|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Barbarik: చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఆడియెన్స్ కి ఇచ్చిన మాట కోసం సాహసం

Published: 31-08-2025, 1:15 PM
Barbarik: చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఆడియెన్స్ కి ఇచ్చిన మాట కోసం సాహసం

తాజాగా విడుదలైన బార్బరిక్ సినిమాకు విమర్శకుల నుంచి మంచి స్పందన వచ్చినప్పటికీ, ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడంతో దర్శకుడు మోహన్ శ్రీవత్స తీవ్రంగా కలత చెందారు. తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఆయన కన్నీరు పెట్టుకున్నారు.

Key Points

1

బార్బరిక్ సినిమాకు విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది.

2

కానీ, ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని దర్శకుడు ఆవేదన వ్యక్తం చేశారు.

4

తెలుగు ప్రేక్షకుల వైఖరిపై దర్శకుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

బార్బరిక్ సినిమాకు ప్రేక్షకుల స్పందన

ఇటీవల కాలంలో పెద్ద సినిమాలు మాత్రమే ఆడుతున్నాయి. అందులోనూ కంటెంట్‌ ఉన్న చిత్రాలనే చూస్తున్నారు ఆడియెన్స్. కంటెంట్‌ బాగా లేకపోతే ఎంత పెద్ద హీరో సినిమా అయిన చూడటం లేదు. ఇటీవల కాలంలో ఎన్టీఆర్‌ `వార్‌ 2`, రజనీకాంత్‌, నాగార్జున నటించిన `కూలీ` చిత్రాలు కూడా ఆడియెన్స్ ని డిజప్పాయింట్‌ చేశాయి. కానీ కంటెంట్ బాగున్న యానిమేషన్‌ మూవీ `మహవతార్‌ నరసింహ` కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో తాజాగా `త్రిబాణధారి బార్బరిక్‌` మూవీ దర్శకుడు ఆవేదన వ్యక్తం చేశారు. తన సినిమాని ఆడియెన్స్ చూడటం లేదని కన్నీరు పెట్టుకున్నారు. దర్శకుడు మోహన్‌ శ్రీవత్స దర్శకత్వం వహించిన `త్రిబాణధారి బార్బరిక్‌` మూవీ ఈ శుక్రవారం విడుదలైంది. ఇందులో సత్యరాజ్‌, ఉదయభాను, వశిష్ట సింహ, క్రాంతి కిరణ్‌, బాల నటి మేఘన ప్రధాన పాత్రలు పోషించారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి క్రిటిక్స్ నుంచి మంచి స్పందన వచ్చింది.

కానీ ఆడియెన్స్ నుంచి పెద్దగా స్పందన లేదు. జనాలు సినిమాని థియేటర్లో చూడటం లేదు. దీంతో ఇది చూసి దర్శకుడు మోహన్‌ శ్రీవత్స ఆవేదన వ్యక్తం చేశారు. తాను థియేటర్‌కి వెళితే కేవలం పది మంది మాత్రమే ఆడియెన్స్ ఉన్నారని, వాళ్లు సినిమా చాలా బాగుందని చెప్పి హగ్‌ చేసుకున్నారట. వాళ్లకి తాను ఎవరో తెలియదు. కానీ సినిమా బాగుందని చెప్పారట. అంటే చూసిన వారికి సినిమా నచ్చుతుంది. కానీ ఆడియెన్స్ థియేటర్‌కి ఎందుకు రావడం లేదనేది అర్థం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దర్శకుని ఆవేదన, కన్నీళ్లు

సినిమా కోసం తాను రెండున్నరేళ్లు పిచ్చికుక్కలా కష్టపడ్డానని తలిపారు. నా భార్య నేను మనస్తాపానికి గురై ఉన్నానని చెప్పి, సినిమాకెళ్లిన ఆమె మధ్యలోనే ఇంటికి వచ్చేసింది. మలయాళ సినిమాలు అయితే చూస్తారని చేశాను. కానీ కాన్ఫిడెంట్‌తో ఒక మాట అన్నాను. సినిమా నచ్చకపోతే నా చెప్పుతో నేను కొట్టుకుంటానని, అయినా ఎవరూ సినిమాకి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను కూడా మలయాళ ఇండస్ట్రీకి వెళ్లిపోతానని, పరభాష కంటెంట్ అయితే తప్ప తెలుగు ఆడియెన్స్ సినిమా చూడటం లేదు, నేను అక్కడ సినిమా తీసి తెలుగోడు సినిమా చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తానని తెలిపారు.

చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు

సినిమా చూసి బాగా లేదంటే ఓకే, కానీ అసలు సినిమా చూడకుండా బాలేదంటే ఏం చేయాలి. అందుకే నా సవాల్‌ సమాధానంగా నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నా అని చెప్పుతో కొట్టుకున్నాడు దర్శకుడు మోహన్‌ శ్రీవత్స. దీనికి సంబంధించిన వీడియో విడుదల చేయగా, ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ అయ్యో పాపం అంటున్నారు. ప్రమోషన్స్ వీక్‌గా ఉందని అంటున్నారు. సినిమాని ఆడియెన్స్ వద్దకు తీసుకెళ్లాల్సిందని అని కామెంట్‌ చేస్తున్నారు. మరికొందరు కంటెంట్‌ బాగుంటే చూస్తారని చెబుతున్నారు. మొత్తంగా `త్రిబాణధారి బార్బరిక్` మూవీ దర్శకుడి ఆవేదన అందరికి కలిచి వేస్తుంది.

బార్బరిక్ సినిమా విఫలం కావడంపై దర్శకుడు మోహన్ శ్రీవత్స తీవ్రంగా దిగులు చెందారు. తెలుగు సినీ ప్రేక్షకుల వైఖరిని ప్రశ్నిస్తూ ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.