంలా నిలబడ్డాడు ఆయన తమ్ముడు నందమూరి త్రివిక్రమ రావు. నిర్మాతగా, దర్శకుడిగా ఆయన ఆయన ఎన్నో సినిమాలు చేశారు. ఇండస్ట్రీలో రామారావుని కనిపెట్టుకుని ఉన్నాడు. ఎన్టీ రామారావుకు ఏమూనా చెప్పాలంటే ఆయన మాత్రమే చెప్పగలిగేవారు. ఇక ఆయన తరువాత ఎన్టీఆర్ ను అన్నీ తానై చూసుకున్నా మరో వ్యక్తి ఒకరు ఉన్నారు ఆయనే ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ. అందరిలో పెద్దవాడు కాకపోయినా.. ఎన్టీఆర్ కు తలలో నాలుకలా మెలిగాడు. పెద్దాయన వెన్నంటే ఉంటూ.. పొలిటికల్ గా ఆయన్న కనిపెట్టుకుని ఉన్నారు.
బాలయ్య బయటపెట్టిన ఆ అరుదైన బంధం!
ఎన్టీఆర్ పొలిటికల్ విషయాలన్నీ హరికృష్ణ చూసుకునేవారు. ఆయన పర్యటనలు, ఫుడ్డు, అపాయింట్ మెంట్లు, ఇలా అంతా హరికృష్ణ చేతుల్లోకి వెళ్లింది. రాజకీయంగా ఏ పనులైనా హరికృష్ణ మాత్రమ చూసుకేవారు. ఎన్టీఆర్ పక్కనే ఉంటూ.. ఎన్టీఆర్ కు డ్రైవర్ గా కూడా ఆయన పనిచేశాడు. ఎన్టీ రామారావు తలపెట్టిన చైతన్య రధయాత్రకు సాధరి హరికృష్ణనే. తెలుగుదేశం అధికారంలోకి రావడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. ప్రస్తుతం బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న హిందూపూర్ నుంచి గతంలో హరికృష్ణ ఎన్నో సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తండ్రి క్యాబినేట్ లో రవాణశాఖా మంత్రిగా కూడా పనిచేశారు హరికృష్ణ. ఆడవారికి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సుల్లో సీట్లు కేటాయించిన ఘనత ఆయనదే.
ఎన్టీ రామారావుకు సినిమాల్లో కానీ, షూటింగ్స్ లో కానీ, పొలిటికల్ విషయాల్లో కానీ ఎదురుచెప్పడం ఎవరికి సాధ్యం అయ్యేది కాదు. ఏదైనా చెప్పాలన్నా భయపడే వారు. షూటింగ్ సెట్ లో అయితే ఆయన ఉన్నాడంటే అంతా కామ్ గా ఎవరి పని వారు చేసుకునే వారు. పార్టీ అధ్యక్షుడిగా కూడా ఎన్టీఆర్ కు ఏదైనా చెప్పాలంటే లీడర్లు వెనకడుగు వేసేవారు. కానీ హరికృష్ణ ఒక్కరే ఎన్టీఆర్ తో సూటిగా మాట్లాడుతూ.. ఆయనకు విషయాలు వెల్లడించేవారు. అది కరెక్ట్ కాదు అని ఎన్టీఆర్ మాటకు ఎదురు చెప్పాలన్నా అది హరికృష్ణకు మాత్రమే సాధ్యం అయ్యేదట. ఈ విషయాన్ని బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
హరికృష్ణ సాహసం… చరిత్రలో నిలిచిపోయే నిజం!
బాలకృష్ణ చెప్పిన వివరాల ప్రకారం… హరికృష్ణకు స్వతహాగా ధైర్యం ఎక్కువ. ఆయన ఏవిషయంలోను వెనకడుగు వేయడు. ఎన్టీఆర్ సినిమాలు చేసుకుంటూ చెన్నైలో ఉండేవారు. హరికృష్ణ మాత్రం నిమ్మకూరులో ఆయన తాతగారి ఇంట్లో పెరిగాడు. రామారావు తండ్రి హరికృష్ణను పెంచారట. ఏ విషయంలో అయినా దూకుడు స్వభావం కలిగి ఉండేవారు హరికృష్ణ. ఎంత స్ట్రిక్ట్ గా ఉండేవారో.. ఆయనది అంతే మంచి మనసు కూడా. చాలా తక్కువ సినిమాల్లో నటించారు హరికృష్ణ.. పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో ఎక్కువ సినిమాల్లో కనిపించారు. నిర్మాతగా, వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా హరికృష్ణ మార్క్ చాలా ప్రత్యేకం.
బాలకృష్ణ చెప్పిన ఈ అరుదైన విషయం నందమూరి అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. ఎన్టీఆర్, హరికృష్ణల బంధం ఎంత గొప్పదో మరోసారి రుజువైంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం వేచి ఉండండి!


