
వాణిజ్య ప్రకటనలతో ప్రారంభించి, ప్రస్తుతం హీరోయిన్‌గా రాణిస్తున్న బనితా సంధు, తన బాలీవుడ్ అనుభవాలను, బాడీ షేమింగ్, బ్లాక్‌లిస్ట్ వంటి విషయాలను వెల్లడించింది.
Key Points
బనితా సంధు బాలీవుడ్ ఇండస్ట్రీలోని కష్టాలను వెల్లడించారు.
కెరీర్ ప్రారంభంలో 16-18 గంటల పని, నిద్రలేమి ఎదుర్కొన్నారు.
బాడీ షేమింగ్‌ను అనుభవించి, ఆమెను విమర్శించినవారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాలీవుడ్‌లో బ్లాక్‌లిస్ట్ చేయబడినట్లు బనితా తెలిపారు.
బాలీవుడ్‌లో బనితా సంధు అనుభవాలు
వాణిజ్య ప్రకటనలతో ప్రయాణం మొదలుపెట్టిన బనితా సంధు ( Banita Sandhu ) ప్రస్తుతం హీరోయిన్‌గా రాణిస్తోంది. తమిళంలో ఆదిత్య వర్మ (అర్జున్ రెడ్డి రీమేక్).. హిందీలో అక్టోబర్, సర్దార్ ఉద్ధమ్, మదర్ థెరిస్సా అండ్ మి చిత్రాలు చేసింది. హాలీవుడ్‌లో సినిమాతో పాటు వెబ్ సిరీస్‌లలోనూ యాక్ట్ చేసింది. ప్రస్తుతం అడివి శేష్ గూఢచారి 2 చిత్రం చేస్తోంది. అలాగే ఆమె నటించిన డిటెక్టివ్ షెర్డిల్ మూవీ జీ5లో శుక్రవారం (జూన్ 20) రిలీజ్ కానుంది.
నిద్ర లేకుండా షూటింగ్ ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో బనితా సంధు మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే అంతా మెరుగవుతోంది. కెరీర్ తొలినాళ్లలో ఇండస్ట్రీ ఎలా ఉంటుందో నాకు తెలీదు. నేను ఊహించినదానికన్నా భిన్నంగా ఉండేది. 16-18 గంటలు పని చేసేదాన్ని. రోజంతా షూటింగ్ చేయించుకుని రాత్రికి పంపించేవాళ్లు. సరైన నిద్ర ఉండేది కాదు. ఒక్కోసారి 24 గంటలు మేల్కొనే ఉండాల్సి వచ్చేది. అప్పుడు నేను.. నాకోసం, మిగతా సిబ్బంది కోసం నిలబడ్డాను.
కష్టతరమైన పని వేళలు మరియు నిద్రలేమి
బ్లాక్‌లిస్ట్.. లెక్కచేయను ఇది మంచి పద్ధతి కాదని నిర్మాతలను వారించాను. బహుశా అందుకేనేమో నన్ను ఆ ఇండస్ట్రీలో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారు. అయినా నేను అస్సలు పట్టించుకోను. నాకు ఏదనిపిస్తే అదే చేస్తాను. దక్షిణాది సినిమా (ఆదిత్య వర్మ) చేసినప్పుడు నన్ను బాడీ షేమింగ్ చేశారు. పీలగా, చెండాలంగా ఉన్నానని కామెంట్లు చేశారు. సినిమాలో ఇలాంటిదానికి హీరో ఎలా పడిపోయాడని వెకిలిగా మాట్లాడారు. బాడీ షేమింగ్ అనుభవించడం అదే మొదటిసారి అని బనితా చెప్పుకొచ్చింది.
బాడీ షేమింగ్ మరియు బ్లాక్‌లిస్ట్
బనితా సంధు తన అనుభవాలను తెలియజేస్తూ, ఇండస్ట్రీలోని సవాళ్లను ఎదుర్కొన్న తన ధైర్యాన్ని చాటుకుంది. ఆమె కెరీర్‌లోని ఎదుగుదలకు శుభాకాంక్షలు.


