|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పెయింటర్ నుండి డైరెక్టర్.. ‘పురుష:’తో మగాళ్ల కష్టాలు! బాక్సాఫీస్ షేక్ పక్కా!

Published: 16-05-2026, 5:00 PM
పెయింటర్ నుండి డైరెక్టర్.. 'పురుష:'తో మగాళ్ల కష్టాలు! బాక్సాఫీస్ షేక్ పక్కా!
  • వీరు వులవల పెయింటర్ నుండి డైరెక్టర్ గా మారిన అద్భుత కథ!
  • ‘పురుష:’ మే 22న విడుదల, మగాళ్ల కష్టాలపై కామెడీ ఎంటర్టైనర్.
  • పవన్ కళ్యాణ్, సప్తగిరి నటన సినిమాకు హైలైట్, నవ్వులు గ్యారెంటీ.
  • 350కి పైగా సినిమా టైటిల్స్ డిజైన్ చేసిన అనుభవం వీరుది.

టాలీవుడ్‌లో మరో వినూత్న కథాంశంతో ‘పురుష:’ సినిమా రాబోతోంది! ఒకప్పుడు పెయింట్స్ వేసిన వీరు వులవల, ఇప్పుడు డైరెక్టర్‌గా మారి మగాళ్ల కష్టాలను తెరపై చూపించబోతున్నారు. ఈ మే 22న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పెయింటర్ నుండి డైరెక్టర్ గా అద్భుత ప్రయాణం!

Veeru Vulavala : పవన్ కళ్యాణ్‌, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా పురుష:. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు నిర్మాణంలో వీరు వులవల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. పురుష: సినిమా మే 22న రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా నేడు ఈ సినిమా దర్శకుడు వీరు వులవల మీడియాతో మాట్లాడారు.

డైరెక్టర్ వీరు తన గురించి చెప్తూ.. నాకు పెయింటింగ్స్ వేయడం వచ్చు. హీరోల బొమ్మల్ని క్లాత్ మీద పెయింటింగ్ వేసేవాడ్ని. వాటిని థియేటర్ల ముందు కట్టేవాళ్ళు. అలా క్లాత్ పెయింటింగ్స్ వేస్తూ బ్యాచ్‌లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేశాను. ఏ పని చేసినా ఇండస్ట్రీలోనే ఉండాలని టైటిల్స్ డిజైన్ చేయడం మొదలుపెట్టాను. కొత్త బంగారు లోకం టైటిల్‌ను నేనే డిజైన్ చేశాను. అక్కడ్నుంచి ఆల్మోస్ట్ పెద్ద హీరోల సినిమాలతో కలిసి దాదాపు 350కి పైగా సినిమా టైటిల్స్‌ డిజైన్ చేశాను. ఆ తర్వాత జెర్సీ, మళ్ళిరావా, మసూద సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేస్తూనే స్టోరీ బోర్డ్స్ వేసాను. ఆ సమయంలోనే ఈ కథ రాసుకున్నాను అని తెలిపారు.

మగాళ్ల కష్టాలు.. నవ్వులు పూయించే ‘పురుష:’

ఈ సినిమా నిర్మాత గురించి చెప్తూ.. ఈ కథతో చాలా మంది దగ్గర తిరుగుతుంటే ఇలా తన కొడుకునే హీరోగా పరిచయం చేద్దామనుకుంటున్నారు అని నిర్మాత కోటేశ్వరరావు గారి గురించి చెప్పడంతో ఆయనను కలిసి సింగిల్ సిట్టింగ్ లోనే కథ ఓకే చేసుకున్నా. ఆయన, వాళ్ళ కూతురు సినిమాకు చాలా సపోర్ట్ చేశారు. నా మీద నమ్మకం పెట్టుకున్నారు. సినిమా చూసాక 20 ఏళ్ళ కల అంటూ నిర్మాత నన్ను పట్టుకుని ఏడ్చేశారు అని తెలిపారు.

మే 22న గ్రాండ్ రిలీజ్.. బాక్సాఫీస్ షేక్ పక్కా!

పురుష: సినిమా గురించి చెప్తూ.. పురుషులందు పుణ్య పురుషులు వేరయా అనే పాయింట్‌తో ఈ కథ అనుకున్నాను. భార్యాభర్తల మీదే స్టోరీని రాయాలని అనుకోని మేల్ ఓరియెంటెడ్‌గా కామెడీగా చూపించాలని రాసుకున్నాను. ఇందులో పెళ్లయ్యాక మగవాళ్ల బాధలు కామెడీగా చూపిస్తాము. హీరోగా చేసిన పవన్ కళ్యాణ్ సత్యానంద్ గారి వద్ద శిక్షణ తీసుకున్నారు. రెండు నెలల పాటు వర్క్ షాప్స్ నిర్వహించి షూట్ కి వెళ్ళాము. సప్తగిరి, కసిరెడ్డి పాత్రలు అందరినీ నవ్విస్తాయి. చివర్లో భార్యల గురించి కూడా ఎమోషన్ ఉంటుంది. వెన్నెల కిషోర్ ఎపిసోడ్ కి అందరూ పగలబడి నవ్వేస్తారు. సినిమాలో ఓ సర్ ప్రైజ్ కూడా ఉంది అని తెలిపారు.

‘పురుష:’ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. మగాళ్ల కష్టాలపై ఒక కొత్త కోణాన్ని చూపించనున్న ఈ సినిమా కోసం వేచి చూద్దాం! మరిన్ని అప్‌డేట్‌ల కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.