|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Balakrishna – Vishwak Sen : ఫ్యాన్స్ గెట్ రెడీ.. విశ్వక్ సేన్ సినిమాలో బాలయ్య బాబు గెస్ట్ రోల్.. చాన్నాళ్లకు కామెడీతో..

Published: 03-07-2025, 7:23 AM
Balakrishna – Vishwak Sen : ఫ్యాన్స్ గెట్ రెడీ.. విశ్వక్ సేన్ సినిమాలో బాలయ్య బాబు గెస్ట్ రోల్.. చాన్నాళ్లకు కామెడీతో..

నటుడు బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే, యువ హీరో విశ్వక్ సేన్ సినిమాలో ఆయన గెస్ట్ రోల్ చేయబోతున్నారని సమాచారం. చాలాకాలం తర్వాత బాలయ్య కామెడీ రోల్ లో కనిపిస్తున్నారు.

Key Points

1

బాలకృష్ణ గెస్ట్ రోల్‌తో విశ్వక్ సేన్ సినిమాకు హైప్ పెరుగుతుంది.

2

చాలా కాలం తర్వాత బాలయ్య కామెడీ రోల్‌లో కనిపించనున్నారు.

4

విశ్వక్ సేన్, బాలకృష్ణ మధ్య ఉన్న స్నేహం ఈ గెస్ట్ రోల్‌కు కారణమని తెలుస్తోంది.

బాలయ్య గెస్ట్ రోల్ విశేషాలు

Balakrishna – Vishwak Sen : బాలయ్య బాబు ప్రస్తుతం అన్ని సీరియస్ కథాంశం ఉన్న సినిమాలే చేస్తూ వరుస హిట్స్ కొడుతున్నాడు. అఖండ సినిమా నుంచి ఆగకుండా దూసుకుపోతున్నారు బాలకృష్ణ. త్వరలో అఖండ 2 సినిమాతో రాబోతున్నాడు. బాలకృష్ణ కామెడీ చూసి చాన్నాళ్ళైపోతుంది. అందుకే ఫ్యాన్స్ లో ఆ కొరత తీర్చేందుకు బాలయ్య ఓ కామిక్ రోల్ తో రాబోతున్నారని సమాచారం.

యువ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం ఫంకీ అనే సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 చేయబోతున్నాడు. ఇటీవలే తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో మొత్తం అదే నటీనటులతో ఈ నగరానికి ఏమైంది 2 సినిమాని ENE రిపీట్ అనే టైటిల్ తో ప్రకటించారు. ఈసారి కూడా యూత్ ఫుల్ కామెడీతో సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.

‘ఈ నగరానికి ఏమైంది 2’ సినిమా హైలైట్స్

బాలకృష్ణ – విశ్వక్ సేన్ స్నేహం

అయితే ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 లో బాలకృష్ణ గెస్ట్ రోల్ చేస్తాడని, సినిమాలో 15 నిముషాలు కనిపిస్తాడని సమాచారం. విశ్వక్ సేన్ – బాలకృష్ణ క్లోజ్ అని తెలిసిందే. ఈ క్రమంలో విశ్వక్, తరుణ్ భాస్కర్ అడగడంతో బాలయ్య ఒప్పుకున్నాడని టాలీవుడ్ లో సమాచారం. ఇదే కనక నిజమైతే ఈ నగరానికి ఏమైంది సినిమాకు మరింత హైప్ రావడమే కాక బాలయ్యని ఓ కొత్త అవతారంలో చూడొచ్చు అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

చివరగా, బాలకృష్ణ గెస్ట్ రోల్ తో ఈ సినిమాకు మరింత ఆసక్తి పెరుగుతుందని అభిమానులు భావిస్తున్నారు. బాలయ్య కామెడీ చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.