|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Benz Movie: LCU కొత్త విలన్ వచ్చేశాడు.. మొత్తం బంగారమే

Published: 04-06-2025, 2:06 PM
Benz Movie: LCU కొత్త విలన్ వచ్చేశాడు.. మొత్తం బంగారమే

లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో కొత్త విలన్ ఎంట్రీ! లారెన్స్ హీరోగా నటిస్తున్న ‘బెంజ్’ సినిమాలో మలయాళ నటుడు నివిన్ పౌలీ విలన్‌గా నటిస్తున్నాడు. అతని పాత్ర ప్రోమో ఇప్పటికే విడుదలైంది.

Key Points

1

లారెన్స్ హీరోగా నటిస్తున్న 'బెంజ్' సినిమాలో నివిన్ పౌలీ విలన్ పాత్ర పోషిస్తున్నాడు.

2

నివిన్ పౌలీ 'వాల్టర్' అనే పాత్రలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

4

బంగారంతో అలంకరించబడిన నివిన్ పౌలీ పాత్ర రోలెక్స్ పాత్రను గుర్తుకు తెస్తుంది.

నివిన్ పౌలీ ‘బెంజ్’లో విలన్‌గా

ప్రస్తుత తరంలో సినిమాటిక్ యూనివర్స్ అనగానే ముందుగా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ గుర్తొస్తాడు. ఖైదీ, విక్రమ్ సినిమాలతో ఈ తరహా యూనివర్స్ సృష్టించాడు. ఇందులో భాగంగా త్వరలో ఖైదీ 2, రోలెక్స్, విక్రమ్ 2 సినిమాలు రాబోతున్నాయని స్వయంగా లోకేశ్.. పలు ఇంటర్వ్యూల్లో చెబుతూనే ఉన్నాడు.  ఇప్పుడు లోకేష్ యూనివర్స్‌లోకి కొత్త విలన్ వచ్చిచేరాడు.

లోకేశ్ దర్శకుడిగా ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు పలు చిత్రాలకు కథలు అందిస్తూ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. అలాంటి ఓ మూవీనే ‘బెంజ్’. లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ వయలెంట్ యాక్షన్ మూవీలో ఇప్పుడు మలయాళ నటుడు నివిన్ పౌలీ విలన్‌గా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అతడి పాత్ర ప్రోమో వీడియోని రిలీజ్ చేశారు.

లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌తో సంబంధం

‘విక్రమ్’ మూవీ చివర్లో వచ్చే రోలెక్స్ పాత్రని స్ఫూర్తిగా తీసుకున్నారో ఏమో గానీ.. ‘బెంజ్’ విలన్  చూస్తుంటే సూర్యనే గుర్తొచ్చాడు. ఒళ్లంతా బంగారు చైన్స్, వాచ్, చివరకు బంగారు పళ్లతో నివిన్ పౌలీ కనిపించిన విధానం.. చివర్లో తన పేరు వాల్టర్ అని చెప్పడం ఇదంతా కూడా రోలెక్స్ పాత్రనే ఫాలో అయిపోయినట్లు అనిపించింది. ఇందులో వాల్టర్ అనే విలన్‌గా నివిన్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ వీడియోలోనే.. ఈ సినిమా లోకేశ్ యూనివర్స్‌లో భాగమని క్లారిటీ ఇచ్చారు. మరి ఏ సినిమాలో ఈ పాత్రని లింక్ చేస్తారో చూడాలి?

రోలెక్స్ పాత్రకు సమానమైన లుక్

బెంజ్ సినిమాకు భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు కాగా.. యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతమందిస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన వీడియోకు కూడా డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చి ఆకట్టుకున్నాడు. విలన్‌గా చేస్తున్న నివిన్ పౌలీ విషయానికొస్తే.. మలయాళంలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సాయిపల్లవికి ఎంతో పేరు తెచ్చిన ‘ప్రేమమ్’లో హీరో ఇతడే. మరి ఇప్పుడు విలన్‌గా ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి?

నివిన్ పౌలీ విలన్ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఈ సినిమా ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.