
📌 Key Points
- మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌పై నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ భాగ్యలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
- లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ క్లీన్ చిట్ అందుకున్న నటుడు దిలీప్‌కు మోహన్‌లాల్ మద్దతు ఇవ్వడం వివాదాస్పదమైంది.
- దిలీప్ విడుదలైన వెంటనే అతని కొత్త సినిమా ‘భ భ బ’ ప్రమోషన్లలో మోహన్‌లాల్ భాగస్వామ్యం కావడంపై భాగ్యలక్ష్మి మండిపడింది.
- బాధితురాలికి మద్దతు ఇవ్వాల్సిన పెద్దలే ఇలా చేయడం బాధ్యతారాహిత్యమని, నైతికతకు సంబంధించిన విషయమని భాగ్యలక్ష్మి పేర్కొంది.
లైంగిక వేధింపుల కేసులో దిలీప్ నిర్దోషిగా విడుదలైన తర్వాత, అతని కొత్త సినిమా ప్రమోషన్లలో సూపర్ స్టార్ మోహన్‌లాల్ పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. దీనిపై నటి భాగ్యలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మోహన్‌లాల్ నైతికతను, బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నించింది. ఇది సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
మోహన్‌లాల్‌పై భాగ్యలక్ష్మి ఆగ్రహం
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ పై మండిపడింది నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ భాగ్యలక్ష్మి. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ ఈ మధ్యే క్లీన్ చిట్ అందుకున్న నటుడు దిలీప్ కు మద్దతివ్వడంపై ఆమె మండిపడింది.
లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్ నిర్దోషిగా విడుదలైన విషయం తెలిసిందే. తీర్పు వచ్చిన వెంటనే దిలీప్ కొత్త సినిమా ‘భ భ బ’ (Bha Bha Ba) ప్రమోషన్లలో స్టార్ హీరో మోహన్‌లాల్ భాగస్వామ్యం కావడంపై ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, నటి భాగ్యలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితురాలికి మద్దతు ఇవ్వాల్సిన పెద్దలే ఇలా చేయడం “బాధ్యతారాహిత్యం” అని ఆమె మండిపడింది.
అయితే తీర్పు వచ్చిన వెంటనే మోహన్‌లాల్ ఈ సినిమా పోస్టర్లను, ప్రమోషనల్ కంటెంట్‌ను షేర్ చేయడంపై వివాదం రాజుకుంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ (IFFK)లో పాల్గొన్న సీనియర్ నటి భాగ్యలక్ష్మి.. మోహన్‌లాల్ తీరును తప్పుబట్టింది.
దిలీప్ కేసు: వివాదానికి దారితీసిన ప్రమోషన్
“ఇది ముమ్మాటికీ బాధ్యతారాహిత్యమే..”
“తీర్పు వచ్చిన వెంటనే ఆ సినిమా పోస్టర్‌ను షేర్ చేయడానికి ముందు మోహన్‌లాల్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదా? గతంలో ఆ బాధితురాలి కోసం ప్రార్థిస్తున్నానని ఆయన చాలాసార్లు చెప్పారు. అంతటి పలుకుబడి ఉన్న వ్యక్తి ఇలా చేస్తే.. సమాజానికి ఎలాంటి సందేశం వెళ్తుంది? ఇది కేవలం సినిమా విషయం కాదు.. ఇది నైతికతకు సంబంధించిన విషయం” అని ఆమె ప్రశ్నించింది.
నైతికతపై భాగ్యలక్ష్మి ప్రశ్నలు
మంజు వారియర్‌పై దిలీప్ కామెంట్స్
2017లో ప్రముఖ నటిని కారులో కిడ్నాప్ చేసి వేధించారు. ఈ కేసులో దిలీప్ అరెస్ట్ అయ్యాడు. ఎనిమిదేళ్ల విచారణ తర్వాత డిసెంబర్ 8న దిలీప్ నిర్దోషిగా విడుదలయ్యాడు. దిలీప్ విడుదలను సవాలు చేస్తూ పై కోర్టుకు వెళ్తామని కేరళ ప్రభుత్వం ప్రకటించింది.
దిలీప్ కేసు, మోహన్‌లాల్ చర్యపై భాగ్యలక్ష్మి వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో పెద్దల బాధ్యత, నైతికతపై తీవ్ర చర్చకు దారితీశాయి. ఇలాంటి సున్నితమైన విషయాల్లో సెలబ్రిటీల వైఖరి సమాజానికి ఇచ్చే సందేశంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


