
📌 Key Points
- బాలయ్య బాబు మాస్ అవతార్‌కు బ్రేక్, సరికొత్త థ్రిల్లర్ జానర్‌లో నెక్స్ట్ మూవీ!
- యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో బాలయ్య బాబు భారీ సినిమా ప్లానింగ్!
- దిల్ రాజు నిర్మాణంలో బాలయ్య న్యూ మూవీ.. త్వరలో అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్!
- మాస్ ఆడియన్స్‌ను థ్రిల్ చేసేందుకు బాలయ్య రెడీ.. ఇది మామూలు ట్విస్ట్ కాదు!
నందమూరి బాలకృష్ణ తన మాస్ ఇమేజ్‌ను మార్చుకుంటున్నారా? అవును! ఆయన ఒక థ్రిల్లర్ సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం. ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బాలయ్య బాబు న్యూ లుక్!
Balakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జామ్పుల్ అంటే నందమూరి బాలకృష్ణ అనే చెప్పాలి. ఆయన సినిమాల్లో యాక్షన్ సీన్స్, మాస్ ఎలిమెంట్స్, డైలాగ్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. అందుకే, మాస్ జనాలను ఉర్రూతలూగించడంలో బాలయ్యే నంబర్ వన్. అయితే, అలాంటి సీన్స్ వేరే హీరో చేస్తే ఆడియన్స్ తీసుకోలేరు. అది కేవలం బాలయ్యకు మాత్రమే సాధ్యం అని చెప్పాలి. అలాంటి అంశాలు లేకుండా బాలకృష్ణ(Balakrishna) సినిమాను ఊహించుకోవడం కష్టం.
కానీ, తాజాగా సమాచారం ప్రకారం ఆయన ఈ మాస్ ఎలిమెంట్స్ ని పక్కన పెట్టి సరికొత్త జానర్ లో తన కొత్త సినిమాను చేస్తున్నాడట బాలకృష్ణ. ఆ జానర్ మరేదో కాదు థ్రిల్లర్. ఈమధ్య కాలంలో ఆడియన్స్ ఈ తరహా సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. రొటీన్ సినిమాలకు భిన్నంగా, ఊహకు అందని మలుపులతో ఉంటాయి కాబట్టి థ్రిల్లర్ జానర్ సినిమాలు ఆదరణ ఎక్కువగా పెరిగింది.
యంగ్ డైరెక్టర్‌తో రిస్క్?
దాంతో, అలాంటి కథతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట బాలకృష్ణ. అందుకోసం ఓ కుర్ర దర్శకుడితో జత కట్టనున్నాడట. దర్శకుడు మరెవరో కాదు వివేక్ ఆత్రేయ. ఈ దర్శకుడు గతంలో మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి, సరిపోదా శనివారం లాంటి సినిమాలు చేశాడు. సరిపోదా శనివారం సినిమా నుంచి తన జానర్ ను చేంజ్ చేసుకున్న వివేక్ ఆత్రేయ అదిరిపోయే థ్రిల్లర్ కథని సిద్ధం చేసుకున్నాడట. దానికి బాలకృష్ణ అయితేనే బాగుంటుంది అని ఫిక్స్ అయ్యాడట.
దిల్ రాజు నిర్మాణంలో మూవీ!
ఆ కథని బాలకృష్ణకు వినిపించగా ఆయన కూడా కొత్త జానర్ కావడంతో వెంటనే ఒకే చెప్పేశాడట. రెగ్యులర్ గా మాస్ సినిమాలు చేసి బోర్ కొట్టడటంతో సరికొత్తగా ఉండేలా ఈ ప్రాజెక్టును ఒకే చేశాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తాడని టాక్. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి మాస్ అంశాలను పక్కన పెట్టి కొత్త జానర్ లో సరికొత్తగా వస్తున్న బాలకృష్ణ ఆడియన్స్ ను ఏ రేంజ్ లో మెప్పిస్తాడు అనేది చూడాలి.
బాలకృష్ణ కొత్త జానర్‌లో ఎలా మెప్పిస్తారో చూడడానికి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


