
📌 Key Points
- శివాజీ నటించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమా త్వరలో విడుదల కానుంది.
- ఈ సినిమా మొదట ఓటీటీలో విడుదల కావాల్సి ఉండగా, థియేటర్లలో విడుదల చేస్తున్నారు.
- ప్రీ రిలీజ్ వేడుకలో బండ్ల గణేష్ తన అభిమాన నటుడు పేరు చెప్పి వైరల్ అయ్యారు.
- అలీ అడిగిన ప్రశ్నకు బండ్ల గణేష్ సమాధానం అందరి దృష్టిని ఆకర్షించింది.
శివాజీ నటించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో బండ్ల గణేష్ పాల్గొన్నారు. అలీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన ఎవరి పేరు చెబితే ఉప్పొంగుతారో తెలుసా?
‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ప్రీ రిలీజ్ వేడుక
Bandla Ganesh: శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ (Sampraadayini Suppini Suddhapusani). ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ లాంటి విజయాల తర్వాత ఈటీవీ విన్‌తో కలిసి ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేస్తున్న సినిమా ఇది. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమాను ముందు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని అనుకున్నారు. కానీ, ఈ సినిమా చూసిన వారంతా థియేటర్లలో అయితే బాగుంటుందని చెప్పడంతో మేకర్స్ నిర్ణయం మార్చుకుని, ఇప్పుడు థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఈటీవీ విన్ అసోసియేషన్‌తో శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రిక్కి సమర్పణలో హీరో శివాజీ (Sivaji) స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 6న థియేటర్లలోకి రాబోతోంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకను మంగళవారం గ్రాండ్‌గా నిర్వహించారు.
అలీ అడిగిన ప్రశ్న, బండ్ల గణేష్ సమాధానం
ఈ కార్యక్రమానికి బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే ఈ మధ్య సంకల్ప యాత్ర అంటూ ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) కోసం షాద్ నగర్ నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లి మొక్కు తీర్చుకున్న అనంతరం, ఫస్ట్ టైమ్ బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సరదాగా అలీ అందరినీ కొన్ని ప్రశ్నలు అడిగారు. అందులో భాగంగా బండ్ల గణేష్‌ను కూడా ఆయన ఓ ప్రశ్న అడిగారు. ‘నీకు ఎవరి పేరు రాగానే, నీ బాడీలో ఊపు వస్తుంది?’ అని అలీ (Ali) ఈ కార్యక్రమంలో గణేష్‌ని అడిగారు. దానికి బండ్ల గణేష్ ఇచ్చిన ఆన్సర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. బండ్ల గణేష్ అనగానే గుర్తొచ్చే పేరు ఏమిటో అందరికీ తెలిసిందే. అదే పేరు బండ్ల గణేష్ ఆన్సర్‌గా చెప్పి, మరోసారి తన దేవుడిని గుర్తు చేసుకున్నాడు.
వైరల్ అవుతున్న బండ్ల గణేష్ వ్యాఖ్యలు
చంద్రబాబు గారా? పవన్ కళ్యాణ్ గారా? రేవంత్ రెడ్డి గారా? ఎవరి పేరు రాగానే నీ బాడీలో ఊపొస్తుంది? అని బండ్ల గణేష్‌ని అలీ అడిగారు. అందుకు బండ్ల గణేష్ నవ్వుతూ.. ‘కాదన్నా.. నువ్వు ఈ ప్రశ్న నన్ను అడగకూడదన్నా.. నాకు ఎవరి పేరు చెబితే ఊపు వస్తుందో నీకు తెలుసు కదా అన్నా. నాకు ఈ పేరు ఎవరివల్ల వచ్చింది? బండ్ల గణేష్ అనే పేరు ఎవరివల్ల వచ్చింది’’ అని బండ్ల గణేష్ అనగానే.. ‘చెప్పు పేరు చెప్పు’ అని అలీ మరోసారి అడిగారు. వెంటనే బండ్ల గణేష్ అందుకుని ‘‘ఇంకెవరన్నా.. ది వన్ అండ్ ఓన్లీ, బాస్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan). ఊపు ఎందుకురాదన్నా.. ఎందుకురాదు.. మనం ఈ అనుభవిస్తున్నదంతా ఆయన వల్లే కాబట్టి ఎప్పుడు ఊపొస్తది’’ అని చెబుతుంటే, వెనుక ఆడియెన్స్‌లో సౌండ్ దద్దరిల్లిపోయింది. మరో అలీ కూడా ఒకప్పుడు పవన్ కళ్యాణ్‌కు స్నేహితుడే. చాలా బాగా ఉండేవారు. మధ్యలో పాలిటిక్స్ వారిద్దరినీ దూరం చేశాయనే విషయం తెలియంది కాదు.
మొత్తానికి బండ్ల గణేష్ తన అభిమాన నటుడి పేరు చెప్పి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన అభిమానులు ఈ విషయాన్ని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.


