|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వైరల్: శివన్నతో భాగ్యశ్రీ జోడీ ఫిక్స్! కోలీవుడ్‌లో టాలీవుడ్ బ్యూటీ సంచలనం!

Published: 08-04-2026, 1:35 PM
వైరల్: శివన్నతో భాగ్యశ్రీ జోడీ ఫిక్స్! కోలీవుడ్‌లో టాలీవుడ్ బ్యూటీ సంచలనం!
  • భాగ్యశ్రీ బోర్సే: శివకార్తికేయన్ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం?
  • ‘అమరన్’ పాటతో వనక్కం చెన్నై అంటూ భాగ్యశ్రీ పోస్ట్
  • శివకార్తికేయన్, శివకుమార్ కాంబోలో ‘సెయాన్’ మూవీ!
  • కమల్ హాసన్ బ్యానర్‌పై గ్రామీణ నేపథ్య చిత్రానికి భారీ అంచనాలు!

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కోలీవుడ్‌లో అడుగు పెట్టేందుకు సిద్ధమైందా? శివకార్తికేయన్ సినిమాలో అవకాశం దక్కించుకుందా? ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కోలీవుడ్‌లో భాగ్యశ్రీ ఎంట్రీ?

యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయిందంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి రెండేళ్లు గడుస్తున్న ఇప్పటివరకు ఈ అమ్మడుకు సరైన హిట్ రాకపోవడంతో.. కోలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అడుగులు వేస్తుందని వార్తలు వచ్చాయి. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్, దర్శకుడు శివకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సెయాన్’. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీని కమల్ హాసన్ తన బ్యానర్‌పై నిర్మిస్తుండటంతో ప్రేక్షకుల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే.. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించనున్నట్లు నెట్టింట ప్రచారం జరిగింది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానప్పటికీ.. ఇది భాగ్యశ్రీకి మంచి ఆఫర్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు అభిమానులు. అయితే.. ఈ వార్తలపై ఇన్‌డైరెక్ట్ హింట్ ఇచ్చేసింది ఈ యంగ్ హీరోయిన్. ఈ మేరకు తాజాగా తన ఇన్‌స్టావేదికగా ఓ స్టోరీ పోస్ట్ చేసింది. అందులో.. శివకార్తీకేయన్ ‘అమరన్’ సాంగ్ పెట్టుకుని ‘వనక్కం చెన్నై’ అనే క్యాప్షన్ జత చేసింది. దీంతో శివకార్తీకేయన్ సినిమాలో భాగ్యశ్రీ భాగం అయినట్లు ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేంసిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

‘వనక్కం చెన్నై’ అంటూ హింట్!

శివకార్తికేయన్‌తో జోడీ కట్టనుందా?

భాగ్యశ్రీ తమిళ చిత్ర పరిశ్రమలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.