|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హీరో, హీరోయిన్ల వనభోజనాలు.. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంటూ స్టార్ డైరెక్టర్ కూతురు కాంప్లిమెంట్!

Published: 13-05-2025, 2:04 PM
హీరో, హీరోయిన్ల వనభోజనాలు.. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంటూ స్టార్ డైరెక్టర్ కూతురు కాంప్లిమెంట్!

తాజాగా, భైరవం సినిమా నటీనటులు వినూత్నంగా వనభోజనాలు జరుపుకున్నారు. స్వయంగా వంట చేసుకుని తినడంతో వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వనభోజనాల గురించి మరిన్ని విశేషాలు ఇక్కడ ఉన్నాయి.

Key Points

1

భైరవం చిత్ర బృందం వనభోజనాలకు వెళ్లి స్వయంగా వంట చేసుకున్నారు.

2

నారా రోహిత్, మంచు మనోజ్ వంట చేసే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

4

మే 30న భైరవం సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

నటీనటుల వినూత్న వనభోజనం

వనభోజనాలు(Vanabhojanalu) అనేవి ఎక్కువగా గ్రామాల్లో చూస్తుంటాం. నగరాల్లో చాలా తక్కువ. ఎక్కడో ఒకచోట నగరాల్లో వనభోజనాలు జరుపుకునే వారు కూడా గ్రామాల నుంచి వచ్చి స్థిరపడిన వారే. అయితే.. తాజాగా నటీనటులు వనభోజనాలు జరుపుకోవడం చర్చనీయాంశంగా మారింది. మంచు మనోజ్(Manchu Manoj), నారా రోహిత్(Nara Rohit), బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌(Bellamkonda Sai Srinivas)లు భైరవం(Bhairavam Movie) అనే సినిమాతో వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రబృందం ప్రస్తుతం ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. ఈ క్రమంలోనే చిత్రబృందం మొత్తం కలిసి వినూత్నంగా వనభోజనాలకు వెళ్లారు. అక్కడ స్వయంగా వారే వంట చేసుకొని మరి అంతా కలిసి తిన్నారు.

సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు

నారా రోహిత్, మంచు మనోజ్‌లు ఫైవ్ స్టార్ హోటళ్లలోని చెఫ్‌ల మాదిరి గరిటే తిప్పే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇవి గమనించిన నెటిజన్లు వాటే థాట్.. ఇలాంటి ప్రమోషన్స్ ఎవరూ ఎక్ట్‌పెక్ట్ చేయలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు మంచు మనోజ్, నారా రోహిత్ చేసిన వంట అదిరిపోయిందంటూ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ కాంప్లిమెంట్ ఇచ్చారు. కాగా, ఈ భైరవం చిత్రానికి విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహించాడు. అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది కథానాయికలుగా నటించారు. మే 30న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.

అదితి శంకర్ ప్రశంసలు

#Bhairavam షూటింగ్ లో అందరూ కలిసి వండుకొని భోజనం చేశారు 👌 pic.twitter.com/MnNajuMPrF

చివరగా, భైరవం చిత్ర బృందం చేసిన ఈ వినూత్న ప్రమోషన్ ప్రయత్నం ప్రేక్షకులను ఆకట్టుకుంది. మే 30న విడుదల కానున్న ఈ సినిమాకు మంచి విజయం సాధించాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.