|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్యాండ్ మేళం టీజర్: పెళ్లి గోల మొదలు! యూత్ ఫుల్ ఎంటర్టైనర్ విడుదల!

Published: 24-02-2026, 8:35 AM
బ్యాండ్ మేళం టీజర్: పెళ్లి గోల మొదలు! యూత్ ఫుల్ ఎంటర్టైనర్ విడుదల!
  • హర్ష రోషన్, శ్రీదేవి అపల్లా జంటగా నటిస్తున్న చిత్రం బ్యాండ్ మేళం.
  • టీజర్ పూర్తిగా కామెడీతో నిండిన సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది.
  • కోన వెంకట్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
  • మార్చి 13న బ్యాండ్ మేళం థియేటర్లలో విడుదల కానుంది.

హర్ష రోషన్, శ్రీదేవి అపల్లా జంటగా నటిస్తున్న చిత్రం బ్యాండ్ మేళం టీజర్ విడుదలైంది. ఈ టీజర్ మొదటి నుండి చివరి వరకు కామెడీతో నిండిపోయింది. కోన వెంకట్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మార్చి 13న ఈ చిత్రం విడుదల కానుంది.

బ్యాండ్ మేళం టీజర్ విశేషాలు

Band Melam Teaser: కోర్టు సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన హీరో–హీరోయిన్ హర్ష రోషన్ శ్రీదేవి.. ఇప్పుడు మరోసారి కలిసి వస్తున్న సినిమా బ్యాండ్ మేళం. ఈ సినిమా టీజర్‌ ఈరోజు విడుదలై అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ టీజర్ విషయానికి వస్తే.. మొదటి సీన్ నుంచే ఇది పూర్తిగా కామెడీతో నడిచే చిత్రం అని స్పష్టంగా అర్థమవుతుంది. టీజర్ మొదలు నుంచి చివరి వరకు నవ్వులు పూయించే సన్నివేశాలతో నిండిపోయాయి.

టీజర్ ప్రారంభంలోనే హీరోయిన్ “నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న” అని అందాల రాక్షసి సినిమా రిలీజ్ చేస్తూ ఉండగా.. పక్కన నాన్న కూడా ఆ రీల్ కి సహాయపడుతూ ఉంటారు. ఇక ఆమె నాన్న పాత్రలో సాయికుమార్ కనిపించాడు. “ఇక్కడ ఫోన్ సిగ్నల్ లేదు… ప్రకృతి ఇచ్చే సిగ్నల్ ఏంటి?” అనే డైలాగ్.. అలానే అంకుల్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే చెప్పండి POCSO కేసు వేసేస్తాము.. అనే పంచు లైన్ డైలాగ్ టీజర్‌లో హైలైట్‌గా నిలిచాయి.

హర్ష, శ్రీదేవి జంట కెమిస్ట్రీ

ఈ సినిమాలో హీరోగా హర్ష్ రోషన్, హీరోయిన్‌గా శ్రీదేవి అపల్లా నటిస్తున్నారు. కోర్టు సినిమాలో ఈ జంటకు మంచి గుర్తింపు వచ్చింది. అదే కెమిస్ట్రీ ఇప్పుడు ‘బ్యాండ్ మేళం’లో కూడా కొనసాగుతుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. సహాయక పాత్రల్లో కూడా బలమైన కామెడీ ట్రాక్ ఉండబోతుందని ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది. హీరో–హీరోయిన్ బావ–మరదలుగా కనిపించబోతున్నారనే విషయం కూడా టీజర్ ద్వారా క్లారిటీ ఇస్తుంది.

ఈ సినిమాను ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మిస్తున్నారు. ఇక నిన్ననే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ‘తిప్పుకుంటన్నావ్’ అనే ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ పాటను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేయడం విశేషం. ఈ పాటకు విజయ్ బుల్గణిన్ సంగీతం అందించగా, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ సాహిత్యం అందించారు.

కోన వెంకట్ నిర్మాణంలో చిత్రం

ఈ చిత్రానికి సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం, ప్రేమ, భావోద్వేగాలు అన్నింటినీ కలిపి ఒక హృద్యమైన కథగా ‘బ్యాండ్ మేళం’ రూపొందింది. ఈ సినిమా మార్చి 13న థియేటర్లలో విడుదల కానుంది. మొత్తానికి, ఫుల్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించడానికి ‘బ్యాండ్ మేళం’ సిద్ధంగా ఉందని టీజర్ స్పష్టంగా చెబుతోంది.

బ్యాండ్ మేళం టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. కామెడీతో పాటు ప్రేమ, సంగీతం, భావోద్వేగాలు కలగలిసిన ఈ చిత్రం మార్చి 13న విడుదల కానుంది. ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.