|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వాళ్ళను కూడా ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలి.. బండ్ల గణేష్ సంచలన ట్వీట్

Published: 26-06-2025, 10:52 AM
వాళ్ళను కూడా ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలి.. బండ్ల గణేష్ సంచలన ట్వీట్

తెలుగు సినిమా పరిశ్రమలో డ్రగ్స్ వినియోగాన్ని నియంత్రించేందుకు దిల్ రాజు చేసిన ప్రతిపాదనపై బండ్ల గణేష్ తన సంచలన ట్వీట్ ద్వారా స్పందించారు. గ్యాంబ్లింగ్, బెట్టింగ్ కూడా నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు.

Key Points

1

దిల్ రాజు డ్రగ్స్ వినియోగదారులను బ్యాన్ చేయాలని ప్రతిపాదించారు.

2

బండ్ల గణేష్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ చేసే వారిని కూడా బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.

4

తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్, గ్యాంబ్లింగ్ సమస్యలపై చర్చ జరుగుతోంది.

దిల్ రాజు డ్రగ్స్ నిషేధ ప్రతిపాదన

హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహంచిన అంతర్జాతీయ యాంటీ డ్రగ్, ఇల్లీగల్ ట్రాఫికింగ్ డే అవగాహన కార్యక్రమంలో ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు(Dil Raju) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మలయాళ చిత్ర పరిశ్రమలో ఇప్పటికే డ్రగ్స్ తీసుకున్న వారిని బహిష్కరించే (బ్యాన్ చేసే) విధానం అమలులో ఉంది. ఇదే తరహాలో తెలుగులో కూడా అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దీని కోసం తమ తెలుగు ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) ద్వారా విస్తృత చర్చలు జరుపుతామని ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే, డ్రగ్స్ తీసుకునే నటీనటులు, సాంకేతిక నిపుణులు, లేదా చిత్ర పరిశ్రమలో ఎవరైనా సరే, వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని దిల్ రాజు అభిప్రాయపడ్డారు. అయితే.. దిల్ రాజు వ్యాఖ్యలపై తాజాగా మరో టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘డ్రగ్స్ తీసుకునే వారితో పాటు బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఆడే వాళ్ళను కూడా బ్యాన్ చేస్తే బాగుంటుందని నా విన్నపం’ అని షాకింగ్ డిమాండ్ పెట్టారు. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ట్వీట్

బండ్ల గణేష్ సంచలన ట్వీట్

సోషల్ మీడియా స్పందన

బండ్ల గణేష్ వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలోని వివాదాలను మరింత ముదిరిస్తున్నాయి. డ్రగ్స్, గ్యాంబ్లింగ్ నిషేధంపై చర్చ కొనసాగుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.