|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నా లైఫ్‌ నాఇష్టం, మీ లైఫ్‌ మీరు చూసుకోండి.. ఫుడ్‌పై ట్రోల్‌ చేసిన వారికి బాలయ్య హీరోయిన్‌ అదిరిపోయే కౌంటర్‌

Published: 27-07-2025, 8:21 AM
నా లైఫ్‌ నాఇష్టం, మీ లైఫ్‌ మీరు చూసుకోండి.. ఫుడ్‌పై ట్రోల్‌ చేసిన వారికి బాలయ్య హీరోయిన్‌ అదిరిపోయే కౌంటర్‌

వీరభద్ర చిత్రంలో నటించిన తనుశ్రీ దత్తా తన ఇన్‌స్టాగ్రామ్‌లో మాంసాహారం తింటున్న ఫోటో పోస్ట్ చేయడంతో ట్రోలింగ్‌కు గురైంది. దీనికి ఆమె సోషల్ మీడియాలో ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.

Key Points

1

వీరభద్ర హీరోయిన్ తనుశ్రీ దత్తా మాంసాహారం తినడంపై ట్రోలింగ్‌ను ఎదుర్కొంది.

2

ఆమె తన బ్రాహ్మణ సంస్కృతిలో మాంసం, చేపలు దేవతలకు నైవేద్యంగా పెట్టడం సంప్రదాయమని వివరించింది.

4

వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోవడంపై ఆమె తీవ్రంగా అభ్యంతరం తెలిపింది.

మాంసాహారంపై విమర్శలు

బాలకృష్ణతో `వీరభద్ర`లో హీరోయిన్‌గా నటించి తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయిన తను శ్రీ దత్తా ఇటీవల చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆమె తన ఇంట్లోనే వేధింపులకు గురవుతున్నట్టు చెప్పి షాకిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోని పంచుకోగా వైరల్‌ అయ్యింది. ఇందులో ఆమె ఏడుస్తూ కనిపించారు

ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు తనుశ్రీ దత్తా.  తన ఆహారపు అలవాట్ల గురించి విమర్శించిన వారికి సోషల్ మీడియాలో ఘాటుగా సమాధానమిచ్చి మళ్ళీ చర్చనీయాంశమయ్యారు. మాంసాహారం తీసుకున్నందుకు ట్రోల్ చేసిన వారిని ఖండించారు. ఇలాంటి విమర్శలు ‘చిన్నబుచ్చే మనస్తత్వాన్ని’ ప్రతిబింబిస్తాయని అన్నారు.

తనుశ్రీ దత్తా ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో మాంసాహారం తీసుకుంటున్న ఫోటో షేర్ చేశారు. దీన్ని చూసిన కొంతమంది నెటిజన్లు ఆమె ఆహారపు అలవాట్లను ప్రశ్నించడం మొదలుపెట్టారు.

తనుశ్రీ దత్తా కౌంటర్

ముఖ్యంగా ఆమె బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు, ఆధ్యాత్మిక భావాలు కలిగినవారు కాబట్టి మాంసాహారం తినడం తప్పు అని కామెంట్లు చేశారు. ఈ విమర్శలు వ్యక్తిగత దూషణలకు దిగజారడంతో తనుశ్రీ దత్తా మౌనం వీడి కౌంటర్ ఇచ్చారు.

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెద్ద నోట్ రాస్తూ, ట్రోలర్స్ అజ్ఞానాన్ని, సంకుచిత మనస్తత్వాన్ని తనుశ్రీ దత్తా తీవ్రంగా ఖండించారు. “కొంతమంది అవమానించే, చులకనగా చూస్తూ, తీర్పు చెప్పే జనాలకి ఒక మాట. నేను బెంగాలీ బ్రాహ్మణురాలిని.

మా సంస్కృతిలో చేపలు, మాంసం దేవతలకి నైవేద్యంగా పెడతాం. ముఖ్యంగా దుర్గాపూజ, కాళీపూజ సమయాల్లో ఇది మా సంప్రదాయంలో భాగం” అని స్పష్టం చేశారు.

సంస్కృతి, ఆహారం, వ్యక్తిగత స్వేచ్ఛ

నేను గొడ్డు మాంసం, పంది మాంసం తినను. కానీ చేపలు, మాంసం తినడం నా వ్యక్తిగత ఇష్టం. నా కృష్ణ భక్తికి, నా ఆహారపు అలవాట్లకి సంబంధం లేదు. భగవంతుడు ప్రేమ, భక్తి చూస్తాడే తప్ప ఎవరు ఏం తింటారో చూడడు. ప్రతి ఒక్కరి సంస్కృతి, నేపథ్యం వేరు. అందరినీ ఒకే గాటిన కట్టడం మూర్ఖత్వం” అని రాశారు.

“ఇలాంటి నెగెటివ్, తీర్పు చెప్పే మనస్తత్వం ఉన్నవాళ్ళు తమ జీవితాల గురించి ఆలోచిస్తే మంచిది. ఇతరుల జీవితాల్లో తొంగి చూడకుండా, తమ ఆధ్యాత్మికత, జీవితాలు మెరుగుపరుచుకోవాలి. నన్ను ట్రోల్ చేస్తే నేను ఊరుకుంటానని అనుకోకండి. నా జీవితం నా ఇష్టం, నిజాయితీగా బతుకుతా” అని సవాల్ విసిరారు.

మొత్తానికి, తనుశ్రీ దత్తా పోస్ట్ వ్యక్తిగత ఆహారపు అలవాట్లు, ఆహార స్వాతంత్య్రం, సాంస్కృతిక వైవిధ్యం గురించి చర్చను లేవనెత్తింది. ఆన్‌లైన్‌లో అనవసరంగా ఇతరులను విమర్శించే వారికి ఆమె సమాధానం తగిన కౌంటర్ అని చాలామంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మొత్తంమీద, తన ఆహారపు అలవాట్లపై వచ్చిన విమర్శలకు తనుశ్రీ దత్తా సమర్థవంతంగా సమాధానం చెప్పింది. వ్యక్తిగత స్వేచ్ఛ, సాంస్కృతిక వైవిధ్యాన్ని గుర్తించాలని ఆమె నొక్కి చెప్పింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.