|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కాల్పుల ముందు బాలయ్య డిప్రెషన్: ‘నేనుండను, పిల్లలని చూసుకో’ – సంచలన నిజాలు!

Published: 28-06-2026, 2:16 AM
కాల్పుల ముందు బాలయ్య డిప్రెషన్: 'నేనుండను, పిల్లలని చూసుకో' - సంచలన నిజాలు!
  • 2004 కాల్పుల ఘటన ముందు బాలయ్య తీవ్ర డిప్రెషన్.
  • “నేను ఇక బతకను, పిల్లలని చూసుకో” అని బాలయ్య ఆవేదన.
  • కాలు విరగడం, ‘లక్ష్మీ నరసింహ’ సినిమా సమస్యలు కారణం.
  • దగ్గుబాటి వెంకటేశ్వర రావు బయటపెట్టిన సంచలన విషయాలు.

టాలీవుడ్ చరిత్రలో సంచలనం సృష్టించిన బాలయ్య కాల్పుల ఘటన వెనుక ఎవరికీ తెలియని ఎన్నో నిజాలు ఇప్పుడు బయటపడ్డాయి. తీవ్ర డిప్రెషన్‌లో బాలయ్య ఆడిన మాటలు, ఆనాటి పరిస్థితులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలు మీకోసం!

కాల్పుల ముందు బాలయ్య డిప్రెషన్ వెనుక అసలు కారణం!

2004 లో నందమూరి బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల సంఘటన సినీ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృస్టించింది. ఈ ఘటనతో టాలీవుడ్ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది అనే చెప్పాలి. బాలకృష్ణ ఇంట్లో అప్పుడు సత్యనారాయణ చౌదరి అనే జ్యోతిష్యుడిపై, నిర్మాత బెల్లంకొండ సురేష్ పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో వారు గాయపడడం కూడా జరిగింది.

ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కేసుని కొట్టివేశారు. ఈ సంఘటనపై దగ్గుబాటి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. కాల్పులకు ఒక రోజు ముందు నేను బాలకృష్ణ ఇంటికి వెళ్ళాను. అప్పుడు బాలకృష్ణకి ప్రమాదంలో కాలు విరగడంతో ఆపరేషన్ జరిగింది. 15 రోజుల నుంచి బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాడు. పరామర్శించడానికి నేను వెళ్లాను.

“నేను ఇక ఉండను, పిల్లలని చూసుకో”: బాలయ్య ఆవేదన

అప్పుడు బాలయ్య నాతో చాలా డిప్రెషన్ లో ఉండి మాట్లాడాడు. నేను ఇక బతకను.. పిల్లలని నువ్వే చూసుకోవాలి బావా అని అన్నాడు. అంత తీవ్రమైన డిప్రెషన్ లో బాలయ్య ఉండడానికి కారణం ఉంది. కాలు విరగడంతో మునుపటిలా తాను డ్యాన్సులు, ఫైట్స్ చేయలేను ఏమో అనే బాధ ఉంది. లక్ష్మీ నరసింహ చిత్రాన్ని ఎక్కువ సెంటర్స్ లో 100 రోజులు ఆడిస్తాం అని నిర్మాత బెల్లంకొండ సురేష్ ముందుగా చెప్పారు.

కానీ ఎక్కువ సెంటర్స్ లో ఉంచకుండా ఆ చిత్రాన్ని తీసేస్తూ వచ్చారు. ఆ బాధ మరొకటి. ఈ రెండు కారణాల వల్ల బాలయ్య తీవ్ర డిప్రెషన్ లో కనిపించారు. అందుకే నేను ఇక ఉండను అనే మాట బాలయ్య నోటి నుంచి వచ్చింది అని వెంకటేశ్వర రావు అన్నారు.

బెల్లంకొండ సురేష్ పై బాలయ్య ఆగ్రహానికి అసలు కారణం?

ఆ మరుసటి రోజు నేను వేరే ఫంక్షన్ కి వెళుతుంటే ఇలా జరిగింది అని కాల్ వచ్చింది. వెంటనే కారు వెనక్కి తిప్పు తాను హాస్పిటల్ కి వెళ్లినట్లు వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ సంఘటన తర్వాత పురందేశ్వరి, వెంకటేశ్వర రావు.. అప్పటి సీఎం వైఎస్ఆర్ ని కలిసి బాలయ్యని సేవ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. తాను దీని గురించి అసలు వైఎస్ఆర్ తో మాట్లాడనేలేదు అని అన్నారు. కానీ ఈ సంఘటనని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంత సీరియస్ గా మాత్రం తీసుకోలేదు అని వెంకటేశ్వర రావు అన్నారు.

బాలయ్య జీవితంలో ఆనాటి సంచలన ఘటన వెనుక ఇంతటి ఆవేదన ఉందా అని ఈ వార్తతో స్పష్టమవుతోంది. ఈ విషయాలపై మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచి చూడండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.