|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పేరు పెట్టకుండా బండ్ల గణేశ్‌ ట్వీట్‌.. ఆయన మీదేనా?

Published: 16-10-2025, 8:57 AM
పేరు పెట్టకుండా బండ్ల గణేశ్‌ ట్వీట్‌.. ఆయన మీదేనా?

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన ఓ రహస్య ట్వీట్ టాలీవుడ్‌లో కలకలం రేపింది. బన్నీ వాసు ఇటీవల తమ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఈ పోస్ట్ పెట్టారా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ ట్వీట్ సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

Key Points

1

బండ్ల గణేష్ ఎక్స్ లో పెట్టిన ఒక పోస్టు టాలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారితీసింది.

2

పేరు ప్రస్తావించకుండా ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించాయో నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

4

బండ్ల గణేష్ ట్వీట్ బన్నీ వాసుకి కౌంటర్‌గానే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

బండ్ల గణేష్ వైరల్ ట్వీట్

టాలీవుడ్ ‌ నటుడు , నిర్మాత బండ్ల గణేశ్(Bandla Ganesh) ‌ కు సోషల్ ‌ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ ‌ గురించి తెలిసిందే . ఆయన ఏ ట్వీట్ ‌ చేసినా .. క్షణాల్లో వైరల్ ‌ అవుతుంటాయి . సినిమా విషయాలతో పాటు రాజకీయ అంశాలపైన తనదైన శైలీలో స్పందిస్తుంటారు . కొన్ని విషయాలపై డైరెక్ట్ ‌ గా , మరికొన్ని విషయాలపై పరోక్షంగా ఆయన కామెంట్స్ ‌ చేస్తుంటారు . తాజాగా ఆయన ఎక్స్ ‌ లో పెట్టిన ఒక పోస్టు ఇప్పుడు టాలీవుడ్ ‌ లో తీవ్ర చర్చకు దారితీసింది . గురువారం మధ్యాహ్నం ఆయన తన ఎక్స్ ‌ ఖాతాలో “ అది పీకుతా ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు… మాటలు మన చేతిలో ఉన్నా, ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు……! అంటూ రాసుకొచ్చాడు . పేరునూ ప్రస్తావించకుండా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి ఉంటాయా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

బన్నీ వాసు వ్యాఖ్యలకు కౌంటర్‌గానా?

ఆ నిర్మాతకు కౌంటర్‌గానేనా? ఇటీవల టాలీవుడ్ ‌ లో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి . సినిమా రిలీజ్ ‌ ముందు కొంతమంది దర్శకనిర్మాతలు , హీరోలు ఇచ్చే స్టేట్ ‌ మెంట్స్ ‌ చర్చకు దారి తీస్తున్నాయి . తాజాగా మిత్రమండలి సినిమా ప్రీరిలీజ్ ‌ ఈవెంట్ ‌ లో నిర్మాత బన్నివాసు(Bunny Vasu) చాలా ఎమోషనల్ ‌ గా మాట్లాడారు . తమ సినిమాను కొందరు ఉద్దేశ్యపూర్వకంగా తొక్కేయాలని చూస్తున్నారని.. కానీ జనాలు సినిమా బాగుంటేనే చూస్తారని, లేకపోతే చూడరని… డబ్బు పెట్టి ఓ సినిమాను ట్రోల్ చేస్తే అది నడవదని అన్నారు. అంతటితో ఆగకుండా .. తొక్కితే బన్నీ వాసు పడిపోతాడని అనుకోవద్దని.. నా వెంట్రుక కూడా పీకలేరంటూ ఆయన కాస్త ఘాటుగానే స్పందించారు . ఈ రోజు సినిమా రిలీజై మిక్స్ ‌ డ్ ‌ టాక్ ‌ ని సంపాదించుకుంది .

సోషల్ మీడియాలో చర్చ, ట్రోలింగ్

ఇదే రోజు బండ్ల గణేశ్ ‌ పైవిధంగా ట్వీట్ ‌ చేయడంతో .. బన్నీవాసుకి కౌంటర్ ‌ గానే ఇలా పోస్ట్ ‌ పెట్టాడని నెటిజన్స్ ‌ అభిప్రాయపడుతున్నారు . ఆయన పోస్ట్ ‌ కింద చాలామంది ఇది బన్నీవాసు గురించే అని కామెంట్స్ ‌ చేస్తున్నారు . బండ్ల గణేశ్‌ వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని, ఎవరిని లక్ష్యంగా చేసుకుని ఈ మాటలు అన్నారని తెలియదు కానీ .. బన్నీవాసు పేరు అయితే బాగా ట్రోల్ ‌ అవుతుంది .

బండ్ల గణేష్ ట్వీట్ ఉద్దేశం స్పష్టంగా తెలియకపోయినా, అది బన్నీ వాసుని లక్ష్యంగా చేసుకున్నదేనని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ అంశం సోషల్ మీడియాలో మరింత చర్చకు, ట్రోలింగ్‌కు దారితీసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.