
📌 Key Points
- శ్రీదేవి-రోషన్ జంటగా ‘బ్యాండ్ మేళం’లో నటిస్తున్నారు.
- సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
- చంద్రబోస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి గ్లింప్స్ విడుదలైంది.
- నూతన సంవత్సర కానుకగా విడుదలైన రొమాంటిక్ పోస్టర్ వైరల్ అవుతోంది.
నూతన సంవత్సర కానుకగా ‘బ్యాండ్ మేళం’ చిత్రం నుంచి ఓ రొమాంటిక్ పోస్టర్ విడుదలైంది. శ్రీదేవి, రోషన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను కోన వెంకట్ నిర్మిస్తున్నారు. ఈ మ్యూజికల్ ప్రేమకథా చిత్ర పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘బ్యాండ్ మేళం’ చిత్ర విశేషాలు
‘కోర్ట్.. స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ చిత్రంతో మంచి ఫేమ్ తెచ్చుకున్న యంగ్ జంట శ్రీదేవి(Sridevi) – రోషన్(Roshan) కలిసి నటిస్తున్న సినిమా ‘బ్యాండ్ మేళం’(Band Melam). సతీష్ జవ్వాజీ(Sathish Javvaji) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీను ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్(Kona Venkat) నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి చంద్రబోస్(Chandrabose) సంగీతం అందిస్తున్నారు. అయితే రీసెంట్‌గా ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదలకాగా.. ఇది ఎంతగానో ఆకట్టుకుంటుంది.
నూతన సంవత్సర కానుకగా రొమాంటిక్ పోస్టర్
ఈ క్రమంలో నేడు కొత్త సంవత్సర సందర్భంగా ఈ మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ‘బ్యాండ్ మేళం బృందం నుంచి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.. రాబోయే సంవత్సరం ప్రేమ, సంగీతం మరియు హృదయానికి దగ్గరగా ఉండే క్షణాలతో ముందుకు సాగాలి’ అని రాసుకొస్తూ హీరో హీరోయిన్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక పోస్టర్‌లో బ్రిడ్జిపైన హీరో రోషన్ బైక్ నడుపుతుండగా వెనక శ్రీదేవి హీరోయిన్ నవ్వుతూ కూర్చొంది. ఇక బైక్ ట్యాంక్ పైన హార్మోనియం ఉంది. ప్రస్తుతం ఈ రొమాంటిక్ మూవీ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టర్
A post shared by KonaFilmcorporation (@konafilmcorp)
బ్యాండ్ మేళం చిత్రం యొక్క ఈ రొమాంటిక్ పోస్టర్ విడుదలైన వెంటనే అభిమానుల నుండి అద్భుతమైన స్పందన పొందుతోంది. ప్రేమ, సంగీతంతో నిండిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


