|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

భాగ్యశ్రీ బోర్సే: ఫ్లాప్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు! ఆ సినిమా వరంలాంటిదట!

Published: 31-01-2026, 4:05 AM
భాగ్యశ్రీ బోర్సే: ఫ్లాప్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు! ఆ సినిమా వరంలాంటిదట!
  • రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన భాగ్యశ్రీ.
  • దుల్కర్ సల్మాన్‌తో కలిసి కాంత సినిమాలో నటించిన భాగ్యశ్రీ.
  • అఖిల్ హీరోగా నటిస్తున్న లెనిన్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న భాగ్యశ్రీ.
  • కాంత సినిమాలో నటించడం వరంలాంటిదని భాగ్యశ్రీ వ్యాఖ్యానించారు.

భాగ్యశ్రీ బోర్సే నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా, ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. కాంత సినిమాలో నటించడం వరంలాంటిదని ఆమె చేసిన తాజా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆమె లెనిన్ సినిమాలో కూడా నటిస్తున్నారు.

భాగ్యశ్రీ సినీ కెరీర్

Bhagya Shri Borse: భాగ్యశ్రీ బోర్సే పరిచయం అవసరం లేని పేరు. రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిస్టర్ బచ్చన్ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతో ప్రేక్షకులను పూర్తిగా నిరాశ పరిచారు. ఈ సినిమా ద్వారా సక్సెస్ అందుకోలేక పోయినప్పటికీ భాగ్యశ్రీ కి తెలుగులో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల దుల్కర్ సల్మాన్ (Dulquer Salman)తో కలిసి కాంత సినిమా(Kaantha movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు .అనంతరం రామ్ పోతినేనితో కలసి ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇలా వరుస సినిమాల ద్వారా ఈమె ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమాలు ఏవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇలా వరుస డిజాస్టర్లు వెంటాడటంతో ఈమె కెరియర్ కాస్త అయోమయంలో పడింది. ఇక ప్రస్తుతం భాగ్యశ్రీ అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న లెనిన్ (Lenin) సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా పైనే ఈ ముద్దుగుమ్మ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఒకటో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే తెలియజేశారు. మరి ఈ సినిమా ద్వారా అయిన భాగ్యశ్రీ కి సక్సెస్ వచ్చేనా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న భాగ్యశ్రీ తన కెరియర్ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

కాంత సినిమాపై భాగ్యశ్రీ కామెంట్స్

నా సినీ ప్రయాణంలో కాంత సినిమాలో నటించడం నిజంగా నాకు దొరికిన వరం అంటూ ఈమె ప్రశంసలు కురిపించారు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగం కావడం అనేది నిజంగా నాకు దక్కిన అదృష్టం అంటూ తెలియజేశారు. ఈ సినిమాలో నటించడం వల్ల తనకు నటనపరంగా ఎంతో మంచి అనుభవం లభించిందని తెలియజేశారు. కాంత సినిమా సక్సెస్ కాక పోయినప్పటికీ ఈ సినిమా తనకు ఎన్నో నేర్పింది అంటూ భాగ్యశ్రీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

దుల్కర్ సల్మాన్ భాగ్యశ్రీ హీరో హీరోయిన్లుగా తిరిగిన ఈ సినిమా పీరియాడికల్ డ్రామాగా 2025 నవంబర్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు దుల్కర్ తో పాటు రానా దగ్గుబాటి నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక భాగ్యశ్రీ ప్రస్తుతం లెనిన్ షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్యాచప్ వర్క్స్ షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ముందుగా శ్రీ లీల హీరోయిన్ గా ఎంపికయ్యారు. కొంత భాగం శ్రీలీలపై షూటింగ్ అయిన తర్వాత ఈ సినిమా నుంచి శ్రీ లీల తప్పుకోవడంతో తిరిగి భాగ్యశ్రీ ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. మరి ఈ సినిమా అయినా భాగ్యశ్రీ కి హిట్ ఇస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా సక్సెస్ అవ్వడం ఇటు భాగ్యశ్రీ కి అటు అఖిల్ కు కూడా కీలకంగా మారింది.

లెనిన్ సినిమాతో ఆశలు

భాగ్యశ్రీ తన కెరీర్‌లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, ఆమె ముందుకెళ్తున్నారు. లెనిన్ సినిమాతో ఆమె సక్సెస్ సాధిస్తారేమో చూడాలి. ఆమె కాంత సినిమా అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.