
📌 Key Points
- బండ్ల గణేష్ షాద్ నగర్ నుండి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించనున్నారు.
- చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో ఆయన విడుదల కోసం బండ్ల గణేష్ మొక్కుకున్నారు.
- సుమారు 500 కిలోమీటర్లు బండ్ల గణేష్ పాదయాత్ర చేయనున్నారు.
- చంద్రబాబు నాయుడుపై అభిమానంతో బండ్ల గణేష్ పాదయాత్ర చేస్తున్నారు.
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ జనవరి 19 నుండి షాద్ నగర్ నుండి తిరుమలకు పాదయాత్ర చేయనున్నారు. చంద్రబాబు నాయుడు విడుదలైనందుకు మొక్కు తీర్చుకోనున్నారు. దాదాపు 500 కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగనుంది.
బండ్ల గణేష్ పాదయాత్ర ప్రారంభం
Bandla Ganesh Padayatra: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బండ్ల గణేష్ (Bandla Ganesh)అనంతరం నిర్మాతగా మారి టాలీవుడ్ స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా నిర్మాతగా పలు సినిమాలను నిర్మించిన ఈయన మంచి సక్సెస్ అయినప్పటికీ ఇండస్ట్రీకి కొన్ని కారణాలవల్ల దూరం అయ్యారు. గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న బండ్ల గణేష్ ఇటీవల మరో కొత్త నిర్మాణ సంస్థను ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా రాబోతుందని తెలుస్తుంది.
ఇక బండ్ల గణేష్ సినిమాలలో నటించకపోయిన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.. అలాగే రాజకీయాల గురించి కూడా ఈయన ప్రస్తావిస్తూ నిత్యం సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటారు. తాజాగా బండ్ల గణేష్ కు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బండ్ల గణేష్ జనవరి 19వ తేదీ నుంచి పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఈయన పాదయాత్ర ప్రారంభించారంటే రాజకీయాలలో భాగంగా కాదని తెలుస్తుంది.
చంద్రబాబు నాయుడు కోసం మొక్కు
ఈనెల 19వ తేదీ షాద్ నగర్ నుంచి బండ్ల గణేష్ తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్ర ప్రారంభించడానికి కారణం లేకపోలేదు గతంలో స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్(Chandrababu Naidu Arrest) అయిన సంగతి తెలిసిందే .అయితే ఆయన పై ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా బయటకు వస్తే పాదయాత్ర ద్వారా తిరుమల చేరుకొని స్వామి వారిని దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నట్లు తెలుస్తోంది అయితే ఈ కేసు నుంచి చంద్రబాబు నాయుడు బయటపడటంతో ఈయన తన మొక్కులు చెల్లించుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.
500 కిలోమీటర్లు పాదయాత్ర..
500 కిలోమీటర్ల పాదయాత్ర
ఈనెల 19వ తేదీ షాద్ నగర్ లోని తన ఇంటి నుంచి ఈ పాదయాత్ర మొదలుకానుంది. ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని భారీ ఎత్తున ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. కాలినడకనే స్వామి వారిని బండ్ల గణేష్ దర్శించుకోబోతున్నారు. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. షాద్ నగర్ నుంచి తిరుమల అంటే సుమారు 500 కిలోమీటర్లు పైగా ఉంటుందని, ఇంత దూరం బండ్ల గణేష్ పాదయాత్ర చేస్తున్నారంటే ఆయనకు చంద్రబాబు నాయుడు అంటే ఎంత గౌరవం, అభిమానం ఉందో స్పష్టం అవుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడుపై బండ్ల గణేష్కున్న అభిమానానికి ఈ పాదయాత్ర ఒక నిదర్శనం. తన మొక్కును చెల్లించుకోవడానికి ఆయన ఇంతదూరం కాలినడకన వెళ్లడం గొప్ప విషయం.


