
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ‘అతి ప్రేమ, అభిమానం ఆరోగ్యానికి హానికరం’ అంటూ ఆయన పేర్కొన్న ఈ ట్వీట్‌కు వివిధ అర్థాలు వెతుకుతున్నారు.
Key Points
బండ్ల గణేష్ ట్వీట్‌లో 'అతి' ప్రమాదకరమని హెచ్చరిక.
ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గణేష్ ట్వీట్ వెనుక ఉన్న రహస్యాన్ని ప్రజలు ఊహిస్తున్నారు.
బండ్ల గణేష్ ట్వీట్ వైరల్
టాలీవుడ్ స్టార్ నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh) అందరికీ సుపరిచితమే. గబ్బర్ సింగ్(Gabbar Singh), గోవిందుడు అందరి వాడేలే(Govindudu Andarivadele) వంటి హిట్ చిత్రాలను నిర్మించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. అయితే ఆయన పవన్ కళ్యాణ్ అభిమానిగా ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అయితే గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. రాజకీయాలపై ఫోకస్ పెట్టిన ఆయన సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. నిత్యం పలు ట్వీట్లు చేస్తూ నెటిజన్లను ఆలోచింప చేస్తున్నారు. ఆయన వేసిన ట్వీట్‌ను గమనించే నెటిజన్లు మాత్రం ఏదో జరిగే ఉంటుందని ఫిక్స్ అయిపోతారు. కానీ బండ్లన్న మాత్రం ఎప్పుడూ అసలు విషయాన్ని బయటపెట్టకుండా జాగ్రత్త పడతారు. తనకు నచ్చినట్టుగా కొటేషన్లు పెడుతుంటారు.
తాజాగా, బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా ఓ షాకింగ్ ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ‘‘అతి ప్రేమ అతి అభిమానం అతి విశ్వాసం అతి నమ్మకం ఆరోగ్యానికి హానికరం’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారింది. అసలు బండ్ల గణేష్ ఇలాంటి పోస్ట్ పెట్టడానికి గల కారణాలేంటో తెలియనప్పటికీ జనాలు మాత్రం రకరకాలుగా అనుకుంటున్నారు. ఆయన చేసి మంచి, నమ్మకం అంతలా ఎవరిపై పెట్టుకున్నారు.. రాజకీయాల వల్ల పవన్ కళ్యాణ్(Pawan Kalyan) దగ్గర ఏమైనా చెడ్డ పేరు వచ్చిందా?అని చర్చించుకుంటున్నారు. ఆయన చెప్పింది ఎవరి గురించో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.
అతి అభిమానం ప్రమాదకరం?
పవన్ కళ్యాణ్‌తో సంబంధం?
బండ్ల గణేష్ ట్వీట్ వెనుక ఉన్న నిజం ఇంకా తెలియరాలేదు. అయితే, సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు ఆయన ట్వీట్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయో తెలియజేస్తున్నాయి.


