|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Bhagyashri Borse : హీరోయిన్ గా ఫస్ట్ సినిమా డిజాస్టర్.. కానీ స్టార్ హీరోలతో వరుస సినిమాలు..

Published: 29-04-2025, 12:16 PM
Bhagyashri Borse : హీరోయిన్ గా ఫస్ట్ సినిమా డిజాస్టర్.. కానీ స్టార్ హీరోలతో వరుస సినిమాలు..

టాలీవుడ్ లో డెబ్యూ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ, భాగ్యశ్రీ భోర్సే స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఆమె సక్సెస్ స్టోరీ ఇది.

Key Points

1

మొదటి సినిమా డిజాస్టర్ అయినప్పటికీ, భాగ్యశ్రీ భోర్సే స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తుంది.

2

విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’, రామ్ పోతినేని, రానా-దుల్కర్ సల్మాన్ ‘కాంత’ చిత్రాల్లో నటిస్తుంది.

4

మరో టాలీవుడ్ సినిమా కూడా ఆమె చేతిలో ఉన్నట్లు సమాచారం.

మొదటి సినిమా ఫ్లాప్..

Bhagyashri Borse : కొంతమంది హీరోయిన్స్ కి సినిమా హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా అవకాశాలు వస్తుంటాయి. వాళ్ళ అందానికో, వాళ్ళ నటనకో అవకాశాలు వెతుకుంటూ వస్తాయి. ఈ హీరోయిన్ కి అలాగే వస్తున్నాయి. హీరోయిన్ గా మొదటి సినిమా డిజాస్టర్ అయినా స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తుంది ఈ భామ.

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో అనుకుంటున్నారా? టాలీవుడ్ లో రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ భోర్సే. ఆ సినిమా డిజాస్టర్ అయింది. కానీ ఆ సినిమా ప్రమోషన్స్ లో చీరల్లో రెగ్యులర్ గా కనపడి బాగా వైరల్ అయింది. మొదటి సినిమా ఫ్లాప్ అయినా ఇప్పుడు వరుస సినిమాలు చేస్తుంది.

స్టార్ హీరోలతో వరుస సినిమాలు..

విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీలీల డేట్స్ ఇష్యూతో ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆ ఛాన్స్ భాగ్యశ్రీ భోర్సేకి వచ్చింది. కింగ్డమ్ సినిమా మే 30న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా తర్వాత రామ్ పోతినేనితో సినిమా చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి భాగ్యశ్రీ భోర్సే పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. మరోవైపు రానా, దుల్కర్ సల్మాన్ కలిసి నటిస్తున్న కాంత సినిమాలో కూడా భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.

భవిష్యత్ ప్రాజెక్టులు..

ఈ మూడు సినిమాలే కాకుండా మరో టాలీవుడ్ సినిమా కూడా భాగ్యశ్రీ చేతిలో ఉన్నట్టు సమాచారం. మొదటి సినిమా పోయినా ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని దూసుకుపోతుంది భాగ్యశ్రీ భోర్సే.

ఫస్ట్ మూవీ ఫ్లాప్ అయినా, భాగ్యశ్రీ భోర్సే తన అందం, నటనతో టాలీవుడ్ లో స్థానం సంపాదించుకుంటోంది. ఆమె భవిష్యత్తు చిత్రాలపై అందరికీ ఆసక్తి ఉంది.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.