
📌 Key Points
- హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించిన ‘బ్యాండ్ మేళం’ సినిమా విడుదల తేదీలు పలుమార్లు మారాయి.
- సినిమా మార్చి 13న విడుదల కావాల్సి ఉండగా, ఏప్రిల్ 3కి వాయిదా పడింది.
- తాజా సమాచారం ప్రకారం, సినిమా మార్చి 26న శ్రీరామనవమి సందర్భంగా విడుదల కానుంది.
- ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించిన బ్యాండ్ మేళం సినిమా విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. ఈ సినిమా మార్చి 26న శ్రీరామనవమి సందర్భంగా విడుదల కానుంది. అనేక వాయిదాల తర్వాత సినిమా విడుదలవుతుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బ్యాండ్ మేళం సినిమా విడుదల వాయిదా
Band Melam Film: హర్ష రోషన్ శ్రీదేవి జంటగా నటించిన చిత్రం బ్యాండ్ మేళం(Band Melam). ఈ సినిమా విడుదల గురించి సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వార్తలు వచ్చాయి ముందుగా చిత్ర నిర్మాతలు ఈ సినిమాని మార్చి 13వ తేదీ విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇలా విడుదల తేదీన ప్రకటించడమే కాకుండా ఆ దిశగా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ వచ్చారు. అయితే ఉన్నఫలంగా ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా మార్చి 13వ తేదీ విడుదల కావాల్సిన ఈ సినిమా ఏకంగా ఏప్రిల్ మూడో తేదీకి వాయిదా పడుతోంది అంటూ వార్తలు వచ్చాయి అయితే మరోసారి ఈ సినిమా విడుదల తేదీ విషయంలో మార్పులు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది.
ఏప్రిల్ మూడో తేదీ ఈ సినిమా విడుదల కాబోతోంది అంటూ వార్తలు వచ్చాయి కానీ తాజాగా చిత్ర నిర్మాతలు ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సినిమాని ఏప్రిల్ మూడో తేదీ కంటే ముందుగానే విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా మార్చి 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మార్చి 26వ తేదీ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదల కాబోతున్నట్లు ఇదివరకు చిత్ర నిర్మాతలు తెలియజేశారు.
ఈ సినిమా అనుకున్న తేదీ కంటే ముందుగానే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఉగాది పండుగ సందర్భంగా మార్చి 19వ తేదీ ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల కాబోతున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే బ్యాండ్ మేళం సినిమా మార్చి 26 తేదీ విడుదలను ఫిక్స్ చేసుకుంది. ఈ సందర్భంగా విడుదల తేదీను ప్రకటిస్తూ శ్రీరామనవమికి మా బ్యాండ్ మేళం రాబోతోంది అంటూ ప్రత్యేకమైన పోస్టర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.
శ్రీరామనవమికి విడుదల కానున్న బ్యాండ్ మేళం
ఈ శ్రీరామ నవమి నాడు, మన సీతారాముల వారి కళ్యాణానికి వస్తున్న మా “బ్యాండ్ మేళం” ♥️🎶 #BandMelam Releasing in Cinemas Worldwide from March 26, 2026 🎥 #BandMelamOnMarch26 @HarshRoshan7 @SrideviActor @saikumaractor @konavenkat99 @SathishJavvaji @VijaiBulganin @boselyricist pic.twitter.com/wbn42ZFyNH
— Kona Film Corporation (@KonaFilmCorp) March 5, 2026
వైరల్ అవుతున్న బ్యాండ్ మేళం పోస్టర్
శ్రీరామనవమికి అయినా బ్యాండ్ మేళం పక్కాగా వస్తుందా? లేదంటే ఆ తేదీ ఏదైనా పెద్ద సినిమా విడుదలైతే మళ్లీ వాయిదా వేసుకుంటారా? అని సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే బ్యాండ్ మేళం సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలనే పెంచేసాయి. ఈ సినిమా బావ మరదలి ప్రేమ కథ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇందులో హర్ష రోషన్ శ్రీదేవి జంటగా నటించడంతో మరోసారి కోర్టు సినిమా సక్సెస్ రిపీట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు .ఈ చిత్రానికి సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహించగా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మించారు, ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరి శ్రీరామనవమికి రాబోతున్న బ్యాండ్ మేళం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా బ్యాండ్ మోగించనుందో తెలియాల్సి ఉంది.
బ్యాండ్ మేళం సినిమా మార్చి 26న విడుదల కానుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా శ్రీరామనవమికి ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూడాలి.


