|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కెరీర్ మొత్తం అలాంటి సినిమాలు చేసి ఇప్పుడు నీతులు చెబుతున్న బాలయ్య హీరోయిన్.. సూపర్ హిట్ మూవీపై విమర్శలు

Published: 13-12-2025, 5:48 AM
కెరీర్ మొత్తం అలాంటి సినిమాలు చేసి ఇప్పుడు నీతులు చెబుతున్న బాలయ్య హీరోయిన్.. సూపర్ హిట్ మూవీపై విమర్శలు
  • రాధికా ఆప్టే సాలి మొహబ్బత్ ప్రమోషన్స్‌లో హింసతో కూడిన సినిమాలపై విమర్శలు.
  • ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ సూపర్ హిట్ ధురంధర్ చిత్రాన్ని ఉద్దేశించి అని అంచనా.
  • ఆమె కెరీర్ ప్రారంభంలో గ్లామర్, హింస ఉన్న చిత్రాల్లో నటించిందని నెటిజన్ల విమర్శ.
  • అవకాశాలు తగ్గడంతోనే ఆమె కంటెంట్ బేస్డ్ సినిమాలపై దృష్టి పెట్టిందని వాదన.

హీరోయిన్ రాధికా ఆప్టే ఇటీవల ఓ బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమాల్లో హింసను అమ్ముకుంటున్నారని ఆమె విమర్శించింది. అయితే, గతంలో గ్లామర్, యాక్షన్ చిత్రాల్లో నటించిన రాధికాపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు

హీరోయిన్ రాధికా ఆప్టే పేరు చెప్పగానే ఆమె చుట్టూ గతంలో నెలకొన్న వివాదాలు గుర్తుకు వస్తాయి. బోల్డ్ స్టేట్మెంట్స్ తో రాధికా ఆప్టే నిత్యం వార్తల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం. తెలుగులో కూడా రాధికా ఆప్టే కొన్ని సినిమాల్లో నటించింది. లెజెండ్, లయన్, రక్త చరిత్ర లాంటి సినిమాలతో రాధికా ఆప్టే తెలుగు ప్రేక్షకులకు సుపరిచయమే. అయితే ఇటీవల ఆమెకి సౌత్ లో పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి. బాలీవుడ్ లో కూడా కొన్ని చిత్రాల్లో మాత్రమే నటిస్తోంది.

రీసెంట్ గా రాధికా ఆప్టే సాలి మొహబ్బత్ అనే చిత్రంలో నటించింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యంలో ముంచేలా ఉన్నాయి. ఓ సినిమాని టార్గెట్ చేస్తూ రాధికా ఈ వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు సినిమాలలో ఎంటర్టైన్మెంట్ పేరుతో హింసని అమ్ముకుంటున్నారు అంటూ రాధికా విమర్శలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. నేను నా చిన్నతనంలో ఇలాంటి భయంకర పరిస్థితుల మధ్య పెరగలేదు. ఈ వయలెన్స్ ట్రెండ్ చాలా డిస్ట్రబ్ చేసే విధంగా ఉంది అంటూ విమర్శలు చేసింది.

ఆమె గత చిత్రాలపై నెటిజన్ల ప్రశ్నలు

రాధికా ఆప్టే పరోక్షంగా చేసిన ఈ వ్యాఖ్యలు లేటెస్ట్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ధురంధర్ గురించే అని అంతా భావిస్తున్నారు. రాధికా ఆప్టే చేసిన ఈ వ్యాఖ్యలు నెటిజన్లకు షాకింగ్ గా ఉన్నాయి. ఎందుకంటే రాధికా ఆప్టే తన కెరీర్ బిగినింగ్ లోనే ఎక్కువగా స్కిన్ షో, ఇంటిమేట్ సీన్లు ఎక్కువగా ఉన్న చిత్రాల్లో నటించింది. కొన్ని చిత్రాల్లో తీవ్ర వివాదం అయ్యేలా గ్లామర్ షో చేసింది.

అదే విధంగా ఆమె హింస ఎక్కువ ఉన్న చిత్రాల్లో కూడా నటించింది. ఇప్పుడు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. కమర్షియల్ సినిమాల్లో ఛాన్సులు రావడం లేదు. అందుకే సెలెక్టివ్ గా కంటెంట్ బేస్డ్ సినిమాలు, సిరీస్ లు మాత్రమే చేస్తోంది. అలాంటి రాధికా ఆప్టే హింస ఉన్న సినిమాల గురించి మాట్లాడడం ఏంటి ? ఆమె కూడా అలాంటి సినిమాల్లోనే నటించింది కదా ? ఆమె చిన్నప్పుడు పరిస్థితులు యాక్షన్ మూవీస్ లో నటించేటప్పుడు గుర్తుకు రాలేదా అంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

ధురంధర్ మూవీపై విమర్శలు వెనుక

బాలీవుడ్ లో చాలా మంది ధురంధర్ సక్సెస్ ని జీర్ణించుకోలేకపోతున్నారు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ధురంధర్ చిత్రం రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కింది. డైరెక్టర్ ఆదిత్య ధార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

మొత్తం మీద, రాధికా ఆప్టే వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఆమె గత చరిత్రను గుర్తుచేస్తూ, నెటిజన్లు ఆమె తీరును ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం ఇంకా కొనసాగే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.