
కిరణ్ అబ్బవరం నటించిన ‘కె-ర్యాంప్’ విజయం సాధించడంతో, సక్సెస్ మీట్‌లో బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్లాక్ బస్టర్ హిట్ల వెనుక దమ్ము, కష్టం ఉండాలని పేర్కొంటూ, ఓ టాలీవుడ్ హీరోను పరోక్షంగా టార్గెట్ చేశారు. ఇది విజయ్ దేవరకొండ గురించేనని విస్తృతంగా చర్చ జరుగుతోంది.
Key Points
కిరణ్ అబ్బవరం నటించిన ‘కె-ర్యాంప్’ బ్లాక్ బస్టర్ హిట్టు అందుకుంది.
బండ్ల గణేష్ సక్సెస్ మీట్‌లో వారసత్వం, కష్టంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
బ్లాక్ బస్టర్ హిట్లకు దమ్ము, నిజాయితీ, సినిమాపై ప్రేమ అవసరమని వివరించారు.
బండ్ల గణేష్ వ్యాఖ్యలు విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేసినట్లు చర్చలు నడుస్తున్నాయి.
బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కె-ర్యాంప్’(K-Ramp) బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించగా.. ఇందులో పాల్గొన్న బండ్ల గణేష్ (Bandla Ganesh)షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘ఆస్తినీ, అంతస్తునూ వారసత్వంగా ఇవ్వొచ్చు. తెలివినీ, సక్సెస్ ను ఎవ్వడూ వారసత్వంగా ఇవ్వలేడు! వేయి కోట్లు ఇస్తాను ‘గబ్బర్ సింగ్’ ఇవ్వండి నాకు. దమ్ము కావాలి.. దేవుడి దయ కావాలి. మన కష్టం కావాలి..నిజాయితీ కావాలి. సినిమా అంటే ప్రేమ కావాలి! ప్రేమతో, కష్టంతో చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ వస్తది.
అంతేకానీ వాట్స్ అప్ అంటే రాదు హిట్టు’’ అని అన్నారు. అయితే ఈ కామెంట్స్ బండ్ల గణేష్ ఓ టాలీవుడ్ హీరోను ఉద్దేశించి అన్నట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా బండ్ల గణేష్ రౌడీ విజయ్ దేవరకొండ గురించే అన్నారని పలు చర్చలు మొదలయ్యాయి. కాగా కిరణ్ అబ్బవరం, జైన్స్ నాని కాంబోలో వచ్చిన ‘కె-ర్యాంప్’ బాక్సాఫీసు వద్ద మెప్పించింది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని హాస్య మూవీస్, రుదాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై రాజేష్ దండ నిర్మించారు.
‘కె-ర్యాంప్’ బ్లాక్ బస్టర్ విజయం
విజయ్ దేవరకొండను ఉద్దేశించేనా?
బండ్ల గణేష్ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. వారసత్వం, కష్టంపై ఆయన అభిప్రాయాలు సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. మరి ఆ హీరో ఎవరు అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.


