
📌 Key Points
- రాధికాపూర్ – బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (16224) జూన్ 21, 2026న దారి మళ్లింపు.
- అరక్కోణం స్టేషన్‌లో భద్రతా పనుల కారణంగా ఈ మార్పు.
- నాయుడుపేట, సూళ్లూరుపేట సహా నాలుగు స్టేషన్లలో రైలు ఆగదు.
- ప్రత్యామ్నాయంగా తిరుత్తణి (TRT)లో అదనపు స్టాపింగ్ సౌకర్యం.
రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్‌డేట్ ఇచ్చింది. జూన్ 21న బెంగళూరు వెళ్లే రాధికాపూర్ ఎక్స్‌ప్రెస్ దారి మళ్లించబడుతుంది. ఏపీలోని ముఖ్యమైన స్టేషన్లలో ఆగకుండా, ప్రత్యామ్నాయంగా తిరుత్తణిలో స్టాప్ ఇవ్వబడింది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలి.
బెంగళూరు ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు ఎందుకు?
SCR Radhikapur Bengaluru ExpressTrain Diversion :రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్‌డేట్ ఇచ్చింది. సదరన్ రైల్వే పరిధిలోని మద్రాస్ డివిజన్, అరక్కోణం (AJJ) రైల్వే స్టేషన్‌లో భద్రతా కారణాల దృష్ట్యా నాన్-ఇంటర్‌లాకింగ్ (NI) ప్రోగ్రామ్ పనులు చేపట్టారు. ఈ సాంకేతిక పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే ఒక ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును దారి మళ్లిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
రైల్వే శాఖ విడుదల చేసిన ప్రకటనలోని సమాచారం ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని రాధికాపూర్ నుంచి బెంగళూరు వెళ్లే రాధికాపూర్ – SMVT బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ – 16224) జూన్ 21, 2026 నాటి సర్వీసును దారి మళ్లిస్తారు. ఫలితంగా నిర్దేశిత సాధారణ మార్గానికి బదులుగా దారి మళ్లించిన రూట్‌లో రాకపోకలుంటాయి.
ఏపీలో ఆగని స్టేషన్లు, ప్రత్యామ్నాయ మార్గం
ఈ తాత్కాలిక మార్పుతో ఆ రైలు తన రెగ్యులర్ రూట్‌లో ఉండే నాలుగు ముఖ్యమైన స్టేషన్లలో ఆగదు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల ప్రయాణికులు ఎక్కువగా ఉపయోగించే నాయుడుపేట, సూళ్లూరుపేట, పెరంబూర్ , అరక్కోణం (AJJ) రైల్వే స్టేషన్లలో ఈ రైలు స్టాపింగ్‌లను అధికారులు పూర్తిగా రద్దు చేశారు. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు గూడూరు నుంచి రేణిగుంట… తిరుత్తణి మీదుగా మేల్పక్కం వైపునకు వెళ్తుంది.
ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా అధికారులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. పైన పేర్కొన్న నాలుగు స్టేషన్ల హాల్ట్‌లు రద్దు చేసినప్పటికీ….. దానికి బదులుగా తిరుత్తణి (TRT) రైల్వే స్టేషన్‌లో ఈ రైలుకు అదనపు స్టాపింగ్ సౌకర్యాన్ని కల్పించారు. జూన్ 21న ప్రయాణించే వారు తిరుత్తణి స్టేషన్ ద్వారా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు.
ప్రయాణికులకు కొత్త స్టాప్: తిరుత్తణి
జూన్ 21వ తేదీన ఈ మార్గంలో ప్రయాణించాలనుకునే ప్రయాణికులు మారిన రూట్, కొత్త స్టాపింగ్ వివరాలను గమనించి, అందుకు అనుగుణంగా తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
ఈ తాత్కాలిక మార్పు ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగించినా, భద్రతా పనుల కోసం తప్పనిసరి. ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను ముందుగానే సరిచూసుకొని, కొత్త స్టాపింగ్ పాయింట్‌ను ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు కోరారు.


