|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ పోతినేని సినిమాలో కన్నడ సూపర్ స్టార్.. క్రేజీ కాంబినేషన్ కన్ఫామ్.. టైటిల్ రివీల్ ఆ రోజే

Published: 12-05-2025, 11:02 PM
రామ్ పోతినేని సినిమాలో కన్నడ సూపర్ స్టార్.. క్రేజీ కాంబినేషన్ కన్ఫామ్.. టైటిల్ రివీల్ ఆ రోజే

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించే ‘రాపో22’ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించనున్నారని అధికారికంగా ప్రకటించారు. ఈ క్రేజీ కాంబినేషన్ తో చిత్రంపై అంచనాలు పెరిగాయి. మే 15న టైటిల్ గ్లింప్స్ విడుదల కానుంది.

Key Points

1

రామ్ పోతినేని తదుపరి చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటన

2

ఉపేంద్ర 'సూర్యకుమార్' పాత్రలో కీలక పాత్ర పోషిస్తున్నారు

4

పి. మహేష్ బాబు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రేమ కథ

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రతో రామ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ ఫిల్మ్ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ‘రాపో22’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర యాక్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని హీరో రామ్, మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశాయి. ఉపేంద్రకు వెల్ కమ్ చెప్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

రాపో22 మూవీలో సూర్య కుమార్ క్యారెక్టర్ ను ఉపేంద్ర ప్లే చేస్తున్నారని మేకర్స్ అనౌన్స్ చేస్తున్నారు. స్టోరీ ప్రకారం మూవీలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని తెలిసింది. ‘‘అందని వాడు.. అందరివాడు.. మన సూర్య కుమార్. మన సూపర్ స్టార్ ఉపేంద్రను సూర్య కుమార్ గా పరిచయం చేస్తున్నందుకు గర్వంగా ఉంది. మేం ఆరాధించే సూపర్ స్టార్లు అందరికీ ఇది ఓ ట్రిబ్యూట్’’ అని రామ్ పోతినేని ఎక్స్ లో పోస్టు చేశాడు.

‘రాపో22’ టైటిల్ రివీల్ డేట్

రాపో 22 సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఉపేంద్ర కు వెల్ కమ్ చెస్తూ ఎక్స్ లో పోస్టు చేసింది. ‘‘బ్రిలియంట్ ఉపేంద్ర కు టీమ్ రాపో 22 వెల్ కమ్ చెప్తోంది. సూర్య కుమార్ రోల్ ప్రతి సినిమా ఫ్యాన్ కు గుర్తుండిపోతుంది’’ అని మైత్రీ మూవీ మేకర్స్ పోస్టు చేసింది.

ఉపేంద్రకు వెల్ కమ్ చెప్తూ సోషల్ మీడియాలో రామ్, మైత్రీ మూవీ మేకర్స్ పెట్టిన పోస్టుల్లో మూవీ టైటిల్ రివీల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. మే 15న టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ పి.మహేష్ బాబు డైరెక్షన్ లో రామ్ పోతినేని విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ లవ్ స్టోరీ చేస్తున్నారు.రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే ఆడిపాడుతోంది.

ప్రేమ కథగా రూపొందుతున్న చిత్రం

ఇటీవల ‘యూఐ’ అంటూ థియేటర్లలో సందడి చేశారు ఉపేంద్ర. ఈ వర్సటైల్ యాక్టర్ కు తెలుగులోనూ ఫ్యాన్ బేస్ ఎక్కువే. ఇంకా చెప్పాలంటే కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి, గని సినిమాల్లో ఉపేంద్ర అదరగొట్టాడు. ఇక వరుస ఫ్లాప్ ల్లో ఉన్న రామ్ కు ఇప్పుడు అర్జెంట్ గా ఓ హిట్ కావాలి. అందుకే లవర్ బాయ్ క్యారెక్టర్ అవతారమెత్తాడు. మరి ఉపేంద్ర రాకతో రామ్ రాత మారుతుందేమో చూడాలి.

ఉపేంద్ర రాకతో రామ్ కెరీర్ లో మార్పు వస్తుందో లేదో చూడాలి. ‘రాపో22’ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. మే 15న టైటిల్ గ్లింప్స్ విడుదలతో మరింత ఆసక్తికరంగా మారుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.