|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రూ.45వేల లోపు దుమ్మురేపే 6 ఫోన్లు! ఏప్రిల్ బెస్ట్ పిక్స్ మీకోసం! ఫీచర్స్ చూస్తే షాక్!

Published: 17-04-2026, 9:35 AM
రూ.45వేల లోపు దుమ్మురేపే 6 ఫోన్లు! ఏప్రిల్ బెస్ట్ పిక్స్ మీకోసం! ఫీచర్స్ చూస్తే షాక్!
  • మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో 5జీ: 50MP కెమెరా, డైమెన్సిటీ 8350 ప్రాసెసర్, 6000mAh బ్యాటరీతో వస్తుంది.
  • పోకో X8 ప్రో మాక్స్: డైమెన్సిటీ 9500s ప్రాసెసర్, 8500mAh బ్యాటరీ, 100W ఛార్జర్ కలిగి ఉంది.
  • ఐక్యూ 15R: స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్, 7600mAh బ్యాటరీతో అద్భుతమైన గేమింగ్ అనుభవం.
  • వన్‌ప్లస్ 13R: స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్, 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది.

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? రూ. 45 వేల లోపు బడ్జెట్‌లో లభించే బెస్ట్ ఫోన్ల కోసం చూస్తున్నారా? అయితే, ఈ ఏప్రిల్‌లో అందుబాటులో ఉన్న 6 బెస్ట్ ఫోన్ల జాబితా మీకోసం.

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో 5జీ: ఫీచర్లు, ధర

Best Affordable Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? మీరు మంచి కెమెరాలతో పాటు అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ అందించే ఫోన్ల కోసం చూస్తున్నారా? మీ బడ్జెట్ ధరలో లభించే అనేక స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

అదిరే బ్యాటరీలతో పాటు అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తాయి. ఈ ఏప్రిల్ నెలలో రూ. 45వేల లోపు ధరలో లభించే 6 బెస్ట్ సరసమైన ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో 5జీ (రూ. 30,098) : మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో 5జీలో 50MP + 10MP + 50MP రియర్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. మీడియాటెక్ డైమన్షిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్‌తో రన్ అయ్యే ఈ యూనిట్‌లో 1B కలర్లు, 120Hz రిఫ్రెష్ రేట్ 6000mAh బ్యాటరీ సపోర్ట్‌తో 6.7-అంగుళాల P-OLED డిస్‌ప్లే ఉంది.

పోకో X8 ప్రో మాక్స్: కెమెరా, బ్యాటరీ వివరాలు

పోకో X8 ప్రో మాక్స్ (రూ. 42,999) : పోకో X8 ప్రో మ్యాక్స్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500s ప్రాసెసర్‌తో రన్ అవుతోంది. హైపర్‌ఓఎస్ 3పై రన్ అవుతుంది. కెమెరాల విషయానికొస్తే.. 50MP + 8MP రియర్ కెమెరా, 20MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇందులో 68 బిలియన్ కలర్లు, 120Hz రిఫ్రెష్ రేట్ 3500-నిట్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.83-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. చివరగా, 8500mAh బ్యాటరీ, 100W ఛార్జర్ ఉన్నాయి.

Read Also : Apple Intelligence : ఐఫోన్ లవర్స్ కోసం అద్భుతమైన ఫీచర్.. ఈ కొత్త AI ఫీచర్.. ఫుడ్ నుంచి టికెట్ల వరకు అన్నీ స్కాన్ చేస్తుంది..!

ఐక్యూ 15R (రూ. 44,999) : ఐక్యూ 15Rలో ఒక బిలియన్ కలర్ ఆప్షన్లు, 144Hz రిఫ్రెష్ రేట్ 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.59 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో ఈ యూనిట్, ఆరిజిన్ఓఎస్ 6పై రన్ అవుతుంది. 7600mAh బ్యాటరీ సపోర్ట్‌తో వస్తుంది. ఇందులో 50MP + 8MP రియర్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

ఐక్యూ 15R, వన్‌ప్లస్ 13R: పర్ఫార్మెన్స్ మరియు డిస్‌ప్లే

వన్‌ప్లస్ 13R (రూ. 41,998) : వన్‌ప్లస్ 13R స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో పాటు ఆక్సిజన్‌ఓఎస్ 15తో రన్ అవుతుంది. 50MP + 50MP + 8MP రియర్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. అంతేకాదు.. ఇందులో ఒక బిలియన్ కలర్ ఆప్షన్లు, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ 6000mAh బ్యాటరీతో 6.78-అంగుళాల ఎల్టీపీఓ 4.1 అమోల్డ్ డిస్‌ప్లే కూడా ఉంది.

వివో వి70 FE (రూ. 37,999) : వివో V70 ఎఫ్ఈలో 200MP + 8MP రియర్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఒరిజిన్OS 6పై మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఒక బిలియన్ కలర్ ఆప్షన్లు, 120Hz రిఫ్రెష్ రేట్ 7000mAh బ్యాటరీ సపోర్ట్‌తో 6.83-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కూడా అందిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ S24 5G (రూ. 44,999) : ఈ శాంసంగ్ గెలాక్సీ ఎస్24 5జీలో 50MP + 10MP + 12MP రియర్ కెమెరా, 12MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఎక్సినోస్ 2400 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. వన్ యూఐ 8.0పై రన్ అవుతుంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ 2600 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందించే 6.2-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X డిస్‌ప్లేతో వస్తుంది.

ఈ జాబితాలో మీ బడ్జెట్‌కు తగిన ఫోన్ ఎంచుకోండి. ఫీచర్లు, ధరలను సరిపోల్చి మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోండి. లేటెస్ట్ టెక్నాలజీతో ఆనందించండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.