|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

స్టార్‌ హీరోపై బండ్ల గణేష్‌ పంచ్‌లు

Published: 03-11-2025, 11:32 PM
స్టార్‌ హీరోపై బండ్ల గణేష్‌ పంచ్‌లు

టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం ‘K ర్యాంప్’ విజయోత్సవ సభలో నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కిరణ్‌ను చిరంజీవితో పోలుస్తూ, పరోక్షంగా విజయ్ దేవరకొండపై పంచ్‌లు విసిరారు. ఈ సంఘటన సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Key Points

1

'K ర్యాంప్' సక్సెస్ మీట్‌లో బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.

2

కిరణ్ అబ్బవరాన్ని మెగాస్టార్ చిరంజీవితో పోల్చారు బండ్ల గణేష్.

4

కొత్త దర్శకులను ప్రోత్సహించిన కిరణ్ అబ్బవరాన్ని అభినందించిన గణేష్.

K ర్యాంప్ సక్సెస్ మీట్ లో బండ్ల గణేష్

టాలీవుడ్ ‌ నటుడు కిరణ్ అబ్బవరం నటించిన ‘ K ర్యాంప్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది . క సినిమా తర్వాత కిరణ్ ‌ మరో హిట్ ‌ అందుకున్నాడు . దీంతో కె ర్యాంప్ ‌ సక్సెస్ ‌ మీట్ ‌ ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రంలో నిర్మాత బండ్ల గణేష్ ‌ తో పాటు సినీ , రాజకీయ నాయకులు అతిథిలుగా వచ్చారు . ఈ క్రమంలో స్టేజీపై బండ్ల గణేష్ ‌ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ ‌ అవుతున్నాయి . కిరణ్ అబ్బవరాన్ని ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో పోల్చడమే కాకుండా . . విజయ్ దేవరకొండపై పరోక్షంగా పంచ్ ‌ లు వేశారని తెలుస్తోంది .

బండ్ల గణేష్ కామెంట్లు ఎవరిపై .. ‘K ర్యాంప్’ సినిమా సక్సెస్ ‌ ఈవెంట్ ‌ లో బండ్ల గణేష్ ‌ చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి . ‘ ఈ రోజుల్లో ఒక్క సినిమా హిట్ కాగానే లూజు పేంట్లు, కొత్త కొత్త చెప్పులు, కళ్లకు అద్దాలు పెట్టుకుని ఆపై కాలు మీద కాలు వేసుకుని వాట్సప్. . వాట్సప్ అంటూ తన తర్వాతి సినిమా కోసం లోకేష్ కనగరాజ్ ‌ ను తీసుకురా… రాజమౌళిని తీసుకురా… సుకుమార్ ‌ ను తీసుకురా… అనీల్ రావిపూడిని తీసుకురా అంటున్న ఈ రోజుల్లో ఆరుగురు కొత్త దర్శకులను కిరణ్ ‌ పరిచయం చేశాడు. ‘ అని బండ్ల అన్నారు . ఇప్పటివరకు కిరణ్ చేసిన ప్రతి సినిమా కూడా కొత్త డైరెక్టర్ ‌ తోనే చేశాడని గుర్తుచేశాడు .

చిరంజీవితో కిరణ్ అబ్బవరం పోలిక

చిరంజీవిని ఆదర్శంగా తీసుకో కిరణ్ ‌ అబ్బవరంను మెగాస్టార్‌ చిరంజీవితో బండ్ల గణేష్ ‌ పోల్చారు . తనపై ప్రశంసల వర్షం కురిపించారు . కిరణ్ ఒక రియల్ కుర్రోడు. బాంచెన్ హీరో అంటే ఇలాగే ఉండాలి . ప్రస్తుతం కిరణ్ ‌ ని చూస్తుంటే నాకు చిరంజీవినే గుర్తొస్తున్నారు. కెరీర్ ‌ ప్రారంభంలో చిరంజీవి కూడా ఇలాగే ఉండేవారు. ఆయన ఇప్పటికే 150 సినిమాలు పూర్తి చేసి .. త్వరలో భారతరత్న అందుకోబోతున్నారు . అయినప్పటికీ చిరంజీవి లాంటి వ్యక్తి కూడా గ్రౌండ్ మీద ఉంటాడు. నువ్వు ( కిరణ్ ‌) చిరంజీవిని ఇన్స్పిరేషన్ ‌ గా తీసుకుని ముందుకు వెళ్లు . . నిన్ను చూస్తేంటే చాలా ముచ్చటేస్తుంది. అంటూ పొగడ్తలతో ముచ్చేత్తారు .

రౌడీ బాయ్స్ ‌ ను టార్గెట్ ‌ చేసిన బండ్ల సినిమా పరిశ్రమలో విజయ్ ‌ దేవరకొండ మాత్రమే ఎక్కువగా ‘ వాట్సాప్ వాట్సాప్ మై రౌడీ బాయ్స్’ అంటూ తన ఫ్యాన్స్ ‌ ను పలకరిస్తుంటాడు . ఇప్పుడు బండ్ల గణేష్ కూడా ఇదే ఆటిట్యూడ్ ‌ తో విజయ్ ‌ పేరు ఎత్తకుండా పరోక్షంగా పంచ్ ‌ లు వేశారని సోషల్ ‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది . ఒక హీరోను పొగిడేందుకు మరో నటుడిని కించపరచేలా ఈ వ్యాఖ్యలు ఏంటి అంటూ నెటిజన్లు తప్పుబడుతున్నారు .

రౌడీ బాయ్స్ పై పరోక్ష పంచ్‌లు

ఆ మధ్య లిటిల్ హార్ట్స్ ఈవెంట్ ‌ లో మాట్లాడుతూ ఇండస్ట్రీలో పెద్దలు సెలబ్రిటీలు చేసే పొగడ్తలు నమ్మవద్దు, అన్నీ అబద్దాలే అంటూ నటుడు మౌళికి హితబోధ చేసి ఇప్పుడు ఈ భజన అవసరమా అంటూ బండ్లపై విమర్శలు గుప్పిస్తున్నారు . అయితే , గణేష్ అన్నది నిజంగా విజయ్ ‌ దేవరకొండనేనా కాదా అనేది పక్కన పెడితే కిరణ్‌ని పొగిడే క్రమంలో మరొకరి ప్రస్తావన ఎందుకనే ప్రశ్న ఇక్కడ ప్రధాన అంశంగా మారింది.

బండ్ల గణేష్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒకవైపు కిరణ్ అబ్బవరాన్ని పొగుడుతూ, మరోవైపు ఇతర స్టార్ హీరోను టార్గెట్ చేయడం సినీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలకు దారితీసింది. ఇది సినిమా ప్రమోషన్‌కు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.